చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్…. మోసం చేసాడు అంటూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ హీరోయిన్ లావణ్య.. హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు…
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది… 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది… తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది…
సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది… రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది…
Ads
3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది… లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా… ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు… అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది… రాజ్‌తరుణ్ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది…
అంతేకాదు, హిమాచల్ ప్రదేశ్ CM తమ నాన్నకు ఫ్రెండ్ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది… మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది… కానీ తాను రాజ్‌తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది… తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది…
.
ఏమైనా అర్థమైందా..? అంతే… ఈ సినిమా సెలబ్రిటీల సంబంధాలు, వివాదాలు ఇలాగే ఉంటయ్… మీడియా ఆ మంటలో పెట్రోల్ పోస్తుంది… సదరు లావణ్య పదకొండేళ్లుగా రిలేషన్‌లో ఉందట, పెళ్లి మాత్రం చేసుకోలేదట… అసలు ఈ కంప్లయింట్ చేయడానికి సిగ్గుండాలి… తాత్కాలిక బంధాలకు ఎప్పుడైతే సరేనంటామో అప్పుడే తప్పించుకోవడానికి చాన్స్ మనమే ఇచ్చినట్టు… పైగా ఇది సినిమా ఫీల్డ్… బోలెడు ఆకర్షణలు… ప్రలోభాలు, వ్యామోహాలు… ఒక దగ్గర మోజు తీరితే మరోచోట వెతుక్కునే కక్కుర్తి వేషాలు…
మేం రిలేషన్ షిప్‌లో ఉన్నామమో అని చెబితే పోలీసులు ఏం చేయాలి..? ఏదో ఓ తిక్క కేసు అని కేసు నమోదు చేసుకుని వదిలేయడమే… లేకపోతే దానికి ప్రూఫ్స్ ఏముంటయ్..? కలిసి ఉండే బంధానికి హక్కులు ఏముంటయ్..? చట్టానికి ఆ బంధాలతో పనేముంది..? జస్ట్, మీడియోను పిచ్చోళ్లను చేయడం… అవునూ… ఇదేదో సినిమా పబ్లిసిటీ కోసం పన్నిన ఎత్తుగడ కాదు కదా… సదరు గొప్ప హీరో రాబోయే సినిమా ఏముందో ఇప్పుడు..!!
రిలేషన్ నిజమే, కానీ డ్రగ్స్ కి అలవాటైంది… వేరేవాడితో ఎఫైర్… అందరినీ మోసం చేస్తోంది అని అంటున్నాడు రాజ్ తరుణ్… ఏం జీవితాలుర భయ్…
Share this Article