ఏయ్… ఎవడ్రా అదీ… మా వకీల్ సాబ్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు…? ఆయ్ఁ……… ఆ రజినీకాంత్ అంటే 70 దాటాడు… అసలు కమల్‌హాసనే 66 దాకా వచ్చాడు… వాళ్లకూ మా యాభయ్యేళ్ల పవన్ దేవుడితో పోలిక పెడుతున్నారు..? తాటతీస్తాం… ఈ నానీలు, డాడీలు, జగన్లూ జాన్తానై… ఆఫ్టరాల్ మా నాగబాబు అన్న, మా నాదెండ్ల మనోహర్ దోస్త్ చాలు… మా పార్టీని గెలుపు తీరాలకు తీసుకుపోవడానికి…
సరే, సరే… ఈ మాటలేమిలే గానీ… రజినీకాంత్ అనబడే ఓ వృద్ధ సింహం ఇక పోరాడే స్థితిలో లేదు అనేది అర్థమైపోయింది… అసలు నువ్వు పోరాడే స్థితిలో లేవు, రెస్ట్ తీసుకో డాడీ అని చెప్పే కుమార్తెలు కమల్ హాసన్‌కు లేరు… పవన్ కల్యాణ్‌కు లేరు… పవన్ కల్యాణ్ కుటుంబం ప్రస్తుతం ఏమిటీ అని ఆలోచించే స్థితిలో తను లేడు, తన ఫ్యాన్స్ లేరు… కనీసం కత్తి మహేష్ కూడా లేడు… రాంగోపాలవర్మ అసలే లేడు…
Ads
ఎంత మంచి రజినీ బిడ్డలు…? పప్పా, మనకెందుకీ దిక్కుమాలిన రాజకీయాలు..? ఈ ఆలోచనల స్ట్రెస్ మనకెందుకు..? మనం ఈ తుచ్ఛ రాజకీయ సీఎం పోస్టులకు అతీతంగా ఎదిగిపోయాం కదా అని బిడ్డలు బుద్ధి చెప్పారు… సారీ, కర్తవ్యబోధ చేశారు… అదీ కూతుళ్లు చేయాల్సిన పని… కూతుళ్లు ఎప్పుడూ బెటరే… మన మంచి కోరుకుంటారు, కానీ కమల్ హాసన్ బిడ్డలు అలా చెప్పరు… సరికదా, అక్షర హాసన్ అయితే అయ్య వెంబడి ప్రచారానికి కూడా వెళ్తుంది… సరే, అసలు వార్త విషయానికి వస్తే… (పనికిమాలిన సినిమా భాషలో తను ఏం చెప్పినా దిక్కుమాలిన కంటెంట్ జోలికి పోవడం లేదు… క్షమించ గలరు…)
రజినీకాంత్‌ను ఆయన బిడ్డలు రాజకీయాల్లోకి రావద్దు అంటున్నారు… ఆఫ్టరాల్ మనకు జెండా లేదు, ఎజెండా లేదు, మనం జనంలోకి వెళ్లిందీ లేదు, మనకు అసలు ఓ సిద్ధాంతమే లేదు… ఐనా సరే, నువ్వు బీపీ పెంచుకుని హైదరాబాద్ అపోలోలో చేరావు… అదే చెన్నై అపోలోలో చేరి ఉంటే మా గతి ఏమయ్యేది పప్పా అని కన్నీళ్లు పెట్టుకున్నారట…
ఆహా… ఎంత మంచి వార్త… ఈనాడు గ్రేట్… సూపర్బ్… మిగతా చెత్తా పత్రికలకు ఇది పట్టుకోవడం కష్టమైంది… ఒక సూపర్ ఖగోళ స్టార్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన బిడ్డలే బుద్ధిచెప్పడం మామూలు విషయమా..?
వెంటనే రజినీకాంతుడి పేరిట ఓ ప్రెస్ నోట్ విడుదలైపోయింది… బాబ్బాబూ, నాకు చేతకాదురా, నన్ను వదిలేయండర్రా… ఈ వయసులో, ఈ ఆరోగ్య స్థితిలో ఇక నావల్లకాదు, ప్రస్తుతానికి రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా వేస్తున్నాను అని ఓ ప్రెస్ నోట్ జారీ చేశాడు… వావ్, ప్రాక్టికల్ మనిషి… అనవసరంగా ఇజ్జత్ తీసుకోవడం దేనికి అనే క్లారిటీ వచ్చింది తనకు… నువ్వు గ్రేట్ రజినీ…
.
అరెరె, తమిళనాట ఎన్నికలు మరో మూడు నాలుగు నెలలు కూడా లేవు… అసలే మా అన్న 30 ఏళ్లుగా కలలు కంటున్నాడు అని రజినీ అభిమానులు ఆందోళన పడనక్కర్లేదు… ఎందుకంటే… మనిషి బతుకు ముఖ్యం… ఈ చెత్తా రాజకీయాలు ఉంటే ఎంత..? పోతే ఎంత..? ఏమంటారు..? మీరూ మా దేముడి ఫ్యాన్స్ టైపే కదా… దయచేసి అర్థం చేసుకొండి… ప్లీజు… ఇక్కడ మెచ్చుకోవాల్సింది రజినీ తాతగారి బిడ్డలను…!!
.
https://m.facebook.com/story.php?story_fbid=4099398980087442&id=100000521423114
Share this Article