రష్మిక మంథన తన నోటిదురుసు, అహం వల్ల కన్నడ ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి దూరం అయిపోతోంది… ప్రత్యేకించి కాంతార దర్శకుడు రిషబ్ శెట్లితో ఆమె పిచ్చి గొడవ, ఇద్దరూ గోక్కోవడం అల్టిమేట్‌గా ఆమెకే నష్టదాయం అవుతోంది గానీ రిషబ్‌శెట్టికి కాదు… ఆ సోయి కూడా ఏమీ లేదు రష్మికలో… ఒక దశలో కన్నడ ఎగ్జిబిటర్లు కూడా ఆమె మీద కోపంతో ఆమె తాజా సినిమా వారసుడిని ప్రదర్శించకూడదని అనుకున్నారు…
కానీ కిరాక్ పార్టీ సమయం నుంచీ ఆమెకు పలు సందర్భాల్లో అండగా నిలబడిన కిచ్చా సుదీప వంటి హీరోల కారణంగా ఎగ్జిబిటర్లు మూకుమ్మడిగా ఆమె మీద నిషేధం వంటి తీవ్ర నిర్ణయం ఏమీ తీసుకోలేదు… పైగా ఈ సినిమాను కొన్న బయ్యర్లకు ఎగ్జిబిటర్లకు సత్సంబంధాలు ఉండటం మరో కారణం… ఐనాసరే, వాళ్లకు లోలోపల పీకుతూనే ఉంది, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని…
Ads
ఆ భయం నిజమే… ప్రేక్షకులు ఆ సినిమాను లైట్ తీసుకున్నారు… ఈమధ్య కన్నడ ప్రేక్షకులకు కన్నడ ఇండస్ట్రీ మీద అఫెక్షన్ బాగా పెరిగి, కన్నడ సినిమా మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు… సో, రష్మిక నోరు సినిమాకు చేటుతెచ్చింది… సినిమా 11న విడుదలైంది… అసలు సినిమా మీద మంచి టాక్ రాలేదు… కాకపోతే విజయ్ స్టార్‌డం కారణంగా తమిళనాడులో వసూళ్లు బాగానే ఉన్నాయి… కానీ ఆ ప్రేమ తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ఉండాలని ఏముంది..?
అందుకే మూడు రాష్ట్రాల్లోనూ ఫట్… మలయాళం సంగతి తెలియదు… రష్మిక నోటితీట కారణంగా కనీసం 300 షోలను రద్దు చేసుకోవాల్సి వచ్చినట్టు కన్నడ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది… ఎన్ని షోలు, ఎంత నష్టం అనేది కాదు ఇక్కడ చూడాల్సింది… రష్మిక పోగుచేసుకుంటున్న వ్యతిరేకత గురించి…! అదీ సొంత మదర్ లాంగ్వేజీలో..!
న్యూస్18 కథనం ప్రకారం… మొదటిరోజు ఈ సినిమా స్క్రీనింగ్స్ 757… మరుసటిరోజుకు ఆ సంఖ్య 466కు పడిపోయింది… ఈ సంఖ్య మరింత పడిపోయింది… ఇక సినిమా కన్నడనాట లేవదు… ఎత్తిపోయినట్టే… అయితే ఈ నష్టానికి మొత్తం కారణం రష్మిక కాకపోవచ్చు… ఆమె పాక్షిక కారణం కావచ్చు, సినిమా మౌత్ టాక్ సరిగ్గా లేకపోవడం మరో కారణం కావచ్చు… అయితేనేం, గాలి దుమారం మొత్తం రష్మిక మీదకు లోకల్ మీడియా డైవర్ట్ చేస్తోంది…
నిజానికి రిషబ్ శెట్టి స్పందన, ప్రవర్తన కూడా సరిగ్గా లేవు… హుందాగా లేదు… రష్మిక మనసులో ఏదో నొప్పి ఉంది, బయటికి వ్యక్తీకరిస్తోంది… పోనీ, ఆమె తింగరి… మరి రిషబ్ శెట్టి పెద్దరికం ఏమైనట్టు..? పైగా తెలుగులో గానీ, తమిళంలో గానీ ఇలాంటి చిల్లర పంచాయితీలు తలెత్తితే ఎవరో ఇద్దరికీ కావల్సిన శ్రేయోభిలాషులు పిలిచి, మాట్లాడి సెట్ రైట్ చేస్తారు… కన్నడంలో అదీ దిక్కులేనట్టుంది…
ప్రస్తుతం ఆమెకు తెలుగు, తమిళం, హిందీల్లో అవకాశాలున్నాయి సరే… కానీ ఆమెకు కాలం ఎప్పుడూ ఇలాగే సహకరించాలని ఏమీ లేదు… అలాంటప్పుడు మళ్లీ కన్నడ ఇండస్ట్రీయే తల్లిలా ఒడిలోకి తీసుకుంటుంది… ఆ నిజం ఆమెకు అర్థం కావడం లేదు… నోటి తీటను తగ్గించుకోనంత కాలం ఆమెకు మంచిది కాదు… వేణుస్వామితో ఎన్ని నష్టనివారణ ప్రత్యేక పూజలు చేయించుకున్నా సరే..!!
Share this Article