.
Subramanyam Dogiparthi
…. జయ జయ జయ ప్రియ భారతి జనయిత్రి దివ్యధాత్రి , జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి . దేవులపల్లి వారు వ్రాసిన ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం . 1986 అక్టోబరు 2న వచ్చిన ఈ రాక్షసుడు సినిమా గుర్తొస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాటే .
జానకమ్మ ఎంత శ్రావ్యంగా పాడారో ! ఆ తర్వాత కళ్ళ ముందు మెదిలేది రాధ ముద్దు ముద్దు అల్లరి , పురుషుడంటే పిచ్చి ప్రేమ . ఈ సినిమాలో పురుషుడి మీద రాధ చూపించే పిచ్చి ప్రేమంతా నిజంగానే ఆమెకు చిరంజీవి మీద ఉందేమో అనిపించేది ఆ రోజుల్లో .
Ads
ఇంతకీ ఆ పురుషుడు ఎవరంటే చిరంజీవుడే . ఈ సినిమాలో అతనికి పేరు ఉండదు . రాధ పురుషుడు అని , నాగబాబు ఫ్రెండ్ అని అంటూ ఉంటారు . బహుశా చిరంజీవి పేరు లేకుండా నటించిన సినిమా ఇది ఒక్కటేనేమో ! ఆ తర్వాత ఈ సినిమా అంటే నాకెందుకు చాలా ఇష్టం అంటే చిరంజీవి manly and ferocious నటన . గంజాయి దీవి నుండి బయటపడే సమయంలో , క్లైమాక్సులో ఫైట్లు అదిరిపోతాయి . ఖైదీ సినిమా గుర్తుకొస్తుంది .
ఈ సినిమాకు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి . చిరంజీవి , కోదండరామిరెడ్డి , యండమూరి , కె యస్ రామారావు కాంబినేషన్లో అభిలాష , చాలెంజ్ తర్వాత వచ్చిన మూడో సినిమా ఇది . ఇంకో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే ఇదే అక్టోబర్ రెండో తేదీన మరో సినిమా కూడా వచ్చింది . అది ఒక రాధ ఇద్దరు కృష్ణులు . ఈ రెండు సినిమాలకు దర్శకుడు , సంగీత దర్శకుడు , కధా రచయిత ఒకరే . కోదండరామిరెడ్డి , ఇళయరాజా , యండమూరి . A rare coincidence .
(చంటబ్బాయ్, అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు… ఏ నవలాచిత్రం తీసుకున్నా సరే ఒరిజినల్ నవలకూ సినిమాకూ నడుమ బోలెడన్ని సినిమాటిక్ మార్పులు కనిపిస్తాయి… కొన్నిసార్లు అసలు ఒరిజినల్ కంటెంటుకూ సినిమా కంటెంటుకూ నడుమ భారీ తేడా ఉంటుంది… రాక్షసుడు కూడా ఒరిజినల్ నవల చదవని వాళ్లకు బాగా నచ్చుతుంది…)
ఇది 1+2 కాదు ; 1+3 . రాధ పిచ్చిపిచ్చిగా ప్రేమించేస్తుంది , చిరంజీవి ప్రేమించడు . అల్లరి చేసే మంచి పిల్లగా చూస్తుంటాడు . సుహాసినిని స్వఛ్ఛంగా ప్రేమిస్తాడు , ప్రేమించబడతాడు . మరో స్త్రీ తారకేశ్వరి పాత్రధారిణి జయమాల . కన్నడ నటి .
నిజ జీవితంలో కూడా కన్నడ ప్రభాకర్ మొదటి భార్య . సినిమాలో బానిస భార్య . భర్త రొమాన్స్ చేస్తుంటే ఊహల్లో చిరంజీవితో అద్భుతమైన రొమాంటిక్ డాన్స్ చేస్తుంది . నీ మీద నాకున్న ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో పాట వీర శూర హిట్ సాంగ్ ఇది .
https://www.youtube.com/watch?v=Litm6xx7PCY&ab_channel=GaneshVideos
నిజ జీవితంలో ఆమె కర్ణాటక మంత్రిగా కూడా పనిచేసారు . ఇంతగా మోజుపడితే నీలో నాకు తల్లి కనిపిస్తుందని తల్లి కోసం సాహసాలు చేసే పురుషుడు పలికి ఆమె గౌరవాన్ని , సహాయసహకారాలను పొందుతాడు .
ఈ రాక్షసుడు సినిమా కేవలం ఏక్షన్ , రివెంజ్ సినిమా మాత్రమే కాదు ; సెంటిమెంట్ , ఎమోషన్ , రొమాన్స్ , వగైరా రసాల సమ్మిళితం . ఇన్ని పరస్పర భిన్న రసాలను ఒక చోటకు చేర్చిన కోదండరామిరెడ్డిని మెచ్చుకోవలసిందే . సినిమాలో రొమాన్సుని అద్భుతంగా పండటానికి కోదండరామిరెడ్డి చిత్రీకరణ ప్రతిభతో పాటు ఇళయరాజా మేజికల్ మ్యూజిక్ , తార నృత్య దర్శకత్వం , బాలసుబ్రమణ్యం జానకమ్మల శ్రావ్యమైన గాత్రాలు కూడా కారణమే .
https://www.youtube.com/watch?v=5iaNcEaEoGo&t=44s&ab_channel=GaneshVideos
అఛ్ఛ అఛ్ఛా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్లా వచ్చా పాటలో చిరంజీవి , రాధ డాన్స్ ప్రేక్షకులను థియేటర్లలో గంతులేయించింది . ముఖ్యంగా షేడో ప్లే మగ పురుషులు కూడా సిగ్గు పడాల్సిందే , వంకర్లు తిరగాల్సిందే . వాళ్ళిద్దరిదే మరో డ్యూయెట్ గిలిగా గిలి గిలిగా గిలిగింతగా హుషారుగా సాగుతుంది .
https://www.youtube.com/watch?v=M_hKQyKsGhA&ab_channel=TeluguVideoSongsClub
మరో సూపర్ మెలోడియస్ సాంగ్ మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు . చిరంజీవి , సుహాసినిలు సినిమాలో డాన్సిస్తే చాలా మంది కపుల్స్ ఇప్పటికీ రీల్స్ ఫేస్ బుక్కులో , యూట్యూబులో ఎక్కిస్తూనే ఉన్నారు . ఇంకో 1+2 పాట హేయ్ నాటీ లవ్ బాయ్ ఈ బ్యూటీ నీదోయ్ . ఇద్దరు హీరోయిన్లు హీరోతో డాన్సిస్తారు . వెరశి ఆరు పాటలూ సూపర్ డూపర్ హిట్ .
క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ ఓనర్ కె యస్ రామారావుకి , ఎగ్జిబిటర్లకు డబ్బులు పుష్కలంగా వచ్చాయి . డైరెక్టుగా కానివ్వండి లేదా షిఫ్టుల మీద కానివ్వండి 26 సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడింది .తమిళంలోకి డబ్బింగ్ చేయబడింది .
ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , కన్నడ ప్రభాకర్ , నర్రా , అల్లు రామలింగయ్య , రాజేంద్రప్రసాద్ , సుమలత , సంయుక్త , అన్నపూర్ణ , జగ్గారావు , వాసుదేవరావు , పి జె శర్మ , తదితరులు నటించారు . నర్రా నటన క్రూరంగా ఉంటుంది .
నాగబాబుకు ఇదే మొదటి సినిమా . ఈ సినిమాలో మరో పాత్రధారి యం వి యస్ హరనాధరావు ఈ సినిమాకు సంభాషణల రచయిత కూడా . బ్రహ్మాండంగా వ్రాసారు . చిరంజీవి సెంటిమెంటల్ , రాధ రొమాంటిక్ డైలాగులు చాలా బాగుంటాయి . సాంకేతికంగా సుహాసినే హీరోయిన్ అయినా ప్రేక్షకుల మనసుల్లో రాధ పాత్రే మిగిలిపోతుంది . ప్రేమించిన పురుషుడి కోసం ప్రాణాలను కూడా వదులుతుంది .
మా తరమే కాదు ; ఇప్పటి తరం కూడా చూసే ఉంటారు . ఒకరూ అరా పాతికా చూడనివారు ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . It’s a fantabulous action movie filled with melodious music , sentiment and eye-feast dances . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article