“రామే ..అండాళుం రావణే అండాళుం” ఆనందంతోనో.. బాధతోనో రెండు కన్నీటి చుక్కలు రాల్చలేని కళ్లెందుకు?? .. బావోద్వేగాన్ని పంచలేని గుండె ఎందుకు ?? చివరికి అవయవదానం చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు .. మనిషికి, రోబోట్ కి తేడా ఏంటి అంటే ?? ఫీలింగ్స్ లేకపోవడమే అంటాడు ..రోబో సినిమాలో వశీకరణ్..నిజమే స్పందనలు , బాధ , సంతోషం , ఉద్వేగం , ఆవేశం ఇవన్నీ ఉంటాయి కాబట్టే మనం మనుషులం అయ్యాం .. కానీ ఇప్పటి యాంత్రిక జీవనంలో ఈ ఫీలింగ్స్ కి చోటు తక్కువే .. ఎమోషన్స్ ని ఎక్స్ ప్రెస్ చేసే సమయం ఎక్కడిది ?? కాస్మొపాలిటన్ సిటీల్లో కాస్మెటిక్ సర్జరీల మధ్య ఆర్టిఫిషియల్ జీవితానికి అలవాటుపడిపోయిన మనకు కాస్తో కూస్తో స్పందనలు కలిగించేది రామే అందాళుం.. రావణే అందాళుం ..
పల్లెట్టూరి మనుషులకి పట్టణాల్లో ఉండే మనుషులకి తేడా ఏంటని అడిగితే అది కచ్చితంగా ఎమోషన్స్ అని అంటాను.. పచ్చని పంటపొలాలు , పశువులు, మట్టి లో బతికేసే పల్లె జనానికి కచ్చితంగా బావోద్వేగాలు ఎక్కువే .. ప్రేమ , ఆప్యాయతలు , అనురాగాలు ఎక్కువే.. అమ్మ , అన్న , నాన్న , బావ , బాబాయి , పెద్దనాన్న , తమ్ముడు , నాయనమ్మ , ఒధిన , తాత , మరదలు ఇలా వావి వరసలు, బాంధవ్యాలు ఈనాటికీ కనిపించేది కేవలం అక్కడ మాత్రమే..
మనుషులతోమాత్రమే కాదు పశువులతోనూ ఆ బంధం ఎక్కువే .. ఊరి మీద అదే రకమైన ప్రేమ మమకారం ఉంటాయి .. అందుకే సొంత ఊరిని , అక్కడి మనుషుల్ని, చెట్లని , ఇంటిని , ఇంట్లో కోళ్లని , పెంచుకునే కుక్కల్ని వదిలి రావాలంటే బాధపడిపోతుంటారు అక్కడి మట్టి మనుషులు.. వాటితో పెనవేసుకుపోయిన బంధం అలాంటిది ..
Ads
ఫీలింగ్స్ ని పుట్టించే , అలాంటి ఫీలింగ్స్ ని దాచిపెట్టి ఉంచే మెదడులో స్పేస్ ఉంటుంది.. అందుకే వాళ్ల దగ్గర అవి నిక్షిప్తంగా ఉంటాయి.. కానీ యాంత్రిక జీవనానికి అలవాటైన మన మెదడులో ఆ స్పేస్ తక్కువే .. ఇలాంటి పల్లెటూరి నుంచి వచ్చిన ఒక దర్శకుడు అరిసిల్ మూర్తి తనతొలి సినిమాకి ఈ కథని ఎంచుకున్నాడు.. నటుడు సూర్య , జ్యోతికలు ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు..మిధున్ మాణిక్యం , రమ్య పాండ్యన్ లు పాత్రధారులు ..
ఇంట్లో కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే రెండు ఎద్దులు కనిపించకుండా పోతే ఆ దంపతులు పడే బాధ ఈ సినిమాకి కథావస్తువు.. రెండు మూగజీవాలకి ఇద్దరు మనుషులకి మధ్య ఉండే బంధం ఆశ్చర్యపరుస్తుంది .. పిజా హాట్లొ పరిచయం అయి బర్గర్ కింగ్ లో పెరిగి పెద్దదై యాపిల్ స్టోర్ లో పెనవేసుకుపోయి పబ్బులో బలపడిపోయి శరీరాలు కలిసిపోయి ఆ తర్వాత ఇన్ స్టా గ్రాంలో బ్రేక్ అప్ అనే మెసేజ్ తో విడిపోయే టైపు ప్రేమ , బంధం కాదు ఇది .. స్వచ్చమైనది .. వెలకట్టలేనిది .. అమూల్యమైనది ఈ పల్లెప్రేమ ..
ఎద్దులు ఆ ఇంటికి రావడం వారితోపాటే పెరిగి పెద్దవైపోవడం ,ఆ తర్వాత వాటిని ఎవరో ఎత్తుకుపోవడం , వాటికోసం భార్యాభర్తలిద్దరూ వెదకడం ఇదే సినిమా స్క్రీన్ ప్లే.. నిజానికి సినిమా చూస్తున్నంతసేపు ఏదో పల్లెటూరికి మనం వెళ్లి అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.. ఆ మూగజీవాల కోసం మనకీ తెలీకుండానే మన కళ్లు ఎక్కడో ఒకచోట చెమ్మగిల్లుతాయి . ఆ జీవులు దొరికినప్పుడు మనకు తెలీకుండానే ఆనందంతో గుండె కొద్దివేగంతో కొట్టుకుంటుంది.. మెదడులోంచి సంతోషాన్ని పుట్టించె హార్మోన్లు స్రవిస్తూనే ఉంటాయి .. అమెజాన్ ప్రైం లో ఉందీ సినిమా.. చూడండి..సినిమాలో ఏ ఒక్క సన్నివేశం విసుగు పుట్టించదు ..ప్రేమ పుట్టిస్తుంది మన ఊరిమీద .. అశోక్ వేములపల్లి
Share this Article