Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంతార ప్రీక్వెల్‌లో రజినీకాంత్..? మూవీపై మరింత హైప్ పెరిగిపోతోంది..!!

February 19, 2023 by M S R

సంచలనం సృష్టించిన కాంతార ప్రీక్వెల్‌లో రజినీకాంత్ నటించనున్నాడా..? ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకహీరో రిషబ్ శెట్టి స్పందించిన తీరు, కాంతార నిర్మాతల ధోరణి చెబుతున్నది అదే… సౌత్ సినిమాల్లో ఏకంగా 3 వేల కోట్ల పెట్టుబడికి కూడా హొంబలె ఫిలిమ్స్ సిద్ధమవుతోంది… ఆల్‌రెడీ మలయాళంలో ఓ ప్రాజెక్టు స్టార్టయింది కూడా… తెలుగులో ప్రభాస్‌తో సాలార్ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌తో తీస్తోంది ఈ సంస్థ… దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయింది…

మురళి గోపీ, పృథ్వరాజ్ సుకుమారన్‌లతో తీసే మలయాళం సినిమా ఆ ఇండస్ట్రీలోనే భారీ సినిమాగా రూపొందబోతోంది… ఇక తమిళం..? రజినీకాంత్‌ను అడుగుతున్నారు ఒక సినిమా చేద్దామని..! దీంతో తమిళ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని హొంబలే నిర్మాత విజయ్ ఆలోచన… తనకు ఓ భిన్నమైన పాత్ర కావాలని రజినీకాంత్ అడుగుతున్నాడు… తన దృష్టి రిషబ్ శెట్టి తీసే కాంతార ప్రీక్వెల్ మీద ఉంది…

ఆమధ్య రిషబ్ రజినీకాంత్‌ ఇంటికి వెళ్లి కలిశాడు… రజినీకాంత్ చాలాసేపు కాంతార సహా న్యూట్రెండ్ సినిమాల గురించి చర్చించాడు… ఓ బంగారు గొలుసును కూడా బహూకరించాడు… అదేసమయంలో కాంతార వంటి సినిమాలో చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడని సమాచారం… కానీ కాంతార ప్రీక్వెల్‌లో కూడా రిషబ్ శెట్టే నటిస్తున్నాడు… తనే దర్శకుడు… కాంతారలో తండ్రీకొడుకుల పాత్రలు గుర్తున్నాయి కదా… ఈ ప్రీక్వెల్‌లో తండ్రి పాత్రను రిషబ్ పోషించనున్నాడు…

Ads

ప్రస్తుతం రిషబ్ ఈ సినిమాకు సంబంధించిన కథాకథనాల పనిలో పడ్డాడు… అందులో ఓ కీలకమైన పాత్ర రజినీకాంత్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు రిషబ్, నిర్మాత విజయ్… కానీ రజినీకాంత్ హీరోగా గాకుండా గెస్టు రోల్ చేయడు… కథలో తనదే ప్రధాన పాత్ర అయి ఉండాలి… కానీ కాంతార ప్రీక్వెల్‌లో హీరోగా రిషబే కనిపించాలి… తను వదిలిపెట్టడు… ఎందుకంటే..? ఆల్‌రెడీ కాంతారలో రిషబ్‌ను చూశారు కాబట్టి… కానీ ఆ తండ్రి పాత్రను రజినీతో చేయిస్తే సినిమా మరింత గ్రాండ్‌గా వస్తుందనీ, కాంతారతో దక్కిన గ్రాండ్ సక్సెస్‌ను కొనసాగించినట్టు అవుతుందని నిర్మాత విజయ్ ఆలోచన…

 

ఈ మథనం తెగడం లేదు కాబట్టి ఏదీ అధికారికంగా ప్రకటించడం లేదు… కాంతారను జస్ట్, 16 కోట్లతో నిర్మించారు… ఒకవేళ రజినీ గనుక నటించే పక్షంలో ఎన్ని కోట్లయినా పెట్టడానికి సిద్దమని విజయ్ చెబుతున్నాడు… ఎలాగూ పాన్ ఇండియా ప్రాజెక్టు అవుతుంది… రజినీకాంత్‌కు సౌత్ భాషలన్నింటిలోనూ ఫాలోయింగ్ ఉంది… అందుకని రజినీకాంత్ అంగీకరిస్తే కాంతార ప్రీక్వెల్‌లో ముఖ్యమైన పాత్రలోనే నటింపజేయించాలి, ఇదీ విజయ్ ఆలోచన

ఈమధ్య కర్నాటక ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెస్‌మీట్ జరిగింది… అందులో ప్రధానమైన ప్రశ్న… ‘కాంతార ప్రీక్వెల్‌లో రజినీ నటించనున్నాడా..?’ దీనికి రిషబ్ కాదనలేదు… అలాగని అవుననీ చెప్పలేదు… ఒకవేళ నిజం కాని పక్షంలో వెంటనే అదేమీ లేదని చెప్పేవాడు… అందుకని రజినీ కాంతార పక్కా అంటూ కర్నాటక మీడియా ఎడాపెడా రాసేసింది… వాటిని కాంతార హీరో రిషబ్ గానీ, నిర్మాత విజయ్ గానీ ఖండించలేదు…


HAPPY BIRTHDAY #THALAIVA @RAJINIKANTH.
HOPE YOU CONTINUE TO MESMERISE!#HBDSUPERSTARRAJINIKANTH PIC.TWITTER.COM/W7Q1AMOALV

— HOMBALE FILMS (@HOMBALEFILMS) DECEMBER 12, 2022


ఇంతకుముందు ఎప్పుడూ హొంబలే ఫిలిమ్స్ రజినీకాంత్ బర్త్‌డేకు విషెస్ చెప్పలేదు… తను కన్నడ సినిమాలు, హీరోలకే పరిమితమై ఉండేది… కానీ మొదటిసారిగా ఆమధ్య రజినీకాంత్ బర్త్‌డేకు ఈ సంస్థ ప్రత్యేకంగా ట్వీట్ గ్రీటింగ్స్ షేర్ చేసుకుంది… అంతేకాదు, కాంతార ఒరిజినల్ కథకే ప్రీక్వెల్ అని మొదటి నుంచీ చెబుతున్న రిషబ్ శెట్టి ఇప్పుడు ‘‘ప్రేక్షకులకు చాలా సర్‌ప్రయిజెస్ ఉంటాయి, జానర్ కూడా డిఫరెంటుగా ఉంటుంది’’ అని చెబుతున్నాడు…

నిజానికి రజినీకాంత్ బేసిక్‌గా కన్నడిగ… నటుడిగా చెన్నై వెళ్లి, తమిళ సినిమాల్లో పాపులరైపోయాడు… తన మాతృభాషలో ఓ పెద్ద బడ్జెట్ సినిమా తీయాలనే కోరిక చాలాకాలంగా తనలో ఉంది… అది కార్యరూపం దాల్చడం లేదు ఇప్పటివరకూ… కాంతారలోని శివ పాత్రకు తండ్రి పాత్ర పోషిస్తే బాగుంటుందనేది తన ఆకాంక్ష… కాంతారలో కొన్ని యాక్షన్ సీన్లు ఉన్న బిల్డింగ్ గుర్తుంది కదా… అది మంగుళూరులో ఉంటుంది… రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సీన్లు కొన్ని ఇప్పుడు ఆ భవనంలోనే తీయబోతున్నారు…

రజినీకాంత్, శివరాజకుమార్ కలిసి నటిస్తున్న సినిమా కోసం ఆల్‌రెడీ వాళ్లిద్దరూ మంగుళూరు చేరుకున్నారనీ, వారిద్దరూ కనిపించే సీన్లు అక్కడ షూట్ చేయబోతున్నారని టైమ్స్ కథనం… ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ అతిథి పాత్ర పోషిస్తుండగా, జాకీ ష్రాఫ్ మరో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు… తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కూడా ఉన్నారు ఈ సినిమాలో… ఒకవేళ రజినీ గనుక కాంతార ప్రీక్వెల్‌కు సై అంటే ఇదే మంగుళూరు, ఇదే భవనంలో షూటింగుకు చాలారోజులు టైమ్ కేటాయించి, మళ్లీ రావల్సి ఉంటుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions