తెలుగు టీవీ టాప్ యాంకర్ ఎవరు..? అంటే, ప్రేక్షకుల్లో పాపులర్ ఎవరు అని..! సాధారణ పాఠకుడికి ఇది పిచ్చి ప్రశ్న… కానీ రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు కాస్త ఇంట్రస్టింగు ప్రశ్నే… ప్రశ్న చదవగానే వెంటనే… చాలామంది ‘‘ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది..? ఏజ్ బార్ కనకాల సుమ ఫిమేల్ నంబర్ వన్ యాంకర్… సేమ్ ఏజ్ బార్ ప్రదీప్ మేల్ నంబర్ వన్ యాంకర్… మిగతావాళ్లు ఎవరూ వాళ్లను రీచ్ కాలేరు’’ అని తేలికగా చెప్పేస్తారు… కానీ అంత వీజీగా తేల్చిచెప్పేయడం కరెక్టు కాదు… తెలుగు టీవీలకు సంబంధించి నలుగురు టాప్ యాంకర్లు… సుమ, ప్రదీప్‌తో పాటు అనసూయ, రష్మిని అస్సలు లైట్ తీసుకోవడానికి వీల్లేదు…
సుమ టీవీ షోలతోపాటు సినిమా ఫంక్షన్లు చేసుకుంటుంది… ఏ షో చేసినా అది కిట్టీ పార్టీ టైపు ఉంటుంది… దాంతో ఎంత స్పాంటేనిటీ, ఎంత ఎనర్జీ, ఎంత కామెడీ టైమింగు, ఎంత టైమ్లీ పంచింగు ఉన్నా సరే, సుమ షోలకు సంబంధించి మొనాటనీ వచ్చేస్తోంది… అది ఆమెకూ తెలుసు… సెలబ్రిటీ చాలెంజ్, మ్యూజిక్ ప్లస్ అని కాస్త డిఫరెంటుగా ట్రై చేస్తోంది… ఇక ప్రదీప్… ఏ షో అయినా సరే నడిపించేయగలడు… డాన్స్, సినిమా, కామెడీ, మ్యూజిక్… ఏదయినా సరే, సేమ్ ఎనర్జీతో లాగించేస్తాడు… ఈమధ్య కాస్త అతి చేస్తున్నాడు గానీ ఉన్నంతలో ఎఫిసియెంట్ యాంకర్… ఈమధ్య ఓ సినిమాలో హీరోగా కూడా చేశాడు… మరి వీళ్లకు మిగతావాళ్లతో పోలిస్తే బాగా ఆదరణ ఉండాలి కదా… అంత లేదు… ఉదాహరణకు వీళ్ల ఇన్స్టాగ్రాం ఖాతాలనే తీసుకుందాం…
Ads
17 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు… తను జస్ట్, 41 మందిని ఫాలో అవుతుంది… ఆమె పోస్టులు కూడా తక్కువే… 552… తన షోలకే ఆమె టైం సరిపోదు… ఇక సోషల్ ఇంటరాక్షన్‌కు చాయిస్ ఎక్కడిది..? ఈమధ్య కారులో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ ఫేస్బుక్ లైవ్ చాట్ చేస్తున్నట్టుంది… ఆమధ్య కరోనా లాక్డౌన్ వేళ, ఏవో వంటలు, సెలబ్రిటీల బాపతు వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది… ఆహా ఓటీటీ కోసం ఇంకేదో ప్రోగ్రాం చేసింది… బట్, సస్టయిన్ చేయలేదు… ముందే చెప్పుకున్నాం కదా… చిన్న చిన్న ఆటలు, ప్రశ్నలు, పజిళ్లు… అవయితేనే ఆమెకు సూటబుల్…
21 లక్షల మంది ఫాలోయర్లు ప్రదీప్‌కు… అంటే సుమకన్నా ఇన్‌స్టాలో పాపులర్ తను… అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువే తనకు… తనేమీ సోషల్ యాక్టివిస్టు కాదు… పెద్దగా లైవులు గట్రా ఉండవు… తనదీ అదే ప్రాబ్లం… వరుస టీవీ షోలతో తనకు దొరికే టైమ్ తక్కువ… ఇన్‌స్టాలో తన పోస్టులు జస్ట్, 288 మాత్రమే… తను కూడా పెద్దగా ఎవరినీ ఫాలో కాడు… 89 మంది… నిజానికి రోజుకు ఒక్కసారైనా ఇన్‌స్టా ఓపెన్ చేస్తాడో లేదో కూడా డౌటే… అదేదో సినిమాలో కొత్తగా హీరోగా చేశాడు కాబట్టి ఈమాత్రం సోషల్ టచ్‌లోకి వస్తున్నాడేమో తప్ప… లేకపోతే అదీ ఉండదేమో…
అనసూయ… గ్లామర్ షో, అడపాదడపా సినిమాల్లో అవకాశాలు… ప్రధానంగా కనిపించేది మాత్రం ఈటీవీ జబర్దస్త్… సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్… ట్రోలింగు చూస్తే చిరాకు, కోపం, కేసులు పెడతానంటూ బెదిరింపులు… ప్రపంచంలోని ఏ విషయం మీదనైనా సరే రియాక్ట్ అవుతూ ఉంటుంది… ఎవరైనా నెగెటివ్‌గా రియాక్టయితే ఉల్టా ఫైరయిపోతుంటుంది… ఇద్దరు ఎదిగిన పిల్లలున్నా సరే, ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నందున యూత్‌లో కాస్త క్రేజ్ ఉంది… ఐనా సరే, ఇన్‌స్టాలో ఆమె ఫాలోయర్లు జస్ట్, 8.5 లక్షలు… తను 197 మందిని ఫాలో అవుతుంది… ఎక్కువ యాక్టివ్ అని చెప్పుకున్నాం కదా, 1833 పోస్టులున్నయ్…
రష్మి… ఈరోజుకూ యాంకర్లలో ఈమె అంటేనే టీవీజనంలో క్రేజు… నెటిజనంలో క్రేజు… బాగా పాపులర్… 30 లక్షల మంది ఫాలోయర్లు… తను ఫాలో అయ్యేది 401 మాత్రమే… ఇన్‌స్టాలో బాగానే యాక్టివ్… 2162 పోస్టులున్నయ్… అప్పట్లో గుంటూరు టాకీస్ వంటి బోల్డ్ పాత్రలు నటించినా సరే, తరువాత అన్నీ చాలించుకుని, కేవలం టీవీ షోలకే పరిమితం అయిపోయింది… ఢీ, జబర్దస్త్… వేరే చానెళ్లలోనూ వేరే షోలు చేయదు… మిగతా యాంకర్లలాగా ప్రతి చానెల్ తలుపు తట్టదు… సుధీర్‌తో లవ్ ట్రాక్ ఈరోజుకూ లైవ్, టీవీజనానికి వాళ్లను చూస్తే ఓ సంబరం… సుమకు సూట్ కాదులే గానీ… అనసూయకు, ప్రదీప్‌కు కూడా టీవీ లవ్ ట్రాకులు లేకపోవడం కాస్త మైనసే… సో, ఎన్నయినా చెప్పండి… ఇన్‌స్టా లెక్కల్లో… సుమ కాదు, ప్రదీప్ కాదు, అనసూయ కాదు… రష్మి మాత్రమే టాప్ యాంకర్…!!
Share this Article