అమెరికా… ప్రత్యేకించి డాలస్ రాహుల్ గాంధీ పాల్గొన్న కార్యక్రమాల విశేషాలు వింటుంటే అందులో కొన్ని నవ్వు పుట్టించాయి, కొన్ని చిరాకెత్తించాయి… కొన్ని ఆసక్తిని రేపాయి… మొదటిది… రెండు మూడొందల మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేని శ్రీనివాసరెడ్డి బొమ్మలు ప్రముఖంగా ముద్రించిన అంగీలు వేసుకుని వచ్చారు…
నాలుగైదు వేల దాకా హాజరైతే… అందులో భిన్న ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లున్నారు… కాగా ప్రత్యేకంగా తెలంగాణ ఇష్యూసే చర్చనీయాంశం… ఒకావిడ మైక్‌లోనే ఆవేశంగా… హైడ్రా ఏర్పాటు, దూకుడు అన్ని సమస్యలకూ సర్వరోగనివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టుగా ఉపన్యసించింది… మరోవైపు ఉత్తమ్, పొంగులేటి గ్రూపుల బలప్రదర్శన… ఇంట్రస్టింగ్…
అక్కడ తెలంగాణ కనిపిస్తుంటే, రాహుల్ గాంధీ మాత్రం తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నట్టుగా మాట్లాడటం విశేషం… ఆర్గనైజర్లు ఎవరో గానీ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు… దాంతో రాహుల్ హిందుత్వ వంటి అంశాలను ప్రస్తావించాడు… ఇండియాలో మైనారిటీల అణిచివేత అని ఏదో అంటుంటే వీఐపీ గ్యాలరీ నుంచే మరి బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతల మాటేమిటి అనే ప్రశ్న వినిపించింది…
Ads
కులగణన జరగాల్సిందే అని ప్రస్తావించినప్పుడు సభికుల్లోనే మరి రాహుల్ కులమేమిటనే చర్చ… ఇండియాలో జాతులు, రూపురేఖల మీద తిక్క వ్యాఖ్యానాలు చేసి, దేశవ్యాప్తంగా విమర్శల్ని ఎదుర్కుని కాంగ్రెస్‌కు రాజీనామా కూడా చేసిన శామ్ పిట్రోడా మళ్లీ రాహుల్ అమెరికా పర్యటనలో ఫుల్ యాక్టివ్ అయిపోయాడు… తను కాంగ్రెస్‌ను వదలడు, కాంగ్రెస్ తనను వదలదు…
ఓసారి తన ప్రసంగంలో రాహుల్ ఇక ఎంతమాత్రమూ పప్పు కాదనీ, పరిపక్వత (మెచ్యూరిటీ) వచ్చిందనీ ఏదో చెబుతూ పోయాడు… అంటే ఇప్పటిదాకా పప్పు అని అంగీకరించినట్టా..? ఇన్నాళ్లూ మెచ్యూర్డ్‌గా వ్యవహరించలేదని ఒప్పుకున్నట్టేనా..? ఇదీ సభికుల్లోకి పరోక్షంగా వెళ్లినట్టయింది… ఐనా రాహుల్ పప్పు అనే విమర్శల్ని పదే పదే ప్రస్తావించడం తనకు, పార్టీకి నష్టదాయకం అవుతుందనే సోయి కూడా లేదు పిట్రోడాకు..! ఇన్నాళ్లు ప్రతిపక్ష పాత్ర లేదని, ఇప్పుడు ప్రతిపక్షనేతగా రాహుల్ అవతరించడం విశేషమంటూ మరొకరి ప్రసంగం… అంటే పదేళ్లపాటు కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదా కూడా రానంత దురవస్థలో కాంగ్రెస్ ఉందని పరోక్షంగా చెప్పడం…
హఠాత్తుగా సభికుల్లో నుంచి ఒకామెను ఆర్గనైజర్లు పిలిచి మైక్ ఇచ్చారు… ఆమె హిందుత్వ మీద తెగ విరుచుకుపడింది… ఈ సభ కేవలం యాంటీ హిందూ ప్రాపగాండా కోసం ఉద్దేశించిందా అనే భావన సభికుల్లో కలగడానికి కారణమైంది… నిజానికి వేరే దేశం వెళ్లినప్పుడు మన దేశంలోని రుగ్మతల్ని ఏ నాయకుడైనా సరే ఫోకస్ చేయకూడదు… అవన్నీ మన ఇంటర్నల్… ఈ మెచ్యూరిటీ రాహుల్ మీటింగుల్లో కనిపించలేదు… ఇదీ తన కార్యక్రమాల్ని అమెరికాలో నిశితంగా పరిశీలించే కొందరి అభిప్రాయం…
మన దేశంలో పెట్టుబడులు పెట్టండి, సహకరిస్తాం, ఎక్కడున్నా మనమంతా ఒక్కటే, మనకు మంచి పేరు తీసుకురండి వంటి పాజిటివ్ మాటలు చెబుతూ ఉంటారు ఎక్కడికి వెళ్లినా మన నాయకులు… కానీ రాహుల్ కార్యక్రమాలు మాత్రం మన దేశ రాజకీయాల బురదను అక్కడిదాకా మోసుకుపోయినట్టు సాగడం బాగాలేదనేది కొందరి వ్యాఖ్య… మోడీ సెంట్రిక్ పొలిటికల్ వ్యాఖ్యలు మరీ ఎక్కువైపోయాయి తన పర్యటనలో..!!
Share this Article