వేసవి అంటే మండే ఎండలే కాదు… మల్లెలు, మామిడికాయలు కూడా..! ఆవకాయ పచ్చళ్లు సరేసరి..! వేసవిలో ప్రతిరోజూ ప్రతి ఇంట్లో ప్రతి పళ్లెంలో ఏదో ఒక మామిడి రెసిపీ… అదీ ఊరగాయకు తోడుగా కనిపిస్తూనే ఉంటుంది… అన్నట్టు, ఓ కేరళ తరహా డిష్ ఒకటి తెలంగాణలో చాలాచోట్ల వండుకుంటారు… జంతుకాలు… (జంతికలు కాదు…) మీకు యూట్యూబ్ చానెళ్లలో ఈ డిష్ తయారీ వీడియోలు కనిపించవు… చాలామందికి ఇది తెలియదు కాబట్టి…
కొన్ని తెలుగు వీడియోల్లో మాత్రం కేరళలో చేసుకునే ఇడియాప్పం రెసిపీ తయారీ కనిపిస్తుంది… కానీ అది వేరు… ఇది వేరు… స్థూలంగా చూస్తే రెండూ ఒకటే కదా అనిపిస్తుంది కానీ వేర్వేరు… ఇప్పుడు మనం చెప్పుకునేది కొత్త ఆవకాయకు, మామిడిరసానికీ లింకు… ఓసారి ఇడియాప్పం కోసం ఏం చేస్తారో చూద్దాం… (యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి, కొన్ని వీడియోలు తెలుగులో కూడా ఉంటాయి…) బియ్యపుపిండిలో వేడినీళ్లు కలిపి, ముద్దగా చేసి, కారప్పూస-జంతికలు చేసే పావులో పెట్టి (మవుడు పావు, మురుకుల పావు…) సన్నగా నూడుల్స్‌లాగా వచ్చేట్టు ప్రెస్ చేయాలి… (గతంలో చెక్కవి కూడా ఉండేవి… ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్‌వీ దొరుకుతున్నయ్…)
Ads
నూడుల్స్‌లాగా ఒత్తుకున్నాక వాటిని ఇడ్లీ ప్లేట్లలో గానీ, ఇడియాప్పం పాత్రల్లో గానీ పెట్టి, ఆవిరి మీద ఇడ్లిల్లాగే ఉడికించుకోవాలి… అదీ ఇడియాప్పం తయారీ… దీనికి ఆధరువుగా మళ్లీ STEW విడిగా చేసుకోవాలి… కానీ మనం చెప్పుకునేది వేరు… వినాయక చవితికి కుడుములు, ఉండ్రాళ్లు చేసుకోవడం తెలుసు కదా… సేమ్…
(ఇప్పుడు మార్కెట్‌లో ఇలాంటి సౌకర్యవంతమైన జంతుకాల పీటలు దొరుకుతున్నయ్… మురుకులు, కారప్పూస కూడా ఒత్తుకోవచ్చు సులభంగా…)
బియ్యపుపిండి… కాస్త ఉప్పు వేసుకున్న వేడినీళ్లు… అవి పోస్తూ పిండిని మెత్తటి ముద్దగా పిసుక్కోవడం… ఇదే కాస్త శ్రమ ఎక్కువ వ్యవహారం… తరువాత వాటిని ఆవిరి మీద ఉడికించి, వాటిని ఈ మురుకుల పావులో పెట్టి నూడుల్స్‌లాగా ప్రెస్ చేసుకోవాలి… (కొన్ని ఇళ్లల్లో జంతుకాలకు ప్రత్యేకంగా పీట ఉంటుంది… అదయితే ప్రెస్ చేయడం సులభం)… ఇవీ రైస్ ఫ్లార్ నూడుల్స్… కుడుములు, ఉండ్రాళ్లు అవే సైజులో లాగిస్తాం… వాటిని వేడి మీద నూడుల్స్‌లా ప్రెస్ చేసుకుంటే జంతుకాలు… అంతే…
నూనె కాస్త వేసుకుని, కొత్త ఆవకాయ కలుపుకుని కుమ్మేయడమే… ఎలాగూ మామిడిరసం పక్కనే మరో ఆధరువుగా తయారుగా ఉంటుంది కదా… చాలామంది కొత్త బియ్యాన్ని పిండి పట్టించి, దాన్ని వాడతారు… సో, కొత్త ఆవకాయ, కొత్త బియ్యం, తోడుగా మామిడి… పొద్దున చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ అదే… లంచ్ అదే… రాత్రికి వాటినే పొడిపొడిచేసి… ఉప్మాలాగా, రైలుబండి పలారంలాగా చేసుకోవడం… అది మరింత టేస్ట్… సో, ఇదీ మరో వేసవి రెసిపీ… చాలామందికి తెలియని రెసిపీ…!!
Share this Article