అరణ్య… ట్రెయిలర్ చూస్తుంటే రానాను అభినందించాలనిపిస్తుంది… నో, నో, ఆ సినిమా గురించి కాదు… అదేదో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైనట్టుంది… ఏడాది క్రితమే విడుదల కావల్సింది… ఓ డిఫరెంట్ స్టోరీ… అడవుల గురించి, వాటిపై నిజమైన హక్కులున్న జీవజాలం గురించిన ఓ కథ… అందులో బవిరిగడ్డంతో ఉన్న రానా వేషం చూస్తే ఇంట్రస్టింగు అనిపించింది… నిజానికి తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తను పెరిగిన వాతావరణం, తనకుండే అవకాశాల నేపథ్యంతో రానా కెరీర్‌ను గనుక పోల్చి చూస్తే విస్మయం కూడా కలుగుతుంది… మనకు వారస హీరోల గురించి తెలుసు కదా… మన హీరోల వేషాలు, ఫార్ములా కథలు, ఇమేజీ ప్రయాసలు, మడత నలగని హీరోయిజం గట్రా… ఆ ఫార్మాట్లో ఎప్పుడూ బందీగా లేడు రానా… అదీ విశేషం… అప్పుడెప్పుడో వచ్చిన లీడర్ సినిమాను, మధ్యలో వచ్చిన నేనేరాజు, నేనేమంత్రి పాత్రలను వదిలేసి చూస్తే… మొన్నటి బాహుబలిలో విలన్… అదీ హీరోకు దీటైన విలనీ… ఇప్పుడు అరణ్య… డిఫరెంట్ కేరక్టర్… అంతకుముందు కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, ఘాజి… రేపు విరాటపర్వంలో ఓ నక్సలైట్… అయ్యప్పునుమ్ కోషియం తెలుగు రీమేక్… తన పాత్రల ఎంపిక బాగుంటుంది… ఒక రెగ్యులర్ ఫార్ములాలో ఇమడటం లేదు తను…
నిజానికి సినిమాలే కాదు… తన లైఫ్, తన కెరీర్‌కు సంబంధించి ఏ రొటీన్ ఫార్ములాలో ఇమడడు తను… తనకు ఏది ఇష్టమైతే అది చేస్తూ పోతాడు… ఎవరేం ముద్రలు వేసినా సరే… సినిమాల్లో హీరో పాత్రే కావాలనేమీ లేదు… రుద్రమదేవిలో ఓ మామూలు పాత్ర తనది… నటన మాత్రమే కాదు… టీవీ షోలు చేస్తాడు… నంబర్ వన్ యారీ తనదే… విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్‌గా చేస్తాడు… ఏదో సినిమాకు నంది అవార్డు వచ్చింది… ఒక సినిమాకు 2004లోనే సహనిర్మాత… దానికి జాతీయ అవార్డు… అవెంజర్స్ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు…. యాక్షన్ సినిమా కోసం ఓ పాట పాడాడు… అన్నీ డిఫరెంట్… ఇది చేయాలీ అనిపిస్తే చేసేయడమే… అంతే… ఇలాగే బతకాలీ అని చుట్టూ గీతలు గీసుకోలేదు… అదీ మనం చెప్పుకునేది ఇక్కడ… కురులున్న తల్లి ఎన్నిరకాల కొప్పులైనా ముడవగలదు, డబ్బులున్నవాడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనే సింగిల్ సెంటెన్స్‌లో తనను తక్కువ చేయడం కరెక్టు కాదు కూడా… బాహుబలి వంటి సినిమా చేశాక మళ్లీ ఆ రేంజ్ కావాలనేమీ కోరలేదు తను… సింపుల్‌గా విరాటపర్వం పాత్రకు సైన్ చేసేశాడు…
Ads
ఇవన్నీ గాకుండా సినిమా ఫీల్డుకు సంబంధించి పలు స్టారప్ కంపెనీలతో భాగస్వామ్యాలు సరేసరి… ఎలాగూ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లదేనాయె… చివరకు పెళ్లి దగ్గర కూడా తన ప్రియురాలు, ఓ ఈవెంట్ కంపెనీ ఓనర్ మార్వాడీ మిహికను పెళ్లిచేసుకున్నాడు… మొదటి నుంచీ చూస్తే ఓ ప్రి-ప్రోగ్రామ్డ్ బాటలో వెళ్లడం లేదు తను… మంచి హైట్, వెయిట్, బాడీ బిల్డర్ అయినా సరే తనకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్నీ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు… నిజానికి తనకు పాత్రలకు సంబంధించి కొన్ని పరిమితులున్నయ్… కామెడీ పాత్రలో, లవర్ బోయ్ పాత్రలో తను చేయలేడు… అందుకే తనకు సూటయ్యే డిఫరెంట్ కేరక్టర్లపై ప్రేమ పెంచుకుంటున్నాడేమో… సరే, ఏదయితేనేం… రానా టాలీవుడ్లో ఓ డిఫరెంట్ పర్సనాలిటీ…!!
Share this Article