.
రాఖీ పౌర్ణిమ పండుగ వచ్చి… కవితకు రాఖీ కట్టే అవకాశం ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేసిన కేటీయార్ తన మీద తనే నెగెటివ్ సంకేతాల్ని జనంలోకి పంపుకున్నాడు… హార్ష్‌గా ఉన్నా ఇదే నిజం, రియాలిటీ…
నాయకుడికి భావోద్వేగాల మీద అదుపు ఉండాలి… అది నాయకత్వ లక్షణం కూడా… ప్రజలు కీన్‌గా గమనిస్తుంటారు… నాయకులైతేనేం, తమలాంటి మామూలు మనుషులే కదా, కోపాలు సహజం కదాని తీసుకోరు…
Ads
ఎండ్ ఆఫ్ ది డే సొంత చెల్లెలు కదా… సేమ్, నెత్తురు కదా… అంత పరుషంగా వ్యవహరించాలా..? రాఖీ కడతాను వస్తానంటే, నేనుండటం లేదు అంటూ ఇన్‌డైరెక్టుగా మెసెజ్ పెడతాడా..? ఏమైంది..? రాఖీ కట్టించుకుంటే మునిగిపోయింది ఏముంది..? మరీ మనుషులు ఇంత కర్కశంగా ఉండాలా అనే జనం భావిస్తారు… అదే జరుగుతోంది…
పొద్దున్నుంచీ సోషల్ మీడియా ఈ విషయంలో కేటీయార్ మీద బాగా నెగెటివ్‌గా రియాక్టవుతోంది… కవిత పట్ల సానుభూతి కనిపిస్తోంది… ఎస్, రకరకాల కారణాలు… తెలుగు రాష్ట్రాల్లో జగన్- షర్మిల… కేటీయార్- కవితల అన్నాచెల్లెళ్ల బంధం ఎప్పుడూ బలంగా కనిపించేది… ప్రత్యేకించి రాఖీ పండుగ రోజు ఆ ఫోటోలు బాగా ప్రచారంలోకి వచ్చేవి… జగన్, షర్మిల ప్రాక్టీసింగ్ క్రిస్టియన్లే అయినా రాఖీ ఫోటోలు మాత్రం ప్రముఖంగానే మీడియాలో కనిపించేవి…
ఇక కేటీయార్- కవిత ఫోటోలు సరేసరి… గత ఏడాది ఆమె జైలులో ఉంటే, ఓ ఎమోషనల్ ట్వీట్ కొట్టాడు కేటీయార్… You may not be able to tie Rakhi today But will be with you through thick and thin అన్నాడు…
ఆమె లేకపోతేనేం, మేం లేమా అని వందల మంది వచ్చి రాఖీలు కట్టారు… అక్కడివరకూ గుడ్… జస్ట్, ఏడాది… సీన్ మొత్తం ఛేంజ్… నేను వస్తాను అన్నయ్యా అనడిగితే, అప్పటికప్పుడు కావాలనే బెంగుళూరుకు వెళ్లిపోయి, నేనుండటం లేదు అని రిప్లయ్ ఇచ్చాడట కేటీయార్… ఎవరెవరో వచ్చి రాఖీలు కట్టొచ్చు గానీ సొంత చెల్లెలు చేదయిందా..?
అంత కర్కశంగా చెల్లెలి పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఏముందనే భావనే ప్రజల్లో ఇప్పుడు… ఉండొచ్చు… ఆస్తులు, సంపాదన, అవకాశాలు, అధికారం, వారసత్వం… జగన్- షర్మిల నడుమ… కేటీయార్- కవిత నడుమ… చాలా ఇళ్లల్లోనూ ఉంటయ్… కానీ ఆమె రాఖీ కట్టడానికి వస్తానంటే తిరస్కరించడం ప్రజల్లోకి యాంటీ- సెంటిమెంట్ సంకేతాల్ని పంపించింది…
ఏమో, అక్కడక్కడా రాఖీ పద్ధతులు వేర్వేరు ఉండొచ్చుగాక… మా ఇళ్లల్లో, మా ఏరియాల్లో బిడ్డలు తండ్రులకు కూడా రాఖీలు కడతారు… (తండ్రులైనా, సోదరులైనా ఆమె కాళ్లకే మొక్కుతారు)… కేసీయార్ తోబుట్టువులు వచ్చి తనకు రాఖీలు కట్టిన వీడియోలు, ఫోటోలు, వార్తలు కనిపించాయి… కానీ కవిత జాడలేదు, కనిపించలేదు…
చివరకు సొంత బిడ్డ చేదయిందా అనే ప్రజల నెగెటివ్ భావన కూడా కేసీయార్‌కు మైనస్… కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, ఉత్తరాధికారి తనే కావచ్చు, తండ్రి ఇష్టం కానీ బిడ్డ మీద మరీ అంత ద్వేషం, కోపం దేనికి..? బిడ్డ కాదా, నెత్తురు కాదా అనే ప్రజలు భావిస్తారు… సహజం… లక్ష పుస్తకాలు చదివిన కేసీయార్‌కు తెలియదా..? తెలుసు, కానీ తన ఒరిజినల్ గుణం అది… కోపమొస్తే బిడ్డయినా సరే, మొహం చూడడు… ప్చ్, భావోద్వేగాల మీద అదుపు లేని నాయకుడు తను… ఆ నాయకుడికి వారసుడు కేటీయార్..!!
Share this Article