Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో !

February 12, 2024 by M S R

Subramanyam Dogiparthi…..   ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మిస్తానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు . స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు ; ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు . ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను విమర్శించే సినిమాలను బాయ్ కాట్ కూడా చేస్తారు , చేపిస్తారు .

వామపక్ష భావజాలం పుష్కలంగా ఉన్న గిడుతూరి సూర్యం మహాకవి శ్రీశ్రీ వ్రాసిన మరో మరో ప్రపంచం పాటను కూడా అధ్భుతంగా చిత్రీకరించాడు . అంతే కాదు ; సినిమాలో డైలాగులు కూడా ఎర్రగానే ఉంటాయి . అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల నాయయకులను కట్టేసయినా చూపించాలి . సినిమా అంతా బిర్రుగా కదులుతుంది .

ఈ సినిమాలో మరో విశేషం రాజబాబు విలనావతారం . ఆత్మన్యూనతా భావం ( inferiority complex ) ఉన్న వారు pervert అయి , cynical అయి , ఎలా కౄరంగా monstrous గా తయారవుతారో ఈ సినిమాలో చూడవచ్చు . పిల్లల్ని , విద్యార్థులను ఎప్పుడూ తక్కువ చేసి , చులకన చేసి చూడకూడదు . కొందరు తమ ప్రతాపాన్ని చూపటానికి చేయకూడని పనులు కూడా చేస్తారు . ఈ సినిమాలో రాజబాబు పాత్ర అలాగే ఉంటుంది .

Ads

కాంతారావు , రామకృష్ణ , ప్రభాకరరెడ్డి , రాజనాల , మిక్కిలినేని , రాజబాబు , రాజశ్రీ , వాణిశ్రీ , గీతాంజలి , ధూళిపాళ , మీనాకుమారి , నాగభూషణం , జ్యోతిలక్ష్మి , బాలకృష్ణ , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . వాణిశ్రీ తనకొచ్చిన మంచి పాత్రలో బాగా నటించింది .

పాటలు , డాన్సులు అన్నీ బాగుంటాయి . వలపు కౌగిళ్ళలో కరిగిపోయేవులే , ఇది కూడదురా మదమెందుకురా , వచ్చింది ఏమో చేయాలని , ఇంతేలే వీరుల గాధలు త్యాగుల గాధలు పాటలు శ్రావ్యంగా ఉంటాయి . యస్ పి కోదండపాణి సంగీతం , కె యస్ రెడ్డి నృత్య దర్శకత్వం , మహారధి మాటలు అన్నీ పదునుగానే ఉంటాయి . పింజల సుబ్బారావు నిర్మాత .

సైకిళ్ళు వేసుకుని కుర్రాళ్ళమంతా చిలకలూరిపేట వెళ్లి చూసాం ఈ సినిమాను . మా నరసరావుపేటకు చిలకలూరిపేట 12 మైళ్లే . సైకిళ్లు మీద వెళ్లి సినిమాలు చూసేవాళ్ళం . టి విలో కూడా అప్పుడప్పుడు వస్తుంది . యూట్యూబులో ఉంది . తప్పక చూసే సినిమాల్లో చేర్చండి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugucinema #telugureels #TeluguCinemaNews

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions