Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… నలభయ్యేళ్లకు రీఎంట్రీ… క్రియేటివ్ వీడియోలతో భలే ప్రమోషన్…!!

November 5, 2022 by M S R

ఓ వీడియో చూస్తుంటే… మన టాలీవుడ్‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్ యాదికొచ్చింది… విష్వక్సేన్ గురించి వాడెవడో పెయిడ్ ఆర్టిస్టు  కారు ఆపి, ఓ ఫ్యుయల్ క్యాన్ చేతిలో పట్టుకుని, వీడియో తీయించుకుంటూ, అరుస్తూ కిందామీదా పడిపోవడం, ఫాఫం విష్వక్సేన్ వాడిని పైకి లేపి ఆదరంగా ఆదుకోవడం, అక్కడి నుంచి నేరుగా టీవీ9కు వెళ్తే, దేవి రుధిరభాషలో ‘యూ గెటవుట్ ఫ్రం మై స్టూడియో’ అని బయటికి వేలు చూపించడం… చకచకా గుర్తొచ్చాయి…

మామూలుగా ప్రస్తుతం కన్నడ సినిమా కొత్త పోకడలు పోతోంది… చిల్లర వేషాలు గాకుండా, కాస్త పనికొచ్చే క్రియేటివ్ ఆలోచనలు చేస్తోంది… మొన్నటి కేజీఎఫ్ నుంచి నిన్నటి చార్లి, కాంతార వరకు అంతే… కానీ ఓ లేడీ కేరక్టర్ ఉంది… పేరు రమ్య అలియాస్ దివ్య స్పందన… గతంలో హీరోయినే… కానీ మధ్యలోనే అన్నీ ఆపేసి, కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌కు చీఫ్ అయిపోయింది… తరువాత కొన్నాళ్లకు ఏమైందో ఏమో గానీ ఆమెను తరిమేశారు… మళ్లీ కాంగ్రెస్ మొహం చూస్తే బాగుండదని మర్యాదగానే  చెప్పారు…

ఫాఫం, ఎనిమిదేళ్లయినట్టుంది ఆమె తెర మొహం చూడక… అనగా, కెమెరా ముందుకు రాక… బరువు పెరిగింది… వయస్సు పైనబడుతోంది… మరి అవన్నీ తన తాజా సినిమా మీద ప్రభావం చూపించకూడదు కదా… అందుకని క్వీన్ ఈజ్ బ్యాక్ అని ఓ వీడియో చేయించింది… అవును, కాంతార సంగీత దర్శకుడు అజనీషే దానికీ మ్యూజిక్ కంపోజర్… సినిమా పేరు హాస్టల్ హుడుగరు బేకాగిద్దార… 

Ads

ramya

అబ్బో, వీడియోలో చాలా కథలున్నాయి… చాలా వేషాలున్నాయి… ఓచోట పూజారులు ఆమె విగ్రహానికి పూజలు చేస్తుంటారు… అదేమంటే ఆమె త్వరగా తెర మీదకు రావడానికి ప్రత్యేక పూజ అంటారు వాళ్లు… ఒకడెవడో చివరి రక్తపు బొట్టు వరకూ రక్తదానం చేస్తుంటాడు, ఇకనైనా వచ్చేయమ్మా అని ప్రార్థిస్తుంటాడు… విద్యార్థులు ‘వుయ్ వాంట్ రమ్య’ అని ఆందోళనలు చేస్తుంటారు… ఆమె వేగన్ కాబట్టి మరోచోట కొందరు వెజ్ మిల్క్ షేక్ పంపిణీ చేస్తుంటారు… ఇద్దరు కళ్లు కోసుకుని, కాళ్లు కోసుకోవడానికి రెడీ అయిపోతుంటారు… సరే, నటిస్తాను అన్నాక రాష్ట్రమంతటా ఇక ఆనందోత్సవాలు మిన్నంటుతాయి…

ఇదీ వీడియో… ప్రమోషన్‌కు సంబంధించి కాస్త క్రియేటివ్‌గా ఉంది, బజారులోకి వచ్చి ఎవరినీ ఇబ్బంది పెట్టేలా లేదు… టెంపర్ చూపించేదేమీ లేదు… తన రీఎంట్రీని భలే ప్రమోట్ చేసుకుంది ఆమె… సరే, ఆ సినిమా నడుస్తుందా, ఫట్ అంటుందా అనేది వేరే సంగతి… నలభయ్యేళ్ల వయస్సొచ్చినా సరే, ఎనర్జీ, ఇంట్రస్టు చంపుకోలేదు… కానీ ఆమె ఈ వీడియో రిలీజ్ చేశాక టీవీ9 కన్నడ ఆఫీసుకు వెళ్లిందా..? అక్కడ మరో కన్నడ దేవో, కన్నడ దేవుడో ఉన్నారో లేదో… అక్కడేం జరిగిందో నిజంగా తెలియదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions