Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యో ! ఏడవోతివే… రాచక్కదనపు రాముల్క పులుసా..?

December 19, 2023 by M S R

రామసక్కదనపు రాములుక్కాయలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పులినిజూసి, నక్కవాతలువెట్టుకున్నట్టు–

Ads

రాముల్కల పుల్లదనం టమాటలకు ఎక్కడుంటది..?

ఏమి ఎయ్యకున్న ఏంలేదు, గింతాంత నూనెబొట్టు

ఉప్పు, గంటెడు మిరుప్పొడి, ఎల్లిపాయలుంటే.. సాలు.

దానికదే ఎసరువూరి, పులుసు ఎంత కమ్మగుంటది..!

జెరమచ్చిన బంక నాలుకకుగుడ మల్ల రుచివుట్టిస్తదంటె

నాలుకకు రుచివుడితె, ఆర్నెల్లబలం ఎన్కకు వచ్చినట్టేగద.. !

మక్కగటుక, నూకలబువ్వ, కొత్తబియ్యపు మెత్తటిబువ్వ,

అట్లు, పిట్లు, రొట్టెలు, కుడుములు.. వేటితోటైనా.. సై !

అబ్బో.. దేనితోటి జతగడితె,, దానికోసమే పుట్టినట్టేనాయే !

దగ్గరికి వండిన రాములక్కాయ కూరంటె మాటలామరి !

కంచం నాక్కతిని, కడుక్కతాగెటొళ్లను చూస్తెనే తెలుస్తది.

ఎనుకటొళ్లు గివి తినే,, చిట్టెపురాళ్ళలెక్క గట్టిగున్నరుగాదు.

రాముల్క చెట్లగుణమే.. మా దండి మొండిగుణం..!

ఒక్క గింజ భూమ్మీద పడితే.. ఇగ చావులేదనుకోండ్రి.

మందులుమాకులు ఎవ్వద్దు. నీళ్లు, ఎద్దడైనా ఓర్సుకుంటది.

పందిరెలుపు పరుచుకోని, నిజంగ బండెడు కాయలుగాస్తది.

గుత్తులుగుత్తులు తెంపిపొయ్యలేక మనకే యాష్టకస్తదిగని

చెట్టుకు పూసుటానికి, కాసుటానికైతే.. యాష్టలేదు, గజ్జికాత !

మా.. మిరుపచేండ్ల, మక్క పెరట్ల, పల్లిచేండ్ల, పసుపుల…

పీకేసినకొద్ది మొలిచిన చెట్లే, చేనంత ఇసురుక పొయ్యేటియి.

కైకిలొళ్లకు, పనిపాటలొళ్లకు, దారెంట వొయ్యటొళ్లకు…

ఎవలకువడితెవాళ్లకు తెంపుకపొయినన్ని రాముల్కలు.

నీళ్లుగట్టంగ కాళ్లకిందవడి.. సగంపండ్లు సతికిపొయ్యేటియి.

చూడబుద్ధిగాగ.. రెండుమూడు నోట్లేసుకునుడు మామూలె.

వట్టిగవోతున్నయని, అమ్మో బాపో.. ఎప్పుడో ఖాళిగున్నప్పుడు

రాముల్క పండ్లన్నితెంపి, పిండి.. పరుపు బండమీద పోద్దురు.

అప్పుడిప్పుడు పోసినయే– ఇరుస గంపెడన్ని వరుగులైతుండె.

కాగునిండ నింపిపెట్టి, ఎండకాలంల పంచిపెట్టుడు వాళ్లకో తుర్తి.

పిడికెడన్ని రాముల్క వరుగులు ఉడుకునీళ్లల్ల నానవెట్టి,

ముత్తెమంత చింతపండు పులుసువోసి.. అంటుపులుసువెడ్తే

మూడుపూటలు తిన్నా.. ఇంకా కూరమీద బుద్ధిదీరకపోతుండె.

ఎండతాపాన్ని తగ్గించే రాముల్కలు.. కడుపుకెంత చల్లదనం..!

నడుమంత్రపు సిరి – నరం మీది పుండు అన్నట్టుగ–

తరువాత తరువాత రాములక్కాయలు మోటయిపాయె.

తిన్నొళ్లను.. ఎడ్డిమనుషుల తీర్గ చిత్రచిత్రంగ చూసిరి.

ఎన్నో ఇత్తనం గట్టినా.. రాముల్కలకు ఆ రంధన్నదే ఉండకపోవు

తీసేసినా, కోసేసినా.. వాటికవే మల్ల చేన్నిండార మొలుస్తుండె.

ఇప్పుడు తీరొక్కమందులు కొట్టికొట్టి, ఇత్తనం నడి గంగలగలిసె !

చెర్లనీళ్లన్నివొయి చెరువెనుక వడ్డంక–

ఈ రోజులల్ల మల్ల రాముల్కల మీద మనసువెట్టవట్టిరి.

ఏడవున్నయంటె ఆడికివొయి తిరిగితిరిగి తెచ్చుకుంటండ్రు

పైసకు ఎన్కకు వోతుండ్రా..ఎంత రేటువెట్టయినా కొంటండ్రు.

నెలదప్పిన ఆడొల్లకంటె.. ఎక్కువ భమతోటి వండుకుంటండ్రు.

పావెడుకాడ రెండంతలనూనెవోసి, అరొక్కతీరు మసాలలేసి

ఆవిరివోవద్దని మూతులుబిగిచ్చి, వగలవంటలు వండవట్టిరి.

ఎంతజేసినా.. ఏం లాభమున్నది ? గడ్డి దిన్నట్టే ! అదో కూరనా..!

అయ్యో ! ఏడవోతివే… రాచక్కదనపు రాముల్క పులుసా..?

అని.. పెద్దలువోయినంత దుఃఖ పడుతండ్రు. చిత్రంగాకుంటే,

పెసరుచేండ్ల పోగొట్టుకోని, పప్పటికెల దేవులాడినట్టున్నది కథ !

చెప్పుకుంటె మానంబోతది – చెప్పకుంటె పానంబోతదని–

మన మనుసులకెన్నటికన్న బుద్ధిగ్యానం.. తిరిగి వస్తదంటరా..?

తాను కూసున్నకొమ్మనే తెగనరుక్కోని.. గిట్లనే సస్తరంటరా..??

✍ డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions