Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…

June 10, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంతో త్రివిక్రముడై నటించిన సినిమా ఫిబ్రవరి 1984 లో వచ్చిన ఈ రక్తసంబంధం . తమిళంలో సూపర్ హిట్టయిన దైవమగన్ (1969) సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా .

తమిళంలో శివాజీ గణేశన్ , జయలలిత , సౌందర్ రాజన్ , ప్రభృతులు నటించారు . నీహార్ రంజన్ గుప్త వ్రాసిన ఉల్కా అనే బెంగాలీ నవల ఈ సినిమాలకు ఆధారం .

Ads

విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆమెకు 25వ సినిమా . తమిళ సినిమా రీమెక్ హక్కులను కృష్ణంరాజు తానే నటిస్తానని కొనుక్కున్నారట . సినిమా తీయటానికి సందేహించి అలా పక్కన పెట్టేసారట . కృష్ణని కూడా నటించవద్దని చెప్పారట . ఏం ఫరవాలేదు అని చెప్పి కృష్ణ ముందుకొచ్చారట .

మూడు పాత్రలలో భిన్నత్వం చాలా బాగా చూపారు . ముఖ్యంగా తండ్రి , కురూపి పెద్ద కొడుకు పాత్రలను అద్భుతంగా నటించారు . సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాం . మన ఇళ్ళల్లో పెద్దలు , ఇతరులు చాలామంది చక్కటి రూపం ఉన్నవాళ్ళని బయటవారికి పరిచయం చేసినట్లుగా కాస్త అనాకారిగా , కురూపిగా ఉన్నవారిని చేయరు . ఇదో మానసిక రుగ్మత .

అటూఇటూ ఇలాంటి కాన్సెప్టుతో ఉంటుంది ఈ సినిమా కూడా . అయితే తేడా ఉంది . కురూపి అయిన తండ్రి తాను అనుభవించిన అవమానాలు తనకు పుట్టిన బిడ్డ అనుభవించకూడదని భావిస్తాడు . పురిట్లోనే చంపేయమని స్నేహితుడు అయిన డాక్టర్ని బలవంతం చేస్తాడు . చంపేస్తానని చెప్పి చంపటానికి మనసొప్పక ఒక అనాధాశ్రమానికి అప్పచెపుతాడు డాక్టర్ .

పెద్దయిన తర్వాత తనను వదిలేసిన తల్లిదండ్రుల మీద కోపం కాకుండా ప్రేమను పెంచుకుంటాడు పెద్ద కొడుకు . అలాగే తమ్ముడిని కూడా ప్రేమిస్తాడు . విలన్ల చేతిలో ఇరుక్కుపోయిన తమ్ముడిని రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోతాడు .

భిన్న మనస్తత్వాలు ఉన్న మూడు విభిన్న పాత్రలను కృష్ణ బాగా పోషించారు . కృష్ణ తర్వాత మెచ్చుకోవలసిన పాత్ర , పాత్రధారి సత్యనారాయణ . డాక్టర్ మిత్రుడిగా బాగా నటించాడు . ఇతర ప్రధాన పాత్రలలో జయంతి , రాధ , సుత్తి జంట , రమాప్రభ , అన్నపూర్ణ , సుదర్శన్ , జ్యోతిలక్ష్మి , గిరిబాబు , మాస్టర్ సురేష్ , ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . అన్నింటిలోనూ అద్భుతంగా ఉండేది విరిజల్లువో హరివిల్లువో పాట . హరివిల్లు అంటే ఇంద్రధనస్సు . అందులో ఉండే ఏడు రంగులు ఎరుపు , నారింజ , పసుపు , ఆకుపచ్చ , నీలం , ఇందిర , ఊదా . ఆ ఏడు రంగుల దుస్తులతో రాధ శాస్త్రీయ బాణిలో నృత్యం అద్భుతం .

కృష్ణ కూడా తన హావభావాలను చాలా చక్కగా ప్రదర్శించారు . నృత్య దర్శకుడు శ్రీనివాసుని ప్రత్యేకంగా అభినందించాలి . రస హృదయులు ఈ పాటను అసలు మిస్ కాకండి .

మిగిలిన పాటల్లో హిట్టయిన పాట , కృష్ణ అదరగొట్టిన పాట ఎంత కరుణామూర్తివయ్యా ఎంత చల్లని తండ్రివయ్యా పాట . A great emotional song . పట్టపగలే ఎట్టా చెప్పను , ఓఓఓఓ పాలబుడ్డి , పేచీకోరు అబ్బాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు , నా పిలుపుకు మెచ్చిన డ్యూయెట్లు అన్నీ హుషారుగా ఉంటాయి .

తమిళ సినిమా కోటీశ్వరుడు టైటిలుతో డబ్బింగ్ అయి 1970 లో వచ్చింది . అదీ బాగా ఆడింది . కాలేజి కుర్రాళ్ళం శివాజీలాగా మెలికలు తిరుగుతూ ఇమిటేట్ చేసేవాళ్ళం . డబ్బింగ్ సినిమాలో పాటలు కూడా హిట్టయ్యాయి .

దైవమా దైవమా ఎంత భాగ్యం దైవమా , నేలపై చుక్కలు చుక్కలు చూడు పట్టపగలొచ్చెను నేడు , యాదవకుల పావనా కృష్ణా కృష్ణా , చక్కనైన రామచిలకుంది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . డబ్బింగ్ పాటల్ని ఆత్రేయ , రాజశ్రీలు వ్రాసారు .

మన తెలుగు సినిమాలోని పాటలను ఆత్రేయ , వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం, సుశీలమ్మ , యస్ జానకి పాడారు . విరిజల్లువో హరివిల్లువో పాటను జానకమ్మ పాడారు . బహుశా వేటూరే వ్రాసి ఉండాలి . సత్యానంద్ డైలాగులు చాలా బాగుంటాయి . ముఖ్యంగా తండ్రి , పెద్ద కొడుకు పాత్రల డైలాగులు , సత్యనారాయణ డైలాగులు చాలా బాగుంటాయి .

విజయనిర్మల దర్శకత్వం వహించిన సినిమాలలో నాకు బాగా నచ్చిన సినిమా ఈ రక్తసంబంధం . ఈ టైటిలుతో వచ్చిన యన్టీఆర్ , సావిత్రిల సినిమా ఓ సూపర్ డూపర్ హిట్ . మనందరికీ గుర్తున్నదే .

ఈ చక్కటి ఎమోషనల్ , రొమాంటిక్ , కరుణా రస పూరిత సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . కృష్ణ నటించిన చాలా విజయవంతమైన సినిమాలలో ఆయన గొప్పగా నటించిన సినిమాలలో ఒకటి ఈ రక్తసంబంధం సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇవే, తగ్గించుకుంటే మంచిది… శ్రీలీల వస్తే మంత్రి స్పీచ్ ఆగిపోవాలా..?
  • కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…
  • గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్‌ వీరగాథ… వీరుడా, నీకు జోహార్లు…
  • క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!
  • అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్‌గాం బాపతు సీన్…
  • వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…
  • ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…
  • మరణం తరువాత..? ఓ చిక్కు ప్రశ్న… ‘మళ్లీ బతికిన’ ఆమె చెప్పేదేమిటంటే..?
  • ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
  • నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions