ఒక మిత్రుడి పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… దాని సారాంశం ఏమిటంటే… సాధారణంగా బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి వాణిజ్య ప్రకటనలు తక్కువే… ఏదిపడితే అది అంగీకరించేయడం అనేది కనిపించదు… ఆ రేంజ్ పర్సనాలిటీని ఒక యాడ్‌లో నటింపజేయడం అంటే ఆ రేంజులో సదరు కంపెనీ బిజినెస్ ఉండాలి… మార్కెటింగ్‌లో పర్‌ఫెక్షన్ కనిపించాలి… శుభగృహ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఆయనతో ఓ యాడ్ చేయించింది…
చిరంజీవిని శుభగృహలో యాడ్‌లో చూస్తుంటే కాస్త విస్మయకరంగానే ఉంది… అందులో ఖుష్బూ ఉంది… వాళ్లిద్దరి దంపతులు అన్నమాట… యాడ్ చేసింది ప్రస్తుతం పాపులర్ దర్శకుల్లో ఒకడైన సుకుమార్… పైగా యాడ్‌లో ఆయన ప్రియమైన యాంకరిణి అనసూయ కూడా ఉంది… సో, యాడ్ కోణంలో మంచి క్యాస్టింగ్… కంటెంట్ సాదాసీదాగా ఉన్నా సరే, యాడ్ బాగానే అనిపించింది… మరీ యాడ్‌లో కూడా అమ్మడూ కుమ్ముడూ, అడ్డంగా నరుకుడు గట్రా టిపికల్ తెలుగు హీరో ఫీట్లు ఉండవు కదా… పైగా అదేమో ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ కంపెనీ…
గతంలో కూడా పలువురు సినిమా సెలబ్రిటీలతో యాడ్స్ చేసినట్టుంది ఈ కంపెనీ… సరే, ఆ వాణిజ్య ప్రకటన చూసి, అమితానందంతో, వాళ్ల వెబ్‌సైట్ వెతికి, ఓపెన్ చేస్తే మరింత విస్మయం… ఏదీ సరిగ్గా లేదు… అందులో వీడియోల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఓపెన్ కావు… ఎర్రర్… అన్ని ప్రాజెక్టుల్లోనూ అదే వీడియో… ఐనా ఓపెన్ కాదు…
Ads
దాదాపు ప్రతి ప్రాజెక్టులోనూ కొన్ని సేమ్ ఫోటోలు… కంప్లీటెడ్ ప్రాజెక్టుల్లో అవే, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లోనూ అవే… సర్లె, వాళ్ల కంపెనీ వాళ్ల ఇష్టం, మనదేం పోయిందిలే అనుకుని క్లోజ్ చేసే టైమ్‌కు ఓ పాపప్… మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లైవ్ లైన్‌లో ఉన్నారు, చాట్ చేయొచ్చు అని… ఇదేదో డౌట్ క్లియర్ చేసుకుందామని ఓ ప్రశ్న వేసి, ఎదురుచూస్తుంటే ఎంతకీ ఎవరూ రిప్లయ్ ఇవ్వరు…
మొత్తానికి సైటులో కరెక్టుగా ఉన్నదేమిటీ అంటే… ఒక కామన్ ఎంక్వయిరీ ఫోన్ నెంబర్… అఫ్ కోర్స్, ఓ ప్రైవేటు కంపెనీ యాడ్ ఎలా ఉంటే మనకేంటీ అంటారా..? అదేమిటండీ… మన మెగా స్టారుడు, మన ఖుష్బూ మేడం జంటగా నటించిన యాడ్… మన అభిమాన యాంకరిణి కూడా ఉంది… వెరసి కథలో నీతి ఏమిటయ్యా అంటే..? డబ్బు ఖర్చు చేసి యాడ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు… మెగాస్టారుడు,మెగాస్టారిణిని కూడా జంటగా నటింపజేయవచ్చు… కానీ దానికి తగినట్టుగా మార్కెటింగ్, ఇన్‌ఫర్మేషన్, కస్టమర్ ఇంటర్‌ఫేస్ కూడా ముఖ్యం… మరీ చిరంజీవి పరువు తీయడం దేనికి బ్రదర్స్…?!
Share this Article