.
సినిమా సెలబ్రిటీలు ఎప్పుడూ అదే టైపు… నాలుకకు అదుపు ఉండదు, సినిమా ఫంక్షన్లలోకి కూడా నైన్టీ వేసుకుని వస్తారా లేక ఆ గుణమే అదా తెలియదు గానీ… ఈమధ్య బోలెడు ఉదాహరణలు చూశాం, విన్నాం, చదివాం కదా…
ప్రపంచంలో నాకన్నా మంచి నటుడు ఉండడు అనే మోహన్‌బాబు దగ్గర నుంచి… నాగవంశీ, శ్రీముఖి, దిల్ రాజు, అనంత శ్రీరాం, శ్రీకాంత్ అయ్యంగార్ ఎట్సెట్రా… కొందరు క్షమాపణలు చెప్పుకున్నారు… అర్జెంటుగా లెంపలేసుకున్నారు… కొందరు పర్లేదు, మేమిలాగే ఉంటాం అన్నట్టు కీప్ క్వయిట్…
Ads
రాజేంద్ర ప్రసాద్… అంత సీనియర్ నటుడు… ఈమధ్య వేదికల మీద అదుపు తప్పి పిచ్చి కూతలకు దిగుతున్నాడు… మాట్లాడితే 5 తరాల నటుడిని అంటాడు, పుష్ప సినిమాను ఉద్దేశించి స్మగ్లర్లు హీరోలా అన్నాడు మరోచోట… తాజాగా మళ్లీ ఎడ్డి వ్యాఖ్యలు, మాటలకు దిగాడు…
రాబిన్‌హుడ్ సినిమా ఫంక్షన్ అది… ఆ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ ఏదో పాత్ర వేస్తున్నాడు, సరే, అదొక ఆకర్షణ అని నిర్మాత దర్శకులు భావించారు, వాళ్ల నమ్మకం వాళ్లిష్టం… హిట్టో ఫట్టో వాళ్ల అదృష్టం… ఏదో డిఫరెంట్ ప్రచారం కోసం కావాలనుకుంటే ఎవరైనా హిందీ నటుడినో, మరో భాష నటుడినో తీసుకురాకుండా వీళ్ల దృష్టి వాార్నర్ మీద ఎందుకు పడిందో, తనకూ ఇండియన్ ఆడియన్స్‌కూ లింక్ ఏమిటో తెలియదు…
కనీసం మాక్స్‌వెల్ వంటి క్రికెటర్లయితే తన భార్య విని రామన్ ఇండియన్… అలాంటి లంకె కూడా లేదు వార్నర్‌కు… సరే, ఆ సినిమాలో ది గ్రేట్ రాజేంద్ర ప్రసాద్‌కు కూడా ఫాఫం ఏదో పాత్ర ఇచ్చినట్టున్నారు…
మరి నేను ఇంత తోపు, ఇన్నితరాల గొప్ప అని చెప్పుకుంటున్నప్పుడు కాస్త ఆ సీనియారిటీకైనా మర్యాద, మన్నన ఉండేలా మాట్లాడాలి కదా… మైకు పట్టుకుంటే చాలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు…
‘మా వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు… ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు, దొంగ ముం- కొడుకు మామూలోడు కాదండీ వీడు, రేయ్ వార్నరూ అని నోటికొచ్చింది తూలాడు… పైకి చూస్తే పొగుడుతున్నాను అనుకున్నాడేమో, ఆ తిట్టు అంత బహిరంగంగా వేదిక మీద వాడితే… ఇక రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలిని ఏమనాలి..?
మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ నువ్వు తోపా, నువ్వు తురుమా ఎవడికీ అక్కర్లేదు ఇండస్ట్రీలో… కాకపోతే అంత సీనియారిటీ ఉండీ ఇలాంటి పిచ్చి కూతలకు దిగితే… రేప్పొద్దున నిన్ను పిలిచి, మైక్ ఇచ్చే సాహసం కూడా ఎవడూ చేయడు…!! వార్నర్‌కు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది… అసలే ఆస్ట్రేలియన్ క్రికెటర్ తను…! వార్నింగ్ కూడా ఇవ్వకుండా సిక్సర్లు కొట్టేవాడు..!!
అసలే శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన వెగటు స్టెప్పులతో ఓ పాట వివాదాస్పదమైంది… మహిళా కమిషన్ హెచ్చరిక జారీ చేసింది, స్టెప్పులు మార్చాలని… ఇప్పుడిక రాజేంద్ర ప్రసాద్ వంతు… యాణ్నుంచి వస్తార్రా మీరంతా..!!
Share this Article