.
Bharadwaja Rangavajhala … మార్క్సీయ వాక్యం … శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి.
అదే వాక్యం కొంచెం కామెడీగా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది.
అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని …
ముళ్లపూడి వెంకట్రమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ … ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు …
Ads
మన ఊరి పాండవులు చిత్రంలో ఆయన రాసిన సీను …
“ మనోళ్లు మనూళ్లోనే ఫ్యాక్టరీలు అయ్యీ పెట్టేసి దారుణంగా అభివృద్ది చేసేస్తారు … ఆ తర్వాత ఇక మీ పిల్లలకీ ఉద్యోగాలొస్తాయి … ఈ లోగా మీకు టీలు కాపీలు అమ్ముకునే కాంట్రాక్టులొస్తాయి .. మరి అందుకోసం మీరు మరి ఇరాళాలియ్యాల … భూములియ్యాల ”
అంటూ దాదాపు మన అమరావతి రోజుల్లో అధికారపక్ష నాయకులు చెప్పినట్టే చెప్తారు …
ఆ ఊరి దొరగారైన రావుగోపాల్రావుగారు.
సెజ్ ల కోసం ఫ్లైవోవర్ల కోసం … రాజధానుల కోసం … పవర్ ప్రాజెక్టుల కోసం … ఇట్టా దేనికి పడితే దానికి భూసేకరణలు జరిపేయడం లాండు పుల్లింగు, లాగింగు లాంటి దిక్కుమాలిన ఇంగ్లీషు పేర్లెట్టి చేసేస్తున్న సింగపూరాభివృద్ది మొత్తాన్ని అలా ఓ సీనులో చూపేశారాయన.
అట్టాగే … ఎన్నికల వ్యవస్థ మీద జోకేస్తూ. ..
మీ నల్లదొరలకు ఓట్లేయాలంటే ఈ బక్కోళ్ల ఒంట్లో కూసింత ఓపికుండాల కదరా … అంటాడు … కృష్ణావతారంలో కృష్ణ.
ఇక అదే సినిమాలో మరో సీనులో అసలు మేమే కనుక అజ్ఞానం కొద్దీ నేరాల్చేయకపోతే … కోర్టులిండస్ట్రీ, పోలీసిండస్ట్రీ, జైళ్లిండస్ట్రీ అన్నీ ఏటైపోవాల .. మేం ఇలా కొవ్వుత్తుల్లా మా జీవితాలను కాలబెట్టుకుంటూ మీ పోలీసోళ్ల, లాయర్ల జడ్జీల జైలధికారుల ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తున్నాం అంటాడు … ఈరో కృష్ణ.
కోర్టుల్నీ, జైళ్లనీ, పోలీసుల్నీ ఇండస్ట్రీ చేయడంలోనే ఓ అద్భుతమైన చమక్కు కనిపిస్తుంది …
అందాల్రాముడులో తీతా అయితే …
ఏమండీ రామదాసు ప్రభుత్వం వారి సొమ్ముతో రాముడికి గుడి కట్టిస్తే ఆయన్నేమో గొప్ప భక్తుడని కొలుస్తారా …
నేనేదో తల దాచుకోడానికి ఓ చిన్న ఇల్లు ప్రభుత్వం వారి సొమ్ముతో కట్టించుకుంటే నేరమా అని తీసేసిన తాసీల్దారుగారు విసుక్కోవడం …
ఇలా అనేకం …
పైగా ఆయన రాసే పొలిటికల్ డైలాగుల వెనుక ప్రోగ్రెసివ్ లిటరేచర్ ఇన్ఫులెన్స్ కనిపిస్తుంది.
అంతే కాదు అపారమైన ఆయన జీవితానుభవంతో పాటు చదివిన ప్రపంచ సాహిత్యమంతా కనిపిస్తుంది.
రాజాధిరాజు సినిమా విషయానికి వస్తే …
ఆ సినిమాకు సంబంధించి నాకేం పెద్ద ఊహలేం లేవు.. అప్పుడు నేను ఇంటరో హంటరో చదువుతున్నా … జంధ్యాల గారు చెప్పినట్టు …
రాజాధిరాజు అనే సినిమా విడుదలైన రోజే శోభన్ బాబు నటించిన చేసిన బాసలు అనే సినిమా కూడా విడుదలైంది. అదేమో రామా టాకీసులోనూ …
మరి రాజాధిరాజేమో కళ్యాణ చక్రవర్తిలోనూ వేశారు.
అయితే … మా మిత్ర బృందం అంతా చేసిన బాసలు సినిమాకు వెళ్లారు.
నేనూ ప్రసాదూ మాత్రం రాజాధిరాజుకు వెళ్లాం.
మా రాధాకృష్ణ గాడైతే … అదేదో డివోషనల్ సినిమా బొత్తిగా ఎమోషన్స్ ఉండవు అని మరీ చేసిన బాసలు కు వెళ్లిపోయాడు.
అదీ తన్నేసిందనుకోండి … రాజాధిరాజూ తన్నేసింది.
అయితే రాజాధిరాజు సినిమా చూడ్డానికి కొద్ది రోజుల ముందు మానికొండ లైబ్రరీలో మార్క్ ట్వేన్ రచన మిస్టీరియస్ స్ట్రేంజర్ తెలుగు అనువాదం విచిత్ర వ్యక్తి చదివాను.
నండూర్రామోహన్రావుగారు … అనువదించినది … చాలా విచిత్రంగా అదే నవల కొద్ది పాటి మార్పులతో తెరకెక్కినట్టు అనిపించింది.
విజయచందర్ కు కరుణామయుడుతో వచ్చిన ఇమేజ్ కి ఒక రకంగా బొక్కేసిందీ సినిమా …
సినిమా బానే ఉన్నప్పటికిన్నీ …
సబ్జక్టు ఎంపికలో కాస్త భక్తిరసం తగ్గి … ఓడిపోయిన దేవుడి మీద కాన్సన్ ట్రేషన్ పెరిగిపోయి …
మిస్టీరియస్ స్ట్రేంజర్ ఇన్ ఫ్యులెన్స్ కు గురై …
నేను ఓడిపోయిన దేవుణ్ణి శిశువా … అసలు నేను హీరోని కానీ విలనంటారు దుర్మార్గంగా అనిపిస్తారు సైతానుతో ..
ఇలా సినిమా అంతా సైతాను గోలెక్కువై పోయి ..
భక్తుల మనసులు గెల్వలేకపోయింది …
అలా బాపు రమణ కల్సి విజయచందర్ కు ఓ ఫ్లాపును దయ చేశారు.
అది క్రైస్తవ సినిమా అని హిందువులూ
సైతాను సినిమా అని క్రైస్తవులూ సినిమాను దూరంగా ఉంచారన్నమాట.
రామారావు చేసేవాడీలాంటి పన్లు …
దేవుడి సినిమాలు తీస్తూ తాను రాక్షస వేషం వేసి అవే గొప్ప మానవత్వం ఉన్నవి అని ప్రూవ్ చేయించే ప్రయత్నం చేసేవాడు.
అయితే ఏదో నాలుగైదు సినిమాలు నడిచాయి గానీ ఈ ధోరణిలో తీసిన చాలా సినిమాలు ఆయనవే తన్నేసినాయి…
భక్తులా మజాకానా … అది రాజాధిరాజు కథ …
పైగా ఇంకో సెక్యులర్ పైత్యం శ్రీ రామచిత్ర అని బ్యానర్ పేరెట్టడం … సినిమా తన్నమంటే తన్నదూ మరీ …
ఏ .. క్రైస్తవ సినిమా తీసేప్పుడే …
సైతాను పాత్ర గుర్తొచ్చి దాని మీద కాన్సన్ ట్రేట్ చేయాలనెందుకు అనిపించింది…
మరి అన్ని రామాయణాలు తీశారు కదా …
బాపు రమణలు …
అప్పుడెందుకు రావణ పాత్రకు అల్లాంటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు …
అనే అంశం మీద బాపు రమణల్ని నిలదీయవచ్చనుకోండి … అది వేరు సంగతి …
అంటే హిందువుల సినిమాకొకనీతీ క్రైస్తవ సినిమాకో నీతా యువరానర్ …
ఇలాంటి రాజాధిరాజులో నూతన్ ప్రసాద్ పాత్రేదైతే ఉందో
అది ముత్యాలముగ్గులో కాంట్రాక్టర్ పాత్రలా
పేలుద్దనుకున్నారు.
కానీ అంత కాదు కదా … అందులో మూడో వంతు కూడా పేల్లేదు.
ఇలాంటి గోల్డెన్ ఆఫర్ ఆ మధ్య రాజేంద్రప్రసాద్ కు కూడా ఇచ్చారు బాపు రమణలు …
దాని పేరు రామబంటు …
అందులో కోట కారక్టరు కూడా ముత్యాలముగ్గు కాంట్రాక్టరై పోతాడనుకుంటే
నా వల్ల కాదు బాబూ అనేసింది …
రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది పాపం …
అంచేత అదీ రాజాధిరాజు రేపిన జ్ఞాపకాల వెల్లువ …
Share this Article