.
సినిమాల నిర్మాణ వ్యయాల్ని అడ్డగోలుగా పెంచి చూపించడానికి కొన్ని తెర వెనుక లెక్కలుంటాయి… బ్లాక్ మనీ, వైట్ మనీ యవ్వారాలు… ఇంకా అనేక సమీకరణాలు ఉంటాయి… అప్పట్లో ఆదిపురుష్ నిర్మాణ చెప్పాడు కదా… 600 కోట్ల దాకా… కాస్త గ్రాఫిక్స్ మార్చవయ్యా అంటే మరో 200 కోట్లు అన్నాడు…
అదంతా ఓ కథ… పనిలోపనిగా ఓటీటీ, టీవీ, ఆడియో రైట్స్‌కు ఎక్కువ డిమాండ్ చేయడం… అంతా బహుశా రాజమౌళితోనే స్టార్టయినట్టుంది… నిర్మాతలు వసూళ్ల లెక్కల్ని ఎలా ఇన్‌ఫ్లేట్ చేస్తారో, నిర్మాణ వ్యయాన్ని కూడా అలాగే చూపిస్తారు… ప్రేక్షకుల కళ్లకు గంతలు కట్టడం కాదు, అదీ వ్యాపారంలో ఓ భాగం కాబట్టి…
Ads
రామాయణ అనే పాన్ ఇండియా (పాన్ వరల్డ్?) సినిమా నిర్మిస్తున్నారు కదా, అందులో రావణుడిగా నటిస్తున్న కెేజీఎఫ్ యశ్ కూడా సహ నిర్మాత! బాలీవుడ్ ఆరంగేట్రంలోనే బాగా దెబ్బతిన్న సాయిపల్లవి సినిమా మార్కెటింగుకు ఒక మైనస్ పాయింట్… రణబీర్ కపూర్ రాముడి పాత్రకు అస్సలు సూట్ కాలేదు… వాళ్లకన్నా రావణుడు యశ్ కాస్త బెటర్ మార్కెట్ లెక్కల్లో… లుక్కులో…
ఈ బ్లాక్ అండ్ వైట్ యవ్వారాల్లో నిర్మాతలు ఏకంగా 4 వేల కోట్లు ఖర్చు అని చెబుతున్నారు… ఇండస్ట్రీలో కాస్త బుర్ర ఉన్నవాడెవడూ నమ్మడు… మరి ఓటీటీలు నమ్ముతాయా..? నాన్ థియేటరికల్ రెవిన్యూ కోసం నిర్మాతలు భారీ డిమాండ్లు ముందు పెడితే, ప్రముఖ ఓటీటీలు పత్తా లేకుండా పోరిపోయాయి… వాళ్లకూ అర్థమై పోయింది… ఇంకా ఏవీ సెటిల్ కాలేదు…
సినిమాలోని కొన్ని ముఖ్య సన్నివేశాలను ఎడిట్ చేసి 30 నిముషాల వీడియో తయారు చేసి, లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చూపించాడట నమిత్ మల్హోత్రా (Namit Malhotra)… వాళ్లు చెప్పే రేట్లకు ఎవడూ ముందుకు రాలేదు… సరుకులో క్వాలిటీ లేకపోవడం ఒకటి, మరీ 500 కోట్ల (ఫస్ట్ పార్ట్) డిమాండ్ అసాధారణమని భావించడం…
దర్శక నిర్మాత, పంపిణీదారుడు కరణ్ జోహార్ ఓ అడుగు ముందుకు వేసి, నమిత్ మల్హోత్రాతో మాట్లాడి, చివరకు రూ 250 కోట్లకు డీల్ ఓకే చేసుకున్నాడట… అంత రేటు చెప్పి చివరికి సగానికి సగం కరణ్ జోహర్‌కు ఇవ్వడానికి కారణం… వేరే ఎవరూ ముందుకురాకపోవడమే… కరణ్ జోహార్‌కు హిందీ మార్కెట్ మీద గ్రిప్ ఉంది… తను జనానికి చేరవేయగలడు, ఆ 250 కోట్లు రికవరీ చేసుకోగలడు…
మరి మిగతా భాషల్లో..? అదీ అలాగే ఉండబోతోంది… సాధారణంగా ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ తెలుగులో వోకే గానీ, తమిళ- మలయాళ- కన్నడాల్లో పెద్దగా రెవిన్యూ తీసుకురావు… యశ్ ఇమేజ్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్లు కాస్త సాహసం చేస్తారేమో గానీ మలయాళం, తమిళంలో పెద్దగా ఆశించేదేమీ లేదు…
ష్… నిజం చెప్పాలంటే, నిర్మాతలకు పెద్ద నిరాశ ఏమీ లేదు, వాళ్లకు కూడా తెలుసు కదా, అసలు నిర్మాణ వ్యయం ఎంతో..!! ఈ మాయదారి లెక్కలు కాదు, నిజంగా ఆదిపురుష్ మాయలు కాదు, ఒక ఛావా, ఒక దురంధర్ … సిన్సియర్‌గా తీస్తే అవే విజృంభిస్తాయి… ఆ సోయి నితిష్ మల్హోత్రాకు ఉన్నట్టు లేదు…
Share this Article