Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో… నో… కథాకథనాలేవీ చిరంజీవి, యండమూరి రేంజ్ కానేకావు..!!

July 26, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ……… యండమూరి వీరేంద్రనాధ్ నవల రక్తసింధూరం ఆధారంగా నిర్మింపబడింది 1985 ఆగస్టులో వచ్చిన ఈ రక్తసింధూరం సినిమా . చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ముఖ్యంగా చిరంజీవి ఇమేజితో వంద రోజుల పోస్టర్ పడింది .

పాటల చిత్రీకరణ బాగున్నా , చిరంజీవి రాధల జోడీ ఉన్నా సినిమా చిరంజీవి , కోదండరామిరెడ్డిల లెవెల్లో హిట్ కాలేదు ఎందుకనో !!

దుష్టశిక్షణ శిష్టరక్షణ థీమ్ . పేదలను పీక్కుతింటున్న విలన్లను శిక్షిస్తానికి గండ్రగొడ్డలి పేరుతో ఒక విప్లవకారుడు . చట్టాన్ని రక్షించే మంచి బాలుడుగా గోపి అనే పోలీస్ ఇనస్పెక్టర్ . ఈ రెండు పాత్రల్ని చిరంజీవి ధరించాడు .

Ads

వీళ్ళిద్దరి తల్లిగా అన్నపూర్ణ . ఇనస్పెక్టర్ గోపీని మూడుసార్లు ఫూల్ని చేస్తానని స్నేహితురాళ్ళతో పందెం కట్టి ఫూల్ని చేసే ముద్దుగుమ్మగా జైలు సూపరింటెండెంట్ కూతురుగా రాధ .

ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరి అల్లరే . ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకుని ఫూల్సుని చేసుకుంటూ ఉంటారు . ఈ క్రమంలో ప్రేక్షకులను కూడా ఫూల్సుని చేసే ప్రయత్నం చేసారు . ఓ పోలీస్ ఇనస్పెక్టర్ కాలేజి పరీక్ష హాల్లోకి , లేబరేటరీ లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవటం , తన సుపీరియర్ అయిన జైలు సూపరింటెండెంటుతో ఆయన కూతురికి తలంటు పోస్తానని ఛాలెంజ్ విసరటం , అందుకు కళ్ళు పోయినట్లు నటించటం , వగైరా కాస్త యండమూరి , కోదండరామిరెడ్డి స్థాయిలో ఉండదు .

సెకండ్ హాఫ్ అంతా ఏక్షన్ మీద ఏక్షన్ . అన్నాదమ్ములు కూడా అయిన చిరంజీవులు ఛాలెంజులు విసురుకోవటం , అన్నను రక్షించటానికి తమ్ముడు ఉరి కంబం ఎక్కటం వంటి ఫుల్ ఏక్షన్ సీన్లు మస్తుగా ఉంటాయి .

చిరంజీవి అభిమానులను అలరిస్తాయి . దుష్టశిక్షణ అనంతరం ఇద్దరు చిరంజీవులలో ఒకరు మరణించటం , మరొకరు జైలు శిక్షను అనుభవించి అన్న స్థానంలో గండ్రగొడ్డలిగా కనిపించడంతో సినిమా ముగుస్తుంది .

సినిమాను నడిపిందంతా చిరంజీవి రాధల డ్యూయెట్లు , చక్రవర్తి సంగీతం , శివశంకర్ తారల నృత్య దర్శకత్వం , వేటూరి వారి పాటలు , కోదండరామిరెడ్డి మార్క్ పాటల చిత్రీకరణ . ఇది సరిగమ పాడినా , గుమ్మల్లో ముద్దుగుమ్మల్లో , హమ్మ హమ్మమ్మ ఏమిటో , ఓ చిన్నదాన నా ఒంటి బాధ డ్యూయెట్ల చిత్రీకరణ  బాగుంటుంది . కదిలింది కదిలింది కల్కి అవతారము పాట కూడా గండ్రగొడ్డలి చిరంజీవి మీద పవర్ఫుల్గా చిత్రీకరణ చేయబడింది .

చాలా సంవత్సరాల తర్వాత గుమ్మడి విలన్ పాత్రలో కనిపించారు . సత్యనారాయణ , నూతన్ ప్రసాద్ , సూర్యకాంతం , సుత్తి జంట , పి జె శర్మ , సుదర్శన్ , డబ్బింగ్ జానకి , ఈశ్వరరావు , వరలక్ష్మి , ప్రభృతులు నటించారు . కొన్ని సీన్లు చాలా ఎమోషనల్గా బాగుంటాయి .

ముఖ్యంగా విలన్ల నుండి రక్షించేందుకు మొదటి రాత్రి పెళ్ళి కూతురు వరలక్ష్మి చిరంజీవి భార్యగా మంచం మీద ఉండే సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది . (పీవీ రాసిన ఓ పాపులర్ కథలో సీన్)… అలాగే అన్నపూర్ణ , చిరంజీవిల మధ్య నడిచే కొన్ని ఎమోషనల్ సీన్లు .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు ట్రై చేయవచ్చు . చూడబులే . ముఖ్యంగా చిరంజీవి , రాధల డ్యూయెట్లు . అలాగే రాధందం . వీళ్ళిద్దరు 16 సినిమాల్లో జంటగా నటించారు . చిరంజీవికి ధీటుగా నృత్యిస్తుంది రాధ . చిరంజీవి , రాధల అభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు . అందమె ఆనందం , ఆనందమె జీవిత మకరందం . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
  • ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions