Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!

July 30, 2026 by M S R

.

అనేకానేక కళారూపాల్లో… అసంఖ్యాక రీతుల్లో తరతరాలుగా చెప్పబడుతోంది రామాయణం… ఈ పౌరాణిక గాథ ప్రాచుర్యాన్ని మాటల్లో చెప్పలేం… దీన్ని 4 వేల కోట్లతో రెండు భాగాలుగా గ్రాఫిక్ దృశ్యకావ్యంగా మలచాలని బాలీవుడ్ నిర్ణయించాక… ఆసక్తి మాత్రమే కాదు, ఆది పురుష్‌లాగా భ్రష్టుపట్టిస్తారేమోనని భయాందోళన కూడా ఉండేది…

రామాయణం ఎలా తీయకూడదో చెప్పడానికి ఆది పురుష్ సినిమాను మించిన భ్రష్ట ప్రయత్నం మరొకటి లేదు… అదీ భారీ వ్యయమే… అదీ గ్రాఫిక్స్ మాయే… ఇప్పుడు నితిశ్ తివారీ దర్శకత్వంలోని ఈ రామాయణ్ మరింత భారీ ప్రయత్నం… అయితే గ్రాఫిక్స్ వేరు, అందరికీ తెలిసిన రామాయణ కథను కొత్తగా ఎలా చెప్పగలుగుతారు అనేది వేరు… అట్టహాసం, ఆడంబరం కాదు, ఆత్మ ముఖ్యం…

Ads

కన్నడం నుంచి యశ్, తను రావణుడు, తను సహనిర్మాత- తనను ప్రతినాయకుడిగాకన్నా రాముడి ప్రత్యర్థిగా, దీటుగా చూపిస్తారని భావిస్తున్నదే… బాలీవుడ్ నుంచి రణవీర్ కపూర్ రాముడిగా మెప్పిస్తాడా..? తమిళ- తెలుగు నుంచి సాయిపల్లవి సీతగా నప్పుతుందా..? ఈ సందేహాలు కూడా ఉన్నవే…

కీలకమైన నాలుగు భాషల ఇండస్ట్రీల నుంచి ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులు… పాన్ ఇండియా ఎక్స్‌పోజర్ వచ్చేసింది… ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… హమ్మయ్య అనిపించింది… ఆది పురుష్ తాలూకు భయాలు పోయాయి… ప్రధాన పాత్రధారులు ఆయా పాత్రలకు నప్పారు… అదేమిటో గానీ సీతకన్నా శూర్పణఖ చాలా అందంగా ఉంది… (రకుల్ ప్రీత్ సింగ్)…

కౌకేయిగా లారా దత్తా… దశరథుడిగా నాటి రామానందసాగర్ టీవీ రామాయణం బాపతు రాముడు అరుణ్ గోవిల్ అందరూ కనిపిస్తున్నారు కానీ… హనుమంతుడు ఏడి..? కుంభకర్ణుడు, జటాయువు, భరతుడు కూడా ఉన్నారు… కానీ పాపం హనుమంతుడు, సుగ్రీవుడు, కిష్కింధ ఛాయల్లేవు… (ఫస్ట్ పార్ట్ కేవలం సీతాపహరణం వరకే కాబట్టి)…

ముందుగానే అనుకున్నట్టు… యశ్ కోసమైనా దశకంఠుడిని ‘పాజిటివ్ ప్రతినాయకుడిగా’ చిత్రీకరిస్తారని అనుకున్నట్టుగానే… తను ముల్లోకాల్ని జయించే తీరు బాగానే ప్రజెంట్ చేశారు… ట్రెయిలర్ వరకూ గ్రాఫిక్స్ భారీగా, లోపరహితంగానే ఉన్నాయి…

ఇది రామాయణ్ ఫస్ట్ పార్ట్ ట్రెయిలర్ కదా… సీతాపహరణం వరకే కనిపిస్తోంది… అసలు రామరావణ యుద్ధం- పట్టాభిషేకం మరింత విస్తారంగా రెండో భాగంలో కావచ్చు… యాక్షన్ పార్ట్ అన్నమాట… సో, మొత్తానికి ఆది పురుషుడు బాలీవుడ్ మార్క్ భ్రష్ట ప్రజెంటేషన్ బారిన పడకుండా ‘రక్షింపబడ్డాడనే’ అనిపిస్తోంది… కానీ ఏమాటకామాట… దీన్ని ప్రభాస్ రాముడిగా, రష్మిక సీతగా, విక్కీ కౌశల్ రావణుడిగా… రాజమౌళి గనుక తీసి ఉంటే..?! మరో రేంజులో ఉండేదేమో కదా!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions