కేసీయార్ బిడ్డ కవితను ఈడీ తన ఆఫీసుకే విచారణకు రమ్మంటోంది… ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది కూడా… ఆ కేసు, విచారణ తీరు మీద చర్చ కాదు ఇక్కడ… ఈడీ వృద్ధులు, మహిళల విచారణకు వాళ్ల ఇంటికే వెళ్లాలి, ఆఫీసులో విచారణ జరపకూడదు అనేది కవిత ఫిర్యాదు… దాని మీద సుప్రీంలో కేసు ఉంది కూడా..! తీర్పు చెప్పాల్సి ఉంది… ఇది ఒక అంశం… ఆమెది ఢిల్లీ స్కాం కేసు…
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన ఆఫీసుకు రామోజీరావును, శైలజా కిరణ్‌ను పిలిపించలేదు… తనే శైలజ నివాసానికి వెళ్లి విచారిస్తోంది… మరి ఇదేతరహాలో ఈడీ కూడా ఎందుకు విచారించకూడదు అని కవిత ప్రశ్నిస్తే ఎవరు జవాబు చెప్పాలి..? ఈ విషయంలో సీఐడీ ఒక తీరు, ఈడీ ఒక తీరులో వ్యవహరిస్తాయా..? ఎందుకు..? ఇదీ ప్రశ్న…
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఈడీ ఎంటర్ అవుతోంది… అలాగే డేటా చోరీ కేసులోనూ ఇన్వాల్వ్ అవుతోంది… ప్రస్తుతానికి అవి దర్యాప్తు చేస్తున్న సిట్‌ల అధికారులతో సమన్వయంతోనే కలిసి కదులుతోంది… కానీ సొంతంగా దర్యాప్తులు స్టార్ట్ చేయడం లేదు… మరి ఆ రెండు కేసుల్లోనూ జొరబడిన ఈడీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఎందుకు సూమోటోగా ఎంటర్ కావడం లేదు… జగన్ తనంతట తనే సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తోందా..? అప్పుడు నేరుగా ఎంటర్ కావచ్చునని ఈడీ కూడా భావిస్తోందా..?
Ads
ఒక సాధారణ రాజకీయ పరిజ్ఞానంతో జవాబు చెప్పుకోవచ్చు… జగన్‌తో బీజేపీ బాగుంది కాబట్టి రామోజీరావుకు అది నచ్చడం లేదు, అంతే… కానీ మోడీకి, రామోజీకి నడుమ సత్సంబంధాలు ఉన్నయ్… అంతటి అమిత్ షా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లాడు తప్ప రామోజీరావు అమిత్ షా వద్దకు వచ్చి కలవలేదు… సో, రామోజీరావును ఇబ్బంది పెట్టడం మోడీకి ఇష్టం ఉండకపోవచ్చు… అందుకని ఈడీ తన రెక్కలు కట్టేసుకుని ఉండవచ్చు…
రామోజీరావు మెడ మీద కత్తి వేలాడదీయడం జగన్ లక్ష్యం… ఒకవేళ సీబీఐకి గానీ, ఈడీకి గానీ అప్పగిస్తే తన చేతుల్ని కట్టేసుకోవాలి… అందుకని సీఐడీ పరిధి నుంచి తప్పించి, జగన్ ప్రభుత్వం మార్గదర్శి కేసును సీబీఐకి అప్పగించదు… కేసీయార్, రామోజీరావు నడుమ సంబంధాలు బాగానే ఉన్నాయి గనుక, మార్గదర్శి ఫైనాన్స్ కేసులో కూడా కేసీయార్ ఇంప్లీడ్ కావడం లేదు గనుక… జగన్ తెలంగాణ పోలీసుల సాయం కూడా తీసుకోడు… సో, ఏరకంగా చూసినా సరే మార్గదర్శి కేసులో ఈడీ ఎంటర్ కావడం ప్రస్తుతానికి అసాధ్యం… మరి కవిత కేసు..? ఢిల్లీ స్కాం కేసును కూడా అలాగే సాగదీస్తూ చోద్యం చూస్తూ కేసీయార్‌తో మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ… ఇంకేమైనా దొరుకుతాయో సాధించడానికి అన్నట్టుగా డేటా చోరీ, పేపర్ లీకేజీ కేసుల్లోకి జొరబడింది… ఏం దొరకబుచ్చుకుంటుందో చూడాలిక…
మార్గదర్శిపై పెట్టిన సెక్షన్లు… ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్ విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం– 1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం… మార్గదర్శి విషయంలో అరెస్టుల దాకా వెళ్తాడా జగన్..? ఏమో, డౌట్ ఫుల్లే… కోర్టు ఆల్‌రెడీ కఠినచర్యలు వద్దని చెప్పినట్టుంది కదా… జగన్ తదుపరి అడుగులేమిటో వేచి చూడాల్సిందే… అసలు రామోజీరావు విచారణ అనేదే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు…!! జగన్ నాన్నకే చేతకాలేదు ఇది… చంద్రబాబు, రామోజీరావు ఏ విచారణలకైనా అతీతులు కదా…!! అన్నట్టు… మార్గదర్శి ఫైనాన్స్ కేసు సుప్రీంలో సజీవంగానే ఉంది సుమా… అందులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిఉంది…!!
ఇది ఎప్పటి ఫోటోయో తెలియదు కానీ మళ్లీ సోషల్ తెర మీద ప్రత్యక్షం అయ్యింది తాజాగా… ఎన్ని పరోక్ష అధికారాలు వెలగబెట్టినా సరే ఈ దేశంలో రాజకీయ అధికారమే పవర్ ఫుల్… అది కన్నెర్ర చేసి, వెంటబడితే కూసాలు కదిలి, నడుం మంచమెక్కుతుంది…
Share this Article