.
మనం చెప్పుకోవడం మరిచిపోయాం… అది సద్దురుగా పిలవబడే జగ్గీ వాసుదేవ్, ఇషా ఫౌండేషన్ సృష్టికర్త చేసిన కైలాస యాత్ర… అదేమిటి… బోలెడు మంది వెళ్తుంటారు… సద్దురు టీమ్ ఏటా చాలామందిని మానస సరోవరం, కైలాస యాత్రలకు తీసుకెళ్తుంది కదా, తనూ వెళ్లాడు, విశేషం ఏమిటీ అంటారా..?
విశేషమే… అది చెప్పుకోవడానికి ముందుగా… సద్దురు పర్సనల్ లైఫ్, ఆస్తుల సమీకరణ వంటి అంశాల్లో తన మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి… జనంలో కూడా ఎన్నాళ్లుగానో అవి చర్చనీయాంశాలే… ఇక యాత్ర విషయానికి వస్తే…
Ads
తన వయస్సు డెబ్భయ్… ఈ వయసులో దేహానికి ప్రతి విషయంలోనూ అలసట సహజం… ఎటూ వెళ్లడానికి సాహసించనివ్వదు… కానీ ఈ వాసుదేవుడు అంగీకరించడు దీన్ని… మనసులో గట్టిగా సంకల్పిస్తే వయసు, దేహ స్థితి పెద్ద అడ్డంకులే కాదంటాడు… ఫిట్‌గా ఉండటానికి యోగా ఉందిగా అంటాడు…
అందుకే రీసెంటుగా ఓ మోటార్ సైకిల్ ఎక్కాడు.., హిమాలయాల ఎత్తైన మార్గాల్లో, అసలు శ్వాస తీసుకోవడమే కష్టమయ్యే ఎత్తుల్లో ప్రయాణం చేశాడు… యాత్ర పూర్తి చేశాడు… అసలు అది కాదు విశేషం…
ఆశ్చర్యం ఏమిటంటే – ఆయన రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడు… ఆపరేషన్ తర్వాత చాలామంది విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కదా… డాక్టర్లు కూడా అదే చెబుతారు కదా… కానీ ఈయన మాత్రం యాత్రకు బయలుదేరాడు…
ఇది కేవలం శారీరక పటుత్వం నిరూపించుకునే యాత్ర కాదు, “నేను బలహీనుణ్ని కాదు” అనే ఆత్మవిశ్వాసపు ప్రకటన…
కైలాస యాత్ర అంటే ఆధ్యాత్మికత ప్రయాణానికి ఓ ప్రతీక… కానీ జగ్గీ వాసుదేవ్ చూపిన దారి భిన్నం… భక్తి, ధ్యానం, మౌనం – వాటితో పాటు ఒక అడ్వెంచర్ స్పిరిట్ కూడా కలిపాడు ఈ జర్నీకి… ఆ భావ మిశ్రమం వల్ల యువత కూడా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవుతారనేది తన ఆశ…
ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో ఈ సాహసయాత్ర ఎలా చేశారు అనడిగితే… యోగ సాధన ఇచ్చిన బలం అంటాడు… గట్టి సంకల్పం ఇచ్చిన ఆత్మవిశ్వాసం అంటాడు… అన్నింటికీ మించి ఆధ్యాత్మిక బలమే దన్నుగా నిలిచిందీ అంటాడు…!
ప్చ్, మనలో చాలామందికి చార్ ధామ్, వైష్ణో, అమరనాథ్ యాత్రలంటేనే ఓ వెనుకంజ.,. తను అలా, ఆ స్థితిలో, ఆ వయస్సులో మోటార్ సైకిల్ మీద అలవోకగా ఏకంగా మానస సరోవర్, కైలాష్ చుట్టేసి వచ్చాడు…! అదే విశేషం..!!
Share this Article