Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధన్‌రాజ్… కొన్నిచోట్ల నిరాశపర్చినా ఓవరాల్‌గా నీ సినిమా పాస్…

February 21, 2025 by M S R

.

రామం రాఘవం… ఈ సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి ఉండానికి కారణం… ధన్‌రాజ్… బలగం వేణుగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు సమకాలీనుడు ధన్‌రాజ్… ఒక జబర్దస్త్ కమెడియన్ నుంచి బలగం వంటి ఎమోషనల్ సినిమా రావడం విశేషమే… సినిమాలో ఆ దమ్ముంది…

అలాగే ధన్‌రాజ్ కూడా ఓ మంచి సినిమాను ప్రజెంట్ చేశాడేమో అనేదే ఆసక్తి… తను కూడా జబర్దస్త్ కమెడియనే ఒకప్పుడు, తరువాత ఇతరత్రా కామెడీ షోలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు… కానీ తనలో ఓ దర్శకుడున్నాడు…

Ads

ఎలాగోలా ఎవరినో ఒప్పించి దర్శకుడయ్యాడు… తను ప్రధాన పాత్రధారి… రెండు బరువులనూ మోస్తూనే బలగం అంత బెటర్ ఔట్‌పుట్ కాకపోయినా సరే, తీసిపారేయలేని ఓ సినిమాను ప్రజెంట్ చేశాడు… పాస్ మార్కులు పడ్డట్టే…

ఆమధ్య ప్రిరిలీజ్ ప్రోగ్రాంకు సుడిగాలి సుధీర్ వచ్చాడు… హాస్పిటల్‌లో ఉండి కూడా తన కోసం వచ్చాడని చెప్పాడు ధన్‌రాజ్… సుధీర్ ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడు, ఏమైంది అనేది ఒక ప్రశ్న… జబర్దస్త్ మొదట్లో ధన్‌రాజ్‌ సుధీర్‌కు కొంత ఎంకరేజ్‌మెంట్ ఇచ్చాడనే కృతజ్ఞతతో వచ్చినట్టున్నాడు… వ్యక్తులతో సుధీర్ రిలేషన్స్ ఎప్పుడూ బాగానే ఉంటాయి…

ఈ సినిమా విషయానికి వస్తే సముద్రఖనిని తండ్రి పాత్రకు ఒప్పించడంతోనే ధన్‌రాజ్ సగం మార్కులు కొట్టేశాడు… కొడుకు పాత్రలో తను అంత పర్‌ఫెక్షన్ చూపకపోయినా సరే, సముద్రఖని నటన పలు సీన్లలో మెప్పిస్తుంది… సహజంగానే తను మంచి నటుడు, ఎమోషన్ బేస్డ్ పాత్ర దొరికాక ఇక ఆగుతాడా…?

ఓ నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి తండ్రి… చెడబుట్టిన అల్లరి చిల్లర పాత్రలో కొడుకు… ఏదో తప్పు చేస్తే కొడుకును ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడు తండ్రి… దాంతో తండ్రినే హతమార్చి, ఆ బీమా సొమ్ము ప్లస్ కారుణ్య నియామకం కింద తండ్రి పోస్టు కొట్టేయాలనుకుంటాడు కొడుకు…

సరే, మొదట్లో చాలా అనాసక్తంగా, ఫక్తు ఓ రొటీన్ స్టోరీగా బాగానే విసిగించినా… చివరి అరగంట, ముప్పావుగంట ధన్‌రాజ్ దర్శకత్వం పలు సీన్లలో మెప్పిస్తుంది… ఎమోషన్ సీన్లు బాగానే వచ్చాయి… ప్రేక్షకుడు అప్పుడు కనెక్టవుతాడు… పర్లేదు… లవ్ ట్రాక్ శుద్ధ దండుగ… తెలుగు సినిమా కాబట్టి ఏదో ఓ పిచ్చి లవ్ ట్రాకైనా ఉండాలనే నియమం ఉన్నట్టుంది…

సత్యా కామెడీ జస్ట్, వోకే… పాటలు కుదరలేదు… దాని మీద ధన్‌రాజ్ దృష్టి పెట్టనట్టుంది… మిగతా నటీనటులు ఉన్నారంటే ఉన్నారు… ఎటొచ్చీ సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీకొడుకుల్లాగా గాకుండా అన్నాదమ్ముళ్లలాగా కనిపిస్తారు… కాస్త మేకప్ తేడా చూపించాల్సింది… సరే, మొత్తానికి పర్లేదు ధన్‌రాజ్… నువ్వు పాస్, ఈసారి ఫస్ట్ క్లాస్‌ కోసం ట్రై చేయి, ఆల్ ది బెస్ట్…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడితే… ఇదుగో ఇలాంటి ప్రమాదాలే !!
  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!
  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!
  • హరీష్ భయ్… నో గురుదక్షిణ, నో నిర్లక్ష్యం – ఇది సిన్సియర్ ఎఫర్ట్ !!
  • మిస్టర్ క్లీన్ ! మీడియాకన్నా చరిత్ర బాగా అర్థం చేసుకుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions