.
అప్పుడప్పుడూ బార్క్ రేటింగు లిస్టులను గెలకడం అలవాటు కదా… సరే, వాటి క్రెడిబులిటీ మీద ఎంత అపనమ్మకం ఉన్నా సరే… టీవీ ప్రోగ్రాములకు రేటింగులకు ఇప్పుడున్నది అదొక్కటే ప్రామాణికం కాబట్టి, చూస్తూ ఉంటాం…
ఈ వారం రేటింగ్స్ చూస్తూ ఉంటే, హఠాత్తుగా ఓచోట కళ్లు పెద్దవైపోయి, దానివైపే చూస్తుండిపోయాయి… అసలు జెమిని టీవీ చూసేవాడే తక్కువ తెలుగు టీవీ ప్రేక్షకుల్లో… పేరుకు నాలుగు వినోద చానెళ్లలో ఒకటి అది… కానీ అయిదో ప్లేసులోనో ఉండి ఉంటుంది… ఏమో, ఐదో ప్లేసుకు పోయిందేమో తెలియదు…
Ads
కానీ దాని టాప్ 30 జాబితాలో రాజా సినిమా పేరు కనిపించింది… అదీ బ్రాకెట్లో వెంకటేష్ అని… అదేమిటయ్యా అంటే అప్పుడెప్పుడో పాత జమానాలో రిలీజైన వెంకటేష్, సౌందర్య సినిమా… దానికి ఇప్పుడు 4.88 రేటింగ్స్ వచ్చాయి… హైదరాబాద్ కేటగిరీలో… మొత్తం కలిపితే 5.5 దాటి ఉంటుందేమో…
అసలు ఆ 1999 సినిమా ఏమిటి..? ఇప్పుడు ఈ రేటింగ్స్ ఏమిటీ..? అసలు పెద్ద పెద్ద తోపుల కొత్త సినిమాలు కూడా ఈ రేటింగ్స్ సంపాదించడం లేదు, అసలు టీవీల్లో సినిమాలు చూసేవాడే లేడు… ఈ రేటింగ్స్ ఏమిటి అనేది డౌట్… మరోసారి కళ్లు నులుముకుని చూసినా అదే కనిపిస్తోంది…
నవ్వొచ్చింది ఏమిటంటే… ఈటీవీ తాజా ప్రోగ్రాముల్లో దేనికీ అంత రేటింగ్స్ లేవు… ఫాఫం, మరీ అంత దిగజారిపోయింది ఈటీవీ… కానీ 26 ఏళ్ల క్రితం రిలీజైన రాజా సినిమాను వందల సార్లు వేసి ఉంటుంది జెమిని టీవీ… కానీ ఈరోజుకూ అది ఎవర్ గ్రీన్ కావడం, ఈటీవీ అన్ని షోల రేటింగులనూ మించిపోవడం విచిత్రం అనిపించింది…
ఇంకాస్త సెర్చితే… రెండుమూడేళ్ల క్రితం కావచ్చు పుష్ప పునఃప్రసారం రేటింగులకు దీటుగా ఈ రాజీ పునఃపునఃపునః ప్రసారానికి రేటింగ్స్ వచ్చాయని కనిపించింది ఓ వార్త… అసలు ఏముంది ఈ సినిమాలో..? అదీ ఇంట్రస్టింగు…
మామూలు స్టోరీయే… కాకపోతే మంచి పాటలు, కాస్త కామెడీ ప్లస్ సౌందర్య… తెలుగు ప్రేక్షకుల్లో బహుశా చూడనివారు ఉండరు, అన్నిసార్లు వచ్చింది జెమిని టీవీలో… ఐనాసరే, ఈరోజుకూ ఈతోపు రేటింగ్స్ రావడం అంటే… ఎక్కడైనా ఏదైనా తేడా కొడుతోందా..? లేక నిజంగానే జనం ఈరోజుకూ ఆసక్తితో చూస్తూనే ఉన్నారా…? చిక్కు ప్రశ్నే..!!
Share this Article