.
ఓ ఫోటోతో మిత్రుడి పోస్ట్… ‘‘ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు
కానీ బీసీసీఐలో శాశ్వతంగా ఉండేది రాజీవ్ శుక్లా మాత్రమే.
– కామెడీగా అనిపిస్తున్నా.. ఇది నిజమే. పైగా ఇతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అసలు ఎలా ఈ బీజేపీ ఆధిపత్య కాలంలో తన పదవిని కాపాడుకుంటున్నాడు? … #భాయ్‌జాన్
.
ఏదో రవితేజ సినిమాలో ఓ డైలాగ్ గుర్తుంది కదా… కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్… ఇదే డైలాగ్ గుర్తొచ్చింది… ఆ ఫోటో చూడండి, ఫుల్ సెటైర్… బాగుంది…
Ads
అవును, ఇప్పుడు ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది కదా, చార్లెస్-3 ని కలిసిన ఫోటోలు కూడా మీడియాలో వచ్చాయి కదా… అక్కడ కూడా తను రాసిన ఏదో బుక్‌ను రాజుగారికి ఇచ్చిన రాజీవ్ శుక్లా తనే హైలైట్ అయ్యాడు… ప్రస్తుతం తను బీసీసీఐ వైస్ చైర్‌పర్సన్…
తను నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండనీ, చివరకు అమిత్ షా కొడుకు జైషా పెత్తనం కింద ఉన్నా సరే బీసీసీఐ వ్యవహారాలన్నీ తనే మేనేజ్ చేస్తుంటాడు… మరి ఏ పార్టీ వాళ్లున్నా తన పెత్తనమే ఎలా నడుస్తోంది..? తన గురించి ఓసారి చెక్ చేస్తే… తను కాంగ్రెస్ పార్టీయే…
వరుసగా రాజ్యసభకు కూడా అవకాశం ఇస్తుంటుంది కాంగ్రెస్… యూపీ… మాజీ జర్నలిస్టు, మాజీ థియేటర్ ఆర్టిస్టు… తరువాత రాజకీయాలు… కొన్నిసార్లు ఐపీఎల్ చైర్మన్… తను కాంగ్రెసే కానీ తను పెళ్లి చేసుకున్నది బీజేపీ ముఖ్యనేతల్లో ఒకడైన రవిశంకర్ ప్రసాద్ సోదరి అనురాధా ప్రసాద్‌ను… సో, ఐనవాడే అందరికీ, ఐనా అందడు ఎవ్వరికీ టైపు…
మన చాముండేశ్వరీనాథ్ తరహా… అందరూ మనవాళ్లే, అన్నీ మనవే టైపు అన్నమాట… ఇప్పుడు జైషా ఐసీసీ పగ్గాల బాధ్యతలో ఉన్నాడు కదా… ఇక బీసీసీఐకి సంబంధించి చైర్మన్ రోజర్ బిన్నీ ప్లస్ ఈ రాజీవ్ శుక్లాలదే పెత్తనం… 70 ఏళ్లు నిండుతున్నాయి కదా, రిటైర్ కావాలి, కానీ తన కోసం క్రీడాసంబంధ పోస్టుల్లో వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచబోతున్నది కేంద్ర ప్రభుత్వం… సో, ఎవరెంత నడిపించుకోగలిగితే అంత ఆధిపత్యం..!
Share this Article