మామూలుగానైతే బీజేపీ నాయకుడు రఘునందన్ మంచి వక్త… మంచి వకీలు… లాజిక్కులు, లాపాయింట్లు సరిగ్గా పట్టుకుని ఎదుటోడికి చాన్స్ ఇవ్వకుండా దడదడలాడిస్తాడు… కానీ ఈ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది…
తను సోనియా గాంధీ నివాసానికి వెళ్లాడు.,. బ్లిట్జ్ అనే ఓ మ్యాగజైన్ పత్రికలో రాహుల్ గాంధీ రహస్య వివాహం, పెళ్లిళ్లకు సంబంధించిన కథనాలు వచ్చాయి, ఇద్దామని వచ్చాయి అని అక్కడి సెక్యూరిటీ వాళ్లకు చెప్పాడట… వాళ్లు నథింగ్ డూయింగ్ అనేసరికి ఆ కాపీలు వాళ్లకే ఇచ్చేసి, వచ్చేసి మీడియాలో ఏదేదో చెప్పాడు…
తన వాదన ఏమిటంటే..? రాహుల్ బ్రహ్మచారి అని చెబుతున్నారు గానీ… తనకు పెళ్లయ్యింది, పిల్లలున్నారు, ఇదుగో పత్రికల్లో కథనాలు అని చెప్పడం తన ఉద్దేశం… అయితే ఏమిటి..? ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు చెప్పాడంటారా..? ఎస్, కేంద్ర ఎన్నికల సంఘానికి కదా చెప్పాల్సింది… సరే, సుబ్రహ్మణ్యస్వామి చాన్నాళ్లుగా చెబుతున్నాడు, రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని…
Ads
అదీ ఇదీ కలిపి… కేంద్ర హోం శాఖకు కదా రఘునందన్ ఫిర్యాదు చేయాల్సింది… మీ ప్రభుత్వమే కదా… మీరే కదా నిగ్గు తేల్చాల్సింది… ప్రశ్నించాల్సింది మోడీని, అమిత్ షాను కదా… మరి తప్పు చేస్తున్నట్టు నువ్వే ఆరోపిస్తున్న ఆ సోనియా కుటుంబాన్నే, ఆ పార్టీనే ప్రశ్నిస్తే ఎలా..?
సుబ్రహ్మణ్యస్వామి ఎన్నాళ్లుగానో చెబుతున్నాడు… రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉందని… అదీ తేల్చాల్సింది మీ పార్టీ ప్రభుత్వమే కదా… ఎఐసీసీ ఏం చెబుతుంది..? దర్యాప్తు చేసుకోవోయ్ అని చెబుతుంది అంతే కదా…
నువ్వు హిండెన్‌బర్గ్ వాడు ఏదేదో చెబితే నమ్ముతున్నావ్, మా పార్టీవాళ్లు దేశమంతా నిరసనలు ప్రకటిస్తున్నారు, మరి ఈ విషయంపై ఎందుకు మాట్లాడరు అనే పాయింట్ కరెక్టే గానీ… హిండెన్‌బర్గ్ అనే షార్ట్ సెల్లర్, కుట్రదారు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏదో కుట్రపన్నుతున్నాడు అనేది కరెక్టే గానీ… సదరు హిండెన్‌బర్గ్ వాడి మీద మనమేమీ చేయలేమా..? అదెందుకు ఆలోచించకూడదు..?
ఎస్, కాంగ్రెస్ కావాలనే (రకరకాల కుట్ర సిద్ధాంతాలున్నాయి) హిండెన్‌బర్గ్ రిపోర్టు రాగానే బీజేపీ మీద, ఆదానీ మీద విరుచుకుపడుతుంది… కానీ దాన్ని నిరోధించడం ఎలా అని ఆలోచించాలి కదా… ఈ రాహుల్ పెళ్లిళ్లు, ప్రియురాళ్ల మీద పడి ఏడిస్తే ఎలా సార్..? పైగా ఆ బ్లిట్జ్ కథనం అత్యంత నాసిరకంగా, ఏమాత్రం నమ్మలేనట్టుగా ఉంది…
https://weeklyblitz.net/2024/08/16/rahul-gandhi-the-unveiling-of-shocking-dark-secrets-behind-the-incs-heir/?amp=1
ఆ కథనం చదివితే రాహుల్ గాంధీ విశ్వమానవుడు అనీ, రకరకాల దేశాల మహిళలతో, అనేక మతాల మహిళలతో సంబంధాలున్నాయనీ, అన్నీ అల్లిబిల్లిగా అల్లుకున్న సంబంధాలు అని చిత్రీకరిస్తున్నట్టుగా సాగింది… కానీ ఒక్కటీ సరైన ఆధారం చూపలేదు… ఏదేదో కథ అల్లినట్టుగా ఉంది… ఐనా సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మీదే ఈరోజుకూ అమిత్ షా స్పందించలేదు… అది కదా సరిగ్గా నిగ్గుతేల్చి, ద్వంద్వ పౌరసత్వం పేరిట రాహుల్ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సింది… చేయగలదా మోషా ప్రభుత్వం..?
రఘునందన్ వాళ్లను అడగలేడు గానీ… ఈ పెళ్లిళ్లు, ప్రియురాళ్లు, పిల్లల కథలు చెబితే ఎవరు నమ్ముతారు బాసూ..?! (పైన ఇచ్చిన లింకు కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే… ముచ్చట ఎండార్స్ చేయడం లేదు…)
Share this Article