.
కమలహాసన్ రజినీకాంత్ ఇంటికి వెళ్లాడు… కలిశాడు… ఏమిటీ ఈ భేటీ అంటే… రాజ్యసభకు వెళ్తున్నాడు కదా, తన మిత్రుడిని కలిసి అభినందనలు అందుకోవడానికి వెళ్లాడు అని వార్తల్లో రాస్తున్నారు… అభినందనలు చెప్పాలంటే రజినీకాంతే కమలహాసన్ ఇంటికి వెళ్లాలి కదానే ప్రశ్నలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి…
ఏమో, రాబోయే రజినీకాంత్ భారీ చిత్రం కూలీ ప్రమోషన్ లేదా ఇతరత్రా వ్యవహారాల గురించి ఏమైనా కలిశారేమో గానీ… మీడియా మొత్తం పబ్లిష్ చేసిన ఆ ఫోటోలో ఆకట్టుకున్నది వేరే అంశం… రజినీకాంత్ డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో గోడ, దానికి వేలాడదీసిన, షెల్ఫుల్లో పెట్టిన ఫోటోలు…
Ads
యోగులు, సన్యాసులు, బాబాల ఫోటోలు… నడుమ ప్రముఖంగా దండ కూడా వేసిన మరో ఫోటో… జాగ్రత్తగా గమనించండి… ఆపనా ముద్ర, దాని కింద కమలం… మీకు గుర్తుందా..? ఈ యోగముద్ర తొలిసారిగా కనిపించింది 2002లో రజినీకాంత్ బాబా సినిమాలో… దాంతోనే ఈ ముద్ర, ఈ గుర్తు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది…
రజినీకాంత్ అప్పుడప్పుడూ హిమాలయాలకు వెళ్తుంటాడు కదా… అక్కడ మహావతార్ బాబా కథలు విన్నాడు… (కలిశాడు అంటారు గానీ, ఆ బాబా జీవితకాలం 1861 – 1935 నడుమ) ఆ బాబా భక్తులు వాడే ముద్ర ఇది… దాన్నే బాబా సినిమా (టైటిల్ కూడా మహావతార్ బాబాను సూచించేదే) టైటిల్‌కు సిగ్నేచర్ ఇమేజ్‌గా పెట్టాడు…
అది జరిగిన చాలా ఏళ్ల తరువాత… అంటే 2017-18లో రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశాన్ని ప్రకటించినప్పుడు మళ్లీ ఈ ముద్ర ప్రముఖంగా తనతోపాటు కనిపించింది… ఇంకేముంది..? ఇదే తన జెండా మీద కనిపించే సింబల్ అని ఫ్యాన్స్ రకరకాల ఊహాగానాలు చేశారు…
చూశారా, బీజేపీ పెట్టిస్తున్న పార్టీ, అందుకే కమలం గుర్తు కూడా ఉంది అనే విమర్శలు రావడంతో క్రమేపీ కమలం తీసేసి కేవలం ఆపనా ముద్ర మాత్రమే పెట్టసాగారు…
ఏమైందో ఏమో గానీ… రజినీకాంత్ తన కొత్త పార్టీ ఏర్పాటు, రాజకీయ రంగప్రవేశం నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాడు… (మంచి పని చేశాడు… లేకపోతే కమలహాసన్ పెట్టి భంగపడిన మక్కల్ నీది మయ్యం కథ అయి ఉండేది)… ఇప్పుడు తన ఇంట్లో అదే ముద్ర, అదే కమలంపైన… ప్రముఖంగా, దండ వేసుకుని మరీ కనిపిస్తోంది… ఇతర బాబాలు, సన్యాసుల ఫోటోల నడుమ…
ఈ ముద్రకు యోగాలో ప్రముఖ స్థానం ఉంది… చిటికన వేలు, చూపుడు వేలు అలాగే ఉంచి… ఉంగరం వేలు, మధ్య వేలును బొటనవేలితో ఒత్తి పట్టడం ఈ ముద్ర… దేహం డీటాక్సిఫికేషన్, ప్యూరిఫికేషన్‌కు ఉపయోగం అని చెబుతారు… మహావతార్ బాబా భక్తుడు కదా రజినీకాంత్… సో, ఆ ముద్రకు కూడా ఆ ఇంట్లో అంత ప్రాముఖ్యం..!!
Share this Article