.
పొద్దున ఓ కథనంలో చెప్పుకున్నాం కదా… రాజాసింగ్ పార్టీ మీద అలగడం కొత్త కాదు… ‘‘రాజాసింగ్‌ను బీజేపీ ఒదులుకోదు… బీజేపీని రాజాసింగ్ ఒదలలేడు…’’ అని ముందు నుంచీ చెప్పుకుంటున్నదే… అప్పుడప్పుడూ కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటూ ఉంటాయి…
తనను పార్టీ ఆఫీసుకు రానివ్వకపోవడం దాకా గతంలో పలు ఉదాహరణలున్నాయి… కాకపోతే తను అధ్యక్ష పదవి విషయంలో కినుకవహించి రాజీనామా సమర్పిస్తే, దాన్ని బీజేపీ మరోమాట లేకుండా ఆమోదించడం కొంత విస్మయకరమే…
Ads
ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కుటుంబం… మొదట్లో టీడీపీ, కార్పొరేటర్… 2014 నుంచి ఇక పూర్తిగా బీజేపీయే… తరచూ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు… 2022లో తనను పార్టీ నుంచి బహిష్కరించారు… మళ్లీ 2023 ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకుని మళ్లీ టికెట్టు ఇచ్చారు…
అంతకుముందు ఒక దశలో అసెంబ్లీలో పార్టీ తరఫున తనొక్కడే ప్రాతినిధ్యం… 2018 ఎన్నికల్లో పార్టీ 118 సీట్లకు పోటీచేస్తే గెలిచింది రాజాసింగ్ మాత్రమే… మొన్నటి రాజీనామా ఆమోదం తరువాత బోలెడు వార్తలు.,.,.
అదుగో శివసేనలో చేరుతున్నాడు, తెలంగాణ శివసేన పగ్గాలు… కాదు, కాదు, బీఆర్ఎస్‌లోకి పోతాడు… నో, కాంగ్రెస్‌లో చేరతాడు… అబ్బే, మహారాష్ట్రలో ఠాక్రే శివసేన తరఫున పోటీచేస్తాడు… ఇలా బోలెడు ప్రచారాలు… హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీచేసిన మాధవీలత అయితే ఉపఎన్నిక వస్తే నేను పోటీ చేస్తాను అని తొందరపాటు ప్రకటన చేసింది…
తను ఎక్కడికీ పోడు… ఈరోజు మీడియాతో చిట్‌చాట్ చేస్తూ అదే చెప్పాడుె… ఒకవేళ పార్టీ గనుక ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నాడు… ఏ పార్టీలోనూ చేరేది లేదంటున్నాడు… అసలు తన సపోర్ట్ లేకుండా అక్కడ బీజేపీ ఎవరిని పోటీలో దింపినా గెలుపు కల్ల… ఐనా రాజాసింగ్ కాస్త దూకుడు ధోరణిలో వెళ్తాడు తప్ప పార్టీకి చేసిన ద్రోహం ఏముంది..? పార్టీకి నష్టం ఏముంది..? తనను కాపాడుకోవాలి…
తను ఏదైనా పార్టీలో చేరితే, వెంటనే తనపై అనర్హత వేటు వేయాలని బీజేపీ కోరుతుందనే ప్రచారం ఉంది… అతా తనను చేస్తే మరి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరినవారి పరిస్థితి..? వాళ్లకో న్యాయం, రాజాసింగ్‌కో న్యాయం ఉండదు కదా… సరే, అది స్పీకర్ విచక్షణాధికారం…
అసలే హైదరాబాద్ మేయర్ పోస్టు ఈసారి కొట్టాల్సిందే అనుకుంటున్న బీజేపీ అధిష్ఠానం పాజిటివ్ ధోరణితో వెళ్లాలి… గోషామహల్‌లో బీజేపీని గెలిపిస్తున్నది కేవలం హిందూ వోటు కాదు, అది రాజాసింగ్ వోటు కూడా… తనపై బోలెడు కేసులున్నాయి… తను చాలామందికి టార్గెట్… సో, తన భావజాలానికి బీజేపీయే కరెక్టు… సో, బీజేపీ ముఖ్యనేతలు ఇటు రాజాసింగ్, అటు ఈటల వివాదాల్ని సామరస్య ధోరణిలో పరిష్కరిస్తే… పార్టీకే మేలు…!!
Share this Article