.
అసలు సమంతకు రష్మికకు పోలిక ఎందుకు తీసుకురావాలి..? మీడియా ఊరుకోదు కదా, ఏదో పొగ పెట్టే ప్రయత్నం… ఒకే రోజున ఈ ఇద్దరి సినిమాలూ రిలీజయ్యాయి… సమంత నటించిన మా ఇంటి బంగారం, రష్మిక నటించిన కాక్‌టెయిల్-2…
ఇందులో మా ఇంటి బంగారం సినిమా తెలుగు ప్రేక్షకులపై ఆధారపడిన తెలుగు సినిమా… కానీ కాక్‌టెయిల్2 జెన్-జీ తరాన్ని టార్గెట్ చేసుకున్న విభిన్నమైన కంటెంటు… హిందీ సినిమా… పైగా ఇది రష్మిక బేస్డ్ సినిమా కాదు, తోడుగా కృతి సనన్ ఉంది…
Ads
నిజానికి కృతి బోల్డ్ నటన బాగా హైలైట్ అయ్యింది సినిమాలో… సినిమాలో రష్మిక ఒక పాత్ర, అంతే… రెండు సినిమాల కథలు వేరు, నేపథ్యాలు వేరు… రష్మిక నేషనల్ క్రష్ అయ్యాక, విజయ్ దేవరకొండను పెళ్లాడాక రిలీజైన సినిమా ఇది… యానిమల్, చావా, పుష్ప తదితర సినిమాలు ఆమెను ఎక్కడికో తీసుకుపోయాయి… వ్యక్తిగత జీవితంలోనూ ఆనందాన్ని పొందుతోంది…
కానీ సమంత అలా కాదు కదా… అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయాక, ఆ పెళ్లి తాలూకు చేదు అనుభవాల్ని చెరిపేసుకుంటూ… రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలో ఆనందాన్ని వెతుక్కుంటోంది… కానీ తన ఇమేజ్ సౌత్ సినిమాలకే పరిమితం… సో, ఒకేరోజు విడుదలైన ఆ ఇద్దరి సినిమాల వసూళ్లతో వాళ్లిద్దరినీ పోల్చడం కరెక్ట్ అనిపించదు… దేనికదే…
ఎస్, సమంత సినిమా మా ఇంటి బంగారం సినిమాకు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ… 35 కోట్ల అంచనా… కానీ ఒకే వీకెండ్‌తో బ్రేక్ ఈవెన్ అవుతోందట, ఫిలిమ్ సర్కిళ్లలో ప్రచారం… ఇందులో ఆమే షీరో… రెండు రోజుల్లో 13 కోట్లు వసూలు చేసిందట… (తమిళ వెర్షన్ కూడా రిలీజ్ చేశారు, కానీ అక్కడ పెద్దగా బజ్ లేదు, రెస్పాన్స్ కూడా పెద్దగా లేదు)…
కానీ రష్మిక సినిమా మొదటి రెండు రోజుల్లో 23.5 కోట్ల వసూళ్లు… కాకపోతే ఈ కాక్‌టెయిల్2 సినిమాకు మిక్స్‌డ్ టాక్ ఉంది, షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందాన ఉన్నా సరే, సినిమా బోర్ కొట్టిందట… థియేటర్లలో యాక్యుపెన్సీ కూడా తక్కువ…
ఈ సినిమా ప్రేక్షకుల నుంచి చాలా ఓపికను డిమాండ్ చేస్తుంది… ముఖ్యంగా సెకండాఫ్ ఎంతో సహనం ఉంటే తప్ప భరించడం కష్టం… రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఎమోషన్లు తక్కువ మోతాదులో ఉండాలి… ఇందులో ఎక్కువ పెట్టేయడంతో ఒకదశలో చిరాకు పుడుతుంది… ఆర్టిస్టుల ప్రాధాన్యతా క్రమం చూసుకుంటే షాహిద్, కృతి సనన్ తర్వాతే రష్మిక మందాన… ఇదండీ సంగతి..!!
Share this Article