.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. NTR కు మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి అవార్డును తెచ్చిపెట్టిన సినిమా ఈ రాజూపేద సినిమా . NTR తన నటనా శక్తిని చూపిన సినిమా ఇది . Most deglamourised role . 1881 లో Mark Twain వ్రాసిన The Prince and Pauper నవల ఆధారంగా నిర్మించబడింది .
బహుశా భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి ద్విపాత్రాభినయం సినిమా ఇదే అయి ఉంటుందేమో . అదీ ఒక బాల నటుడు . రాజకుమారునిగా , పేదవాడి కొడుకుగా . B.A. సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ క్లాసిక్ 1954 జూన్లో వచ్చింది . నేనింకా పుట్టలేదు అప్పటికి .
Ads
ఈ సినిమా 1957 లో Andi Petra Selvan గా తమిళంలోకి డబ్బింగ్ చేయబడింది . 1968 లో Raja Aur Runk అనే టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేయబడింది . అన్ని భాషలలోనూ బాగా ఆడింది .
మన తెలుగు సినిమాలో పేదవాడు పోలిగాడుగా NTR , రాజుగా SVR , పోలిగాడు భార్యగా లక్ష్మీ రాజ్యం , ప్రధాన పాత్రలయిన రాజకుమారునిగా పేదవాడి కొడుకుగా మాస్టర్ సుధాకర్ నటించారు . ఇతర పాత్రల్లో రేలంగి , R. నాగేశ్వరరావు , జయచిత్ర తల్లి అమ్మాజీ ప్రభృతులు నటించారు .
ఆసక్తి కలవారు ఇప్పుడూ చూడవచ్చు . యూట్యూబులో ఉంది . కాస్త స్లోగా అనిపిస్తుంది ఈ తరం వారికి . NTR డిగ్లామర్ నటన చూడవలసిందే . ముఖ్యంగా యన్టీఆర్ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా .
#తెలుగుసినిమాలసింహావలోకనం
ఎన్టీఆర్ తాగుబోతుగా, దొంగగా నటించిన ఈ చిత్రం, అప్పటికే నటుడిగా మంచి స్థానంలో ఉన్నా సరే, ఎన్టీఆర్ కేవలం తన మిత్రుడు బి. ఏ.సుబ్బారావు కోసమే ఆ పాత్ర ధరించి ఉంటాడు.., సినిమా ఇంగ్లీష్ స్టైల్ లో ఆంగ్లో జానపద కథలా ఉంటుంది, రేలంగిపై చిత్రించిన భలే భలే బొమ్మ పాట ప్రసిద్ధి చెందింది, జయచిత్ర తల్లి జయశ్రీ (అమ్మాజీ) రేలంగి సరసన నటించింది.., ఎస్.వి.అర్. అభినయం అద్బుతం, ఆర్.నాగేశ్వరరావు విలనిజం, మాస్టర్ సుధాకర్ సీనియర్ నటుడిలా నటించాడు. విలక్షణ జానపద చిత్రం…
జిక్కి నాలుగు పాటలు పాడగా…. ప్రముఖ హేతువాద రచయిత తాపీ ధర్మరావు ఈ సినిమాలో ఏకంగా అయిదు పాటలు రాయడం ఓ అరుదైన విశేషమే…
Share this Article