Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమే పాడింది… ఆమే ఆడింది… అదీ బర్మాలో… హిట్ కొట్టింది…

December 2, 2024 by M S R

.

చిలకా గోరింక (1966) సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన కృష్ణంరాజు 100 వ సినిమా 1979 లో వచ్చిన ఈ రంగూన్ రౌడీ సినిమా .

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది . ఈ సినిమాలో జయప్రద ఒక పాట తానే పాడి డాన్స్ చేస్తుంది . పుట్టిన ఊరు చిట్టగాంగ్ పెట్టిన పేరు బిందు అనే పాట . రజనీకాంత్ లాగా కనిపించే నళినీకాంత్ అనే నటుడు ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యాడు .

Ads

https://www.youtube.com/watch?v=aitFQMUmhD4&ab_channel=TeluguOne

బర్మాలో తీసిన మొదటి తెలుగు సినిమా కూడా . బర్మా అంటే ఇప్పటి మయన్మార్ . అప్పట్లో బర్మా రాజధాని రంగూన్ . మన పాత సినిమాల్లో రంగూన్ పేరు బాగా వినిపిస్తుండేది . బర్మా కూడా మన దేశం లాగానే బ్రిటిష్ పాలనలో ఉండేది . వ్యాపారాల కోసం , బతుకుతెరువు కోసం భారతీయులు బర్మాకు ఎక్కువగా వెళుతుండేవారు .

rangoon rowdy

ఓ విలన్ చేతిలో మోసపోయిన ఇరువురి మహిళల కొడుకులు కృష్ణంరాజు , మోహన్ బాబు . ఈ ఇరువురు తమ తల్లులను మోసం చేసిన విలనేశ్వరుని మట్టుబెట్టటమే టూకీగా ఈ సినిమా కధాంశం . కధ రొటీనే అయినా సినిమాను నడిపిన విధానం , పాటలు , వగైరా మసాలాలతో కమర్షియల్ గా సక్సెస్ అయిన దాసరి ఫక్తు ఎంటర్టైనర్ .

https://www.youtube.com/watch?v=KMd1GQufiao&ab_channel=OldTeluguSongs

ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట ఓ జాబిలీ వెన్నెల ఆకాశం . చాలా చాలా మెలోడియస్ పాట . ముకుద్దర్ కా సికిందర్ సినిమా లోని ఓ సాథీరే పాట ట్యూన్లో ఉంటుంది . పాటలన్నీ వేటూరే వ్రాసారు . జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . దాసరి నారాయణరావు గారికి ట్రాన్జెండర్స్ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందని అనిపిస్తుంటుంది .

ఈ సినిమాలో మోహన్ బాబుకి చీరె కట్టి , కె వి చలాన్ని మాడా లాగా చూపించి దాసరి ఓ పాట పెట్టారు . రాజు లేనప్పుడు సారంగో రారాద పోరాద సారంగో పాట . సరదాగా సాగుతుంది . వానొచ్చె వరదొచ్చె (కొండవీటి సింహంలో కూడా ఇవే పదాలతో ఓ పాట ఉంటుంది).., అదరహో అదరహ , కాయ్ రాజా కాయ్ పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి .

jayaprada

దాసరి సినిమా అంటే డైలాగులు , డ్రామా , ఎమోషన్స్ ఫుల్లుగా ఉంటాయి . ఈ సినిమాలోనూ ఉన్నాయి అవన్నీ . అందుకు తగ్గట్లే షావుకారు జానకి , మహానటి సావిత్రి వంటి నటీమణులు ఉన్నారు . ఇతర పాత్రల్లో జయప్రద , దీప , రావు గోపాలరావు , ప్రభాకరరెడ్డి , సిలోన్ మనోహర్ , రావి కొండలరావు , అనూరాధ , తదితరులు ఉన్నారు . ఎందుకనో అల్లు రామలింగయ్య లేరు . రావి కొండలరావు వేసిన పాత్ర అల్లు పాత్ర . ఆయన వేసి ఉంటే బాగుండేది .

rebel
1979 సెప్టెంబరులో విడుదలయిన ఈ దాసరి సినిమా ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది . ఆ ఏడింటిలో మా గుంటూరు ఉంది . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం దాసరే .

కుదించబడిన సినిమా యూట్యూబులో ఉంది . అసలయిన ఫుల్ సినిమాను కృష్ణంరాజు అభిమానులో , దాసరి అభిమానులో యూట్యూబు లోకి ఎక్కిస్తే బాగుంటుంది . ఈ మాటను వారి అభిమానులకు ఎవరయినా చేరవేయాలని నా మనవి . A watchable , musical entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు అభిశంసన… ఇండి కూటమి వృథా ప్రయాస…
  • …. చివరకు దాసరితో కూడా యముడి వేషం వేయించేశారు…
  • ‘‘మీరు శివం దూబె కదా… అయ్యో, నో, నో, అందరూ అలాగే పొరబడతారు సర్’’
  • అందరూ ప్రేమించారు… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు థూత్కరిస్తున్నారు…
  • కసబ్ గాడి కళ్లల్లోకి చూస్తూ… ‘వీడే వాడు’ అని వేలెత్తి చూపిన నైటింగేల్…
  • కన్నడ వేణుస్వామి..! ఈ గ్యాస్ కష్టాల గురించీ ఎప్పుడో చెప్పాడు..!!
  • రాజా విక్రమార్క… ఒక వేట, ఒక బందిపోటు, ఒక అగ్గిబరాటా…
  • ఓ వైద్యుడి మానవత- ఓ పేద కూలీ నిజాయితీ… ఆహా; రుణానుబంధం…
  • రైట్ టు డై..! ఈ తీర్పు చెప్పేవేళ… ఆ జడ్జి కంటతడి ఎందుకంటే..?
  • నేను పావనిపుత్ర, నాట్ సరస్వతిపుత్ర… అనంతశ్రీరామ్ సెటైర్ ఎవరిపై..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions