Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిక్కుమాలిన పాత్రికేయం… మన ‘‘గొప్ప’’ టీవీ యాంకర్లు నయమేమో..!!

May 30, 2025 by M S R

.

అయిపోయింది … భారత జర్నలిజంలో అతిపెద్ద పేర్లలో ఒకరైన రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఇండియాటుడే యాజమాన్యం పీకిపారేసింది, లేెకపోతే ఏమిటా పిచ్చి కూతలు..? అని మొన్నటి నుంచీ సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపించాయి…

నిజంగా ఇండియాటుడే ఆ పనిచేసిందా…? చేయలేదు… అంటే డిడ్ నాట్, కెనాట్… అందుకే తన పేరు ఇంకా కనిపిస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉన్నాడు… అంత బలహీనమైన యాజమాన్యమా..? ఇప్పుడిది మరో చర్చ…

Ads

అసలే ఉద్రిక్తతల వేళ, గతంలో ఏవో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రెండు వారాలు పక్కన పెట్టింది మేనేజ్‌మెంట్… ఓ నెల జీతం కోసేసింది… తరువాత అంతా వోకే… ఆయనకు వేరే దిక్కు లేదు, వాళ్లకూ ఆయన తప్ప వేరే దిక్కులేదు…

నిజానికి తాజాగా తనేమన్నాడు..? నిజంగానే పిచ్చి కూతలు… వీళ్లా మన జర్నలిజాన్ని శాసిస్తున్న తోపులు అని మనమీద మనమే జాలిపడేలా… అటు రిపబ్లిక్ ఆర్నబ్ ఒక ఎక్స్‌ట్రీమ్ అనుకుంటే ఇది మరీ ఎక్స్‌ట్రీమ్…

‘‘పీవోకేను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలి… అదే శాశ్వత పరిష్కారం… ఇప్పటి వాస్తవాధీన రేఖనే అధికారికం చేసేయాలి… పాకిస్థాన్ ఆయుధ సంపత్తిని తక్కువ అంచనా వేయొద్దు.,. అసలే అణ్వస్త్ర దేశం అది…’’ అన్నాడు…

సోషల్ మీడియా విరుచుకుపడింది… ఇదా నీ జర్నలిజం అంటూ ఇండియాటుడే యాజమాన్యాన్ని కూడా తిట్టిపోసింది… ఇంత జరుగుతున్నా, తన వ్యక్తిగత మూర్ఖ అభిప్రాయాల్ని రుద్దుతున్నా ఆ సంస్థ నుంచి ఓ వివరణో, దిద్దుబాటో కూడా జరగలేదు…

ఒకవైపు దేశమంతా పాకిస్థాన్ దుశ్చర్యల మీద రగిలిపోతున్న వేళ… దాన్ని తక్కువ అంచనా వేయొద్దు, అది చెప్పినట్టు విందాం అని హితబోధకు దిగాడు ఆయన… పాకిస్థాన్ మొత్తం కశ్మీరాన్ని అడుగుతోంది, అది ఇండియా మీద మతయుద్ధం చేస్తుందనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది ఆ జర్నలిస్టుకు..?

ఇచ్చేద్దామా..? చైనా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ కావాలంటోంది, ఇచ్చేద్దామా..? దాని ఆయుధ సంపత్తి మరీ పెద్దది… ఇదెక్కడి వాదన..? రేప్పొద్దున ఖలిస్థానీ శక్తులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ సహా కావాలంటారు… ఇచ్చేద్దామా..? చివరకు బంగ్లాదేశ్ కూడా పశ్చిమ బెంగాల్ మాదే అంటే..? ఇచ్చేద్దామా..?

దిలీప్ సర్దేశాయ్ అనే మాజీ క్రికెటర్ కొడుకు తను… ఇంత సుదీర్ఘ పాత్రికేయంలో తను నేర్చుకున్నది ఇదేనా..? తన భార్య సాగరిక ఘోష్ మరో ఎక్స్‌ట్రీమ్… తనూ జర్నలిస్టే… పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో చేసింది… చివరకు మమత బెనర్జీ క్యాంపులో చేరి, రాజ్యసభ సభ్యురాలయింది… ఆమె కూడా సేమ్ భర్తలాగే, తన బాస్ మమతలాగే మాట్లాడుతుంది…

ఆమె ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచే వచ్చింది… తండ్రి ఐఏఎస్… దూరదర్శన్ మాజీ డీజీ… ఇద్దరు అత్తల్లో ఒకరు మాజీ రాయబారి, దౌత్యవేత్త… మరొకరు సుప్రీంకోర్టు మాజీ జడ్జి… కొడుకు డాక్టర్, బిడ్డ లాయర్… అంతటి విద్యావంతుల కుటుంబానికి చెందిన ఆమెకు, భర్తకు మాత్రం తమ నాలుకలపై మాత్రం అదుపు లేదు… ఫాఫం…!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions