Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మస్తు తోపు ముచ్చట్లు చెబుతాడు… అప్పట్లో ఏ పాత్ర వచ్చినా రైటో రైట్….

May 4, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… అనగనగా లంకానగరం అనే రాజ్యం , ఆ రాజ్యానికి రావణుడు రావు గోపాలరావు . అతనికో శకుని లాంటి అనుచరుడు అల్లు రామలింగయ్య . చాలా సినిమాల్లో లాగానే ఊరిని , గుడిని , జనాన్ని దోచేసుకుంటూ ఉంటాడు రావణుడు .

ఎవరో వస్తారని , ఊరిని రక్షిస్తాడని జనం ఎదురు చూస్తూ ఉంటారు . కోటీశ్వరుడు అయిన తండ్రి మీద శపధం చేసి తన శక్తిని నిరూపించుకోవటానికి హీరో కృష్ణ గారు భీమరాజు పేరుతో దిగిపోయి దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేస్తాడు .

Ads

100% కోదండరామిరెడ్డి మార్క్ మాస్ మసాలా ఎంటర్టయినర్ . ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు ఆడి హిట్టయిన ఈ సినిమా 1983 జూలై ఇరవై ఎనిమిదిన విడుదలయింది . సినిమా పేరు రామరాజ్యంలో భీమరాజు .

వసుంధర కలం పేరుతో జొన్నలగడ్డ రాజగోపాలరావు , రామలక్ష్మి దంపతులు వ్రాసిన నవల ఆధారం . సినిమానుకూలంగా కూర్పులు , చేర్పులు , మార్పులు చేసారు కోదండరామిరెడ్డి . సత్యానంద్ డైలాగుల కర్త .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి .

కృష్ణ , అతిలోకసుందరి డ్యూయెట్లు అభిమానులకు హుషారు ఎత్తిస్తాయి . తటపట తడిసిన కోక , ఏనాడో నీకూ నాకూ వ్రాసిపెట్టాడు దేవుడు , చూపుతోనే చూడకుండా డ్యూయెట్లు బాగుంటాయి . అతిలోకసుందరిని ఇంకా అందంగా చూపారు కోదండరామిరెడ్డి . కృష్ణ కూడా చాలా హుషారుగా డాన్సులు వేసారు . చేయించాడు నృత్య దర్శకుడు సలీం .

డ్యూయెట్లు కాకపోయినా హిట్టయిన మరో రెండు పాటలు ఉన్నాయి . ఒకటి పిల్లలతో కృష్ణ పాడే పాట . కధ చెపుతాను ఊ కొడతారా ఉలిక్కిపడతారా . బాగా చిత్రీకరించబడింది . రెండోది శ్రీదేవి తన స్నేహితులతో పాడే పాట . కాబోయే శ్రీమతీ రాబోయే నీ పతీ పాట . అదీ బాగా చిత్రీకరించబడింది .

పాటలన్నీ వేటూరే వ్రాసారు . రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై మిద్దె రామారావు నిర్మించిన ఈ సినిమాలో రావు గోపాలరావు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , జగ్గయ్య , రాజేంద్రప్రసాద్ , చంద్రమోహన్ , సంగీత , నిర్మలమ్మ , సుత్తి జంట , చలపతిరావు , రాళ్ళపల్లి , వడివుక్కరసి , ప్రభృతులు నటించారు .

అప్పుడప్పుడే నిలదొక్కుకుంటానికి తిప్పలు పడుతున్న రాజేంద్రప్రసాదుకి మాయాబజార్లో లక్ష్మణ కుమారుడు వంటి పాత్ర లభించింది ఈ సినిమాలో . బాగానే ఉపయోగించుకున్నాడు . చంద్రమోహన్ పాత్ర అంత ప్రాధాన్యత ఉన్నది కాదు . ఆరో వేలు లాంటిది .

ఫుల్ కమర్షియల్ ఎంటర్టయినర్ అయిన ఈ సినిమా కృష్ణ అభిమానులకు , సినిమా ప్రియులకు , అతిలోకసుందరి అభిమానులను బాగా అలరిస్తుంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే యూట్యూబులో ఉంది . చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions