Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి ఎన్టీయార్, వాణిశ్రీలున్నా… ప్చ్, ప్రేక్షకుడికి ఎందుకో రుచించలేదు…

August 11, 2024 by M S R

హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే . హిందీలో దేవానంద్ , నందా , సాధన నటించగా తెలుగులో NTR , వాణిశ్రీ , శ్రీవిద్య నటించారు .

హిందీ సినిమా 1961 లో తీసారు కాబట్టి రెండో ప్రపంచ యుధ్ధం నేపధ్యం తీసుకున్నారు . మనది 1974-75 సినిమా కాబట్టి భారత్-పాక్ యుధ్ధం నేపధ్యం తీసుకున్నారు . యం యస్ గోపీనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు టి చలపతిరావు సంగీత దర్శకత్వం వహించారు .

పాటలు చాలా బాగుంటాయి . దాశరధి వ్రాసిన ఇదేనా మన నీతి ఇదేనా మన సంస్కృతి పాటలో శ్రీవిద్య శాస్త్రీయ నృత్యం చాలా బాగుంటుంది . నాగేష్ మీద చిత్రీకరించబడిన ఇది నా పుట్టిన రోజు పాట కూడా బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసారు . దాశరధి వ్రాసిన మరో పాట ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడివి పాట బయట కూడా హిట్టయింది .

Ads

సి నారాయణరెడ్డి వ్రాసిన ఏవో చుక్కల్లో , ఎవరిది ఈ విజయం నీదీ నాదీ మన అందరిదీ ఈ విజయం పాటలు , దాశరధే వ్రాసిన చిన్నారి నా రాణి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం , రామకృష్ణ , మాధవపెద్ది రమేష్ పాడారు . డ్యూయెట్లని ఊటీలో షూట్ చేసారు . ఎవరిది ఈ విజయం పాట యుధ్ధరంగం నేపధ్యంలో యుధ్ధం గెలిచాక పాడే పాట . ఇద్దరు యన్టీఆర్ల మీద ఉంటుంది . బాగుంటుంది .

NTR కు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే . ద్విపాత్రాభినయం . వాణిశ్రీకి కూడా చిన్న పాత్రే . చాలా చలాకీగా నటిస్తుంది . శ్రీవిద్యకే గొప్ప అవకాశం . దర్శకుడు , ఫొటోగ్రాఫర్ బ్లాక్ & వైట్ అయినా ముగ్గురినీ చాలా అందంగా చూపించారు . సినిమా కొద్దిగా సిపాయి చిన్నయ్య లాగా ఉంటుంది . సిపాయి చిన్నయ్యలో విలన్లు ఉంటారు . ఈ సినిమాలో విధే విలన్ .

NTR , వాణిశ్రీ , శ్రీవిద్య , పండరీబాయి , త్యాగరాజు , ప్రభాకరరెడ్డి , రామదాసు , ధూళిపాళ , నాగేష్ , నిర్మలమ్మ , యస్ వరలక్ష్మి , జగ్గయ్య ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలో చూసా . టివిలో రెండు మూడు సార్లు వచ్చింది . NTR ద్విపాత్రాభినయం , వాణిశ్రీ ఉన్నది , అయినా వాళ్ళ రేంజిలో ఆడలేదు .

నిర్మాతకు , డిస్ట్రిబ్యూటర్లకు , సినిమా హాల్ వాళ్ళకీ అదృష్టం ఉండాలి . వీళ్ళల్లో ఎవరో ఒకరికి తినే రాత ఉన్నా అందరికీ డబ్బులు వస్తాయి . ఒక్కడికి లేకపోయినా అందరికీ రావు . మా చిన్నప్పుడు పెద్దోళ్ళు ఈ మాటల్ని చెపుతుండేవారు . సినిమా యూట్యూబులో ఉంది . NTR , వాణిశ్రీ అభిమానులు చూడనివారు ఎవరయినా ఉంటే చూసేయవచ్చు . చూడబులే . శ్రీవిద్య శాస్త్రీయ నృత్యం , ఇతర డ్యూయెట్లు బాగుంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. By దోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?
  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions