Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీముఖితో కాసేపు ఆడుకున్న రమ్యకృష్ణ… శేఖర్, యశ్ మాస్టర్స్ సరేసరి…

October 25, 2022 by M S R

మనకున్న టీవీ యాంకర్లలో సీనియర్, ఫుల్ ఎనర్జిటిక్ శ్రీముఖి… ఎదుటోడు ఏమైనా అంటే, వెంటనే మీద పడి గాయి పట్టేసేంత టెంపర్‌మెంట్, స్పాంటేనిటీ కూడా…! కాకపోతే కయ్య కయ్య హైపిచ్చులో అరవడమే యాంకరింగు అనే దుర్ భ్రమల్లో ఉంటుంది… ఆమెతో రకరకాల ప్రోగ్రామ్స్ హోస్టింగ్ చేయించేవాళ్లూ అదే కోరుకుంటున్నారేమో బహుశా…

పాపం డ్రెస్సింగు విషయంలో కూడా గతంలో ప్రోగ్రామ్‌ను బట్టి, పద్దతిగా డ్రెస్ సెన్స్‌తో కనిపించేది… ఆమధ్య బిగ్‌బాస్ షోకు వెళ్లివచ్చిన తరువాత కాస్త గాడితప్పినట్టుంది… ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఎదుటోడిని ఆటపట్టిస్తూ కనిపించే శ్రీముఖిని బిగ్‌బాస్‌ షోలోని ఏడుపు దృశ్యాల్ని చూసి జడుసుకున్నారు కూడా… బహుశా అలా పోగొట్టుకున్న ఫ్యానిజాన్ని మళ్లీ ఆకట్టుకోవడం కోసమేమో బహుశా ఈమధ్య ఆమె డ్రెస్ సెన్స్ గందరగోళానికి గురవుతోంది…

మరీ ఏ షోకు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో కూడా తెలియని మరో యాంకర్ ఆంటీ గురించి తెలుసు కదా… ఓసారి అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ వాళ్లే జడుసుకున్నారు… ఎవరైనా ఏమైనా అంటే డ్రెస్సు షేమింగ్ మీద క్లాస్ పీకుతుంది… నిజానికి యాంకరింగు గానీ, ఇంటర్వ్యూలు గానీ హోస్ట్ మాటతీరు, ప్రశ్నలు అడిగేతీరు, కంటెంటుతోపాటు డ్రెస్ సెన్స్ కూడా ప్రధానమే… కాకపోతే మరీ ఆర్జీవీ యూట్యూబ్ చానెళ్ల వెకిలి, రోత ఇంటర్వ్యూలు మొదలయ్యాక ఈ సూత్రాలన్నీ గాలిలో కలిసిపోయాయి… అదే వేరే విషాదం…

Ads

ఆహా ఓటీటీలో డాన్స్ ఐకన్ అని ఓ షో ప్రసారం అవుతుంది… ఆహా వాళ్లు సగటు టీవీ చానెల్ చేసే రియాలిటీ షోలన్నీ చేయాలని కంకణం కట్టుకున్నారు కదా… తెలుగు ఇండియన్ ఐడల్ షోను సక్సెస్ చేశారు… ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్ల కాన్సెప్టుతో ఓంకార్ ఆధ్వర్యంలో ఈ డాన్స్ ఐకన్ షో చేస్తున్నారు… అఫ్‌కోర్స్, టీవీలు, ఓటీటీల డాన్స్ పోటీలు అంటేనే సర్కస్ ఫీట్ల పోటీలు… కాకపోతే ఆహాలో కాస్త కొత్త కొత్త కాన్సెప్టులతో చేస్తున్నారు… కాస్త చూడబుల్‌గా ఉంటున్నయ్…

ఓంకార్ షో కాబట్టి బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్ ఎలాగూ ఓ జడ్జిగా ఉంటుంది కదా… ఇందులోనూ ఉంది… శేఖర్ మాస్టర్ ఉన్నాడు, యశ్ మాస్టర్‌ను పెట్టారు… ఓంకార్ హోస్టింగ్ చేస్తుంటే ఇక వేరే వాళ్లకు మాట్లాడటానికి ఏముంటుంది..? సో, శ్రీముఖి కూడా జడ్జే… అందరికీ మించి ఈ షోకు స్టార్ అట్రాక్షన్ రమ్యకృష్ణ… ఏదో నామ్‌కేవాస్తే చేస్తుందిలే అనుకున్నారు గానీ మంచి యాక్టివ్‌గా, బాగా ఇన్వాల్వ్ అయి చేస్తోంది… విషయానికొస్తే మొన్నామధ్య శ్రీముఖి ఓ రోత డ్రెస్సుతో వచ్చింది…

వేరే షో అయితే మనకెందుకులే అనుకునేవారేమో… కానీ ఒకవైపు శేఖర్ మాస్టర్, యశ్ మాస్టర్, ఇంకోవైపు రమ్యకృష్ణ కాసేపు ఆడుకున్నారు… అదేమిటి..? ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా, అలాగే వచ్చేశావా అంటూ ఆటపట్టించారు… అసలు శ్రీముఖి ఫుల్ డిఫెన్స్‌లో పడిపోవడం తొలిసారి చూడటం… అయితే యూట్యూబ్ షార్ట్స్‌లో కనిపించింది ఈ వీడియో… ఈ బిట్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ సరదాగా బాగుంది… అసలు శ్రీముఖేనా కాదా అని మొదట్లో డౌటొచ్చింది, కానీ ఆమే అని మరో వీడియో చెప్పింది… ఆహాలో ప్రసారం అయ్యే ఒరిజినల్ ఎపిసోడ్లలో ఈ సరదా బిట్ అలాగే ఉంచారా లేదా మాత్రం తెలియదు… అవునూ, శ్రీముఖీ, ఎవరిని స్పూర్తిగా తీసుకుంటున్నావు, నిజం చెప్పు…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions