Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !

June 28, 2026 by M S R

.

అతడు సినిమాలో ఓచోట తనికెళ్ల భరణి డైలాగ్ … ‘‘అన్ని సుమోలు ఎందుకురా బుజ్జా’’ … బన్నీ- అట్లీ సినిమా ‘రాకా’లో నటించే హీరోయిన్ల పేర్లు రోజుకొకటి యాడ్ అవుతున్న తీరు చూస్తే ఆ డైలాగే గుర్తొస్తుంది. అసలు బన్నీ సినిమాలో ఇంతమంది అవసరమా అని!

“దీపికా పదుకోన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఫెమినా జార్జ్… ఒక్కో అప్‌డేట్‌తో ఒక్కో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ లైనప్ చూస్తుంటే, అదీ అందరూ డిమాండ్ ఉన్న పెద్ద స్టార్లే కావడంతో… సినిమా నిర్మాణవ్యయం మీద కూడా రోజుకో అంచనా వినిపిస్తోంది… 700 కోట్లు అని తాజా అంచనా.

Ads

ఐతే ఈ హీరోయిన్లలో రష్మిక పాత్ర గురించిన విశేషాలు మరింత ఆసక్తికరం… ఈమధ్య భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటోంది ఆమె. మామూలుగా బన్నీ- రష్మిక అనగానే గుర్తొచ్చేది పుష్ప, పుష్ప2… ఈ సినిమా ఇద్దరినీ ఎక్కడికో తీసుకుపోయింది…

రాకా సినిమాలో మళ్లీ ఆ ఇద్దరే అనేసరికి మళ్లీ ప్రేక్షకులకు ఆ ఇద్దరి రొమాన్స్ గుర్తొస్తాయి కదా, కానీ కాదట. ఈసారి తను విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తోందట. ఒకప్పుడు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అంటే ప్రేమ, పాటలు, డ్యూయెట్లు. కానీ ఇప్పుడు అదే జోడీ ఒకరినొకరు ఢీకొంటే? ఆ ఆలోచనే ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటివరకు “శ్రీవల్లి” అంటే అమాయకత్వం, ప్రేమ, భావోద్వేగాలే గుర్తొచ్చాయి. అలాంటి ఇమేజ్ ఉన్న రష్మిక ఒక్కసారిగా గ్రే షేడ్స్ లేదా విలనిజం ఉన్న పాత్రలో కనిపిస్తే… అది ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ అవుతుంది. నటిగా కూడా ఆమెకు ఇది పూర్తిగా కొత్త ఛాలెంజ్. అందుకే ఈ గాసిప్ నిజమైతే, ‘రాకా’లో అత్యంత ఆసక్తికర అంశం ఇదే అయ్యే అవకాశం ఉంది.

ప్రచారం ప్రకారం ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్‌లో రష్మిక కూడా జాయిన్ అయిందట. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత బన్నీకి రష్మిక “లక్కీ చార్మ్”గా మారిందని అభిమానులు భావిస్తుండటంతో, ఆమె ఈ ప్రాజెక్టులో భాగమవుతుందనే వార్త వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ హీరోయిన్లే గాకుండా, షారుఖ్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ స్టార్ కాస్టింగ్ నిజమైతే, ‘రాకా’ కేవలం తెలుగు సినిమా కాకుండా నిజమైన పాన్ ఇండియా ఈవెంట్‌గా మారడం ఖాయం.

రష్మిక నెగెటివ్ రోల్, షారుఖ్ క్యామియో, మిగతా నటీనటుల ఎంపికపై ఇప్పటివరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారమే ఇది. కానీ అట్లీ సినిమాల్లో పాత్రల విషయంలో ఊహించని ట్విస్టులు ఉండటం, రష్మిక కూడా నటిగా కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండటం వల్ల ఈ వార్తను అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ఒక విషయం మాత్రం నిజం… “నేషనల్ క్రష్” రష్మిక విలన్‌గా కనిపిస్తే, అది ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
  • ఆశ్చర్యమేమీ లేదు- పాక్ క్రికెటర్లతో ఉగ్రవాదుల చెట్టాపట్టాల్!
  • పాకిస్థాన్! … అరబ్ భ్రమల నుండి సింధు, సంస్కృత మూలాల వైపు…
  • ‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?
  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!
  • గ్లోబల్ ఎంఎన్సీల వైపు యువ గిరిజనం! సరికొత్త సక్సెస్ స్టోరీలు!
  • ఓహో… ఈ ‘ఇడుపు కాయితం’ రచ్చకు అక్కడ బీజం పడిందా..?!
  • ‘‘ఓహ్.., నేను ఇంకా టీచింగు నుంచి రిటైర్ కాలేదన్నమాట’’
  • కువిమర్శ! అయోధ్య విరాళాలతో బీజేపీ ఎంపీలను కొన్నదట!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions