సోషల్ మీడియాతో ఎంత నష్టం ఉన్నా ఎంతోకొంత లాభం ఉన్నట్టుగా… వెబ్ సీరీస్‌ల వల్ల అంతులేని అశ్లీలం నెట్టింట్లోకి దూరి కలుషితం చేస్తోందనేది నిజం… ఇంటిమేట్ సీన్స్, వెగటు భాష, దరిద్రమైన కథలు బోలెడు… సెన్సార్ లేదు కదా…
కానీ… థియేటర్ తెరకన్నా కొన్ని సబ్జెక్టులను బలంగా ప్రజెంట్ చేసే సీరీస్ వస్తున్నాయి కొన్ని… సినిమాలను మించి… ఎందుకంటే..? ఇలాంటి సీరీస్ సబ్జెక్టును స్ట్రెయిట్‌గా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుంచుతాయి… నిడివి ఎక్కువ అనిపించినా సరే, ఆసక్తి ఉన్నవాళ్లు లీనమయ్యేలా తీస్తున్నారు… సినిమాలకు స్క్రీన్ టైమ్ లిమిటేషన్స్ ఉంటాయి… అందుకే రాజీపడటాలు అధికం…
సినిమా అనేసరికి కావాలని కమర్షియల్ అంశాల పేరిట నానా చెత్తా (పాటలు, కామెడీ, పంచ్ డైలాగులు, ఫైట్లు ఎట్సెట్రా… అవి లేకుండా సినిమా అసాధ్యం అన్నట్టుగా…) కూడా కూరుతారు… కానీ వెబ్ సీరీస్ అలా కాదు… అన్నీ అని కాదు, ఎట్ లీస్ట్, కొన్ని బాగుంటున్నయ్… ముందే చెప్పుకున్నట్టు నిడివి ఎక్కువ… ఓటీటీయే కదా, సాగదీసే చోట్ల మౌస్ ఎలాగూ మన చేతిలోనే కదా ఉండేది…
Ads
ఉదాహరణకు… రణనీతి అనే సీరీస్… పాన్ ఇండియా సీరీస్… అనగా పాన్ ఇండియా సినిమాలాగే కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో అన్నమాట… ఇది జియో సినిమా వాళ్లది… 9 ఎపిసోడ్లు గాకుండా అయిదారు ఎపిసోడ్లుగా చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగుగా ఉండేదేమో అనిపించేలా ఉంది… కానీ నిర్మాణ విలువలు, తీసుకున్న సబ్జెక్టు, డీల్ చేసిన విధానం బాగున్నయ్…
ఈమధ్య కొన్ని సినిమాలు ఎయిర్ వార్ మీద వచ్చాయి కదా… ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ తదితరాలు… చిత్రీకరణ కష్టం… ఎక్కువ సీన్లు అవే ఉంటే మరీ వీడియో గేమ్‌లా కనిపిస్తుంది సినిమా… రణనీతి కథ ఎందుకు కొత్తగా ఉందని చెబుతున్నానంటే… ఏ యుద్ధమైనా సరే సైనికుల సాహసం, తెగువ, నైపుణ్యం ఎంత ముఖ్యమో స్ట్రాటజీలు అంతకన్నా ముఖ్యం… పుల్వామా దాడి తరువాత ఇండియా నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ తెలుసు కదా…
ఆపరేషన్ ఎంత ముఖ్యమో… దానికోసం సాగిన ముందస్తు కసరత్తు అంతే ముఖ్యం… ఈ సీరీస్‌లో అటాక్‌కు ముందు వార్ రూంలో ఎలాంటి బ్రెయిన్ స్టార్మింగ్స్ జరిగాయో చెబుతారు… అంతేకాదు, సున్నితమైన అంశాల్ని కూడా టచ్ చేస్తారు… చైనా పాక్ ఎకనామిక్ కారిడార్, పాకిస్థాన్ ఆర్థిక దుస్థితి, వార్ పైలట్ అభినందన్ ఇష్యూ వంటివన్నీ కథలో డిస్కషన్‌కు వస్తాయి… కథ ఎక్కడా డీవియెట్ కాదు…
సగటు ఇండియన్ సినిమా బాపతు మసాలాలూ ఏమీ ఉండవు… ఆధునిక యుద్ధాలు కేవలం బోర్డర్లలో ముఖాముఖీ జరగవు… యుద్ధం అనేక కోణాలుగా, అనేక రూపాలుగా సాగుతుంది… హైబ్రిడ్ వార్స్… మోడరన్ వార్ ఫేర్… ఈ సీరీస్ చూశాక మనకు అర్థమయ్యేది అదే… బుల్లెట్లే కాదు, బుర్రలూ ఎలా యుద్ధం చేస్తాయో చూపిస్తుంది… సాంకేతికంగా చూస్తే ఆకాశంలో సాగే యుద్ధ విమానాల విన్యాసాలు, చిత్రీకరణ బాగున్నయ్…
సున్నితమైన, వివాాదాస్పదమైన అనేక పొలిటికల్ అంశాల్ని కూడా ఈమధ్య హిందీ సినిమాలు, హిందీ వెబ్ సీరీస్ టచ్ చేస్తున్నయ్, డిస్కస్ చేస్తున్నయ్… కాస్త డెప్త్‌లోకి తీసుకెళ్లి, ప్రేక్షకుల బుర్రల్లో డిబేట్‌కు పెడుతున్నయ్… మీడియాకన్నా అధికంగా కొత్త కోణాల్ని పరిచయం చేస్తున్నయ్… స్ట్రెయిట్ నెరేషన్… గుడ్…
Share this Article