.
1. కొణిదెల నీహారిక… తన పాత, చేదు అనుభవాలన్నీ మరిచిపోయి… నిర్మాతగా తన కెరీర్ ఎంజాయ్ చేస్తోంది… టీవీ షోస్, వెబ్ సీరీస్, సినిమాలు… ఈ రకాస సినిమాకు కూడా ఆమే నిర్మాత… గతంలో కమిటీ కుర్రాళ్లు సినిమా కాస్త సక్సెసయ్యాక ఆమెకు ఆత్మవిశ్వాసం ఇంకాస్త పెరిగినట్టుంది…
2. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం దర్శకురాలు మానసశర్మ… ఏదో షోలో సుడిగాలి సుధీర్ తన పక్కన నిలబడిన ఆమెను చూసి, ఈమె హీరోయిన్ కదా, దర్శకురాలు అంటారేమిటి అని హాశ్చర్యపోతాడు… అందంగా, క్వయిట్‌గా, ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడు ఆమె వైరల్ అయిపోతోంది తెలుగు ప్రేక్షకగణంలో…
Ads
శ్రీకాకుళం బేస్, ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్… తను మొదట యూట్యూబర్… నీహారిక 2019లో తీసిన మ్యాడ్ హౌజ్‌కు రచయిత… తరువాత మరో వెబ్ సీరీస్… ఇప్పుడు ఏకంగా ఓ సినిమా… ఇండస్ట్రీలో మహిళా దర్శకులు కొత్తేమీ కాదు… మరో లేడీ డైరెక్టర్‌కు స్వాగతం… (కాస్త షామిలి పోలికలు కనిపిస్తాయి మొహంలో)… ఈసారి ఓ సినిమాను తనే కథానాయికగా చేస్తే బెటర్…
https://www.facebook.com/reel/1312716844053860
3. గెటప్ సీను… మరీ సుడిగాలి సుధీర్‌లా కేవలం హీరో వేషాలకే గిరిగీసుకోకుండా… చిన్న పాత్రలైనా సరే, అంగీకరిస్తూ… రక్తికట్టిస్తూ… చాలా సినిమాల్లో అవకాశాలు పొందుతున్నాడు… ప్రదీప్, సుధీర్, ఆది తదితర స్నేహగణంలో ఇప్పుడు గెటప్ సీను చేతిలోనే ఎక్కువ చాన్సులు ఉన్నట్టున్నాయి…
ఇక రకాస ముచ్చటకు వద్దాం… పర్లేదు, హారర్ కామెడీ ఇప్పుడు టాలీవుడ్ సేఫ్ బెట్ కదా… ఇదీ అదే జానర్… ఫస్టాఫ్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయినా చివరలో సినిమా ఆసక్తికరం అనిపిస్తుంది… సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో హిందీలో ఈమధ్య వచ్చిన ‘స్త్రీ’ సినిమా ఛాయలు కనిపిస్తున్నా, మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ మానస శర్మ ఈ కథను కాస్త కొత్తగా అల్లుకుంది…

వీరబాబు (సంగీత్ శోభన్) ఒక పక్కా ఎన్నారై. తన ఊరిలో జరుగుతున్న ఒక పెళ్లిని ఆపడానికి ప్లాన్ వేసి అమెరికా నుంచి వస్తాడు… అయితే తను వచ్చింది ఒక మామూలు ఊరు కాదని, అది దెయ్యాల అడ్డా అని మనోడికి తెలియదు… శాస్త్రాల ప్రకారం ఆ ఊరిలో పరిస్థితులు చక్కబడాలంటే ఒక వ్యక్తి త్యాగం చేయాలి… ఆ బలి పశువు మరెవరో కాదు, సాక్షాత్తూ మన వీరబాబే అని తేలినప్పుడు ఏం జరిగింది…? ఆ మూడు సంకేతాలు ఏమిటి…? వీరబాబు తన ప్రాణాలు కాపాడుకున్నాడా లేదా అనేదే సినిమా…

ఎవరెలా చేశారు?
-
సంగీత్ శోభన్…: తన మార్క్ ‘కన్ఫ్యూజ్డ్’ కామెడీతో మరోసారి ఆకట్టుకున్నాడు… అమాయకుడిగా పంచులేస్తూ, భయపడుతూ వీరబాబు పాత్రలో ఒదిగిపోయాడు… హారర్ కామెడీలు అతనికి కొట్టిన పిండి…
-
నయన్ సరిక..: హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువే అయినా, కథను ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు సాయం చేసింది… గ్లామర్ పరంగా, నటన పరంగా ఓకే అనిపించింది…
-
సపోర్టింగ్ కాస్ట్…: సినిమాలో అసలైన బలం తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి లాంటి సీనియర్లే… వీరికి తోడు వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తమదైన కామెడీ టైమింగ్‌తో సెకండాఫ్‌లో నవ్వులు పూయించారు…
సినిమా ప్రారంభం కొంచెం నత్తనడకన సాగుతుంది… పాత్రల పరిచయం, ఆ ఊరి వాతావరణం సెట్ చేయడానికి దర్శకుడు ఎక్కువ టైమ్ తీసుకున్నాడు… ఫస్టాఫ్ అంతా ఏదో వెలితిగా, రొటీన్ కామెడీతో సాగదీసినట్టు అనిపిస్తుంది… అయితే, ఇంటర్వెల్ తర్వాత కథ ఒక పాత కోటలోకి మారాక అసలైన ఆట మొదలవుతుంది…
ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు, వెన్నెల కిషోర్- గెటప్ శ్రీను బ్యాచ్ చేసే హంగామా సినిమాను నిలబెట్టాయి… లాజిక్కులు వెతకకుండా చూస్తే చివరి గంట మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు… క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది… పెద్దగా లాజిక్కులు వెతకకుండా, వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవడానికి ‘రకాస’ ఒక సేఫ్ ఆప్షన్… పర్లేదు, టీవీలో లేదా ఓటీటీలో వచ్చేదాకా ఆగగలం అంటారా..? మీరు తెలివైనవారు..!!
Share this Article