.
ప్రభుత్వాలు చాలా పథకాలు అమలు చేస్తుంటాయి… కొన్ని పథకాల ఇంపాక్ట్ సమాజం మీద రకరకాలుగా ఉంటుంది… అంటే బహుముఖం… అలా ఎక్కువ పాజిటివ్ అంశాలు కనిపించేదే ఉపయుక్త పథకం… రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ‘అందరికీ రేషన్ సన్నబియ్యం’ అలాంటిదే…
ఓ చిన్న వార్త కనిపించింది… సాక్షి, భిక్కనూరు… హెడింగ్, సన్నబియ్యంతో పాశం చేసుకున్నాం సారూ… వార్త ఏమిటంటే..? ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మహిళలతో ముచ్చటిస్తున్నప్పుడు ఒకామె సంబురంగా తనతో చెప్పిన మాట ఇది… పథకం ఏమేరకు జనంలోకి వెళ్లిందో చెప్పడానికి ఇది ‘‘ఉడికిన సన్నబియ్యం అన్నంలోని ఓ మెతుకు’’….
Ads
రాష్ట్రంలో వరి బాగా పండుతోంది… దేశంలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది… అందులోనూ రైతులు సన్నాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు… దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం బోనస్ ధరనూ చెల్లిస్తున్నది… మనం పండించే సన్నాలు మనమే తినకపోతే ఎలా మరి..?
అలా రేషన్ షాపుల్లోకి, తద్వారా పేదజనం సంచుల్లోకి సన్నబియ్యం వస్తోంది… ఒకప్పుడు రేషన్ బియ్యం అంటేనే దొడ్డు బియ్యం, నాసిరకం… చాలామంది తీసుకునేవాళ్లే కాదు, తీసుకున్నవాళ్లలో చాలామంది అమ్మేసుకునేవాళ్లు.., చాలావరకు డీలర్లు అమ్ముకునేవాళ్లు… ఆహారభద్రత పక్కదారి పడుతుండేది…
సన్నబియ్యం పంపిణీ అనేసరికి కార్డుదారులు తప్పనిసరిగా రేషన్ బియ్యం తీసుకోవడం ప్రారంభించారు… దాంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి ఆటోమేటిక్‌గా బ్రేకులు పడతాయి… సన్నబియ్యం ధర ఎక్కువ కాబట్టి గతంలో కొనుక్కోలేని పేదలకు ఈ రేషన్ సన్నబియ్యం నిజంగా కడుపును, మనసును నింపే పథకంగా మారింది… పరమాన్నం (పాశం) అవుతోంది… పైన వార్తలో మహిళ ఆనందం అదే…
మరి దొడ్డు ధాన్యం మాటేమిటి..? రాష్ట్రం కొన్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అమ్మడం, మిగిలితే విదేశాల్లో అమ్మకానికి అవకాశాలు వెతకడం…! అయితే మనం ఇక్కడ చెప్పుకునే మరో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే..? గతంలో చీప్‌గా రేషన్ బియ్యాన్ని కొనేవాళ్లు హోటళ్లు, ఫుడ్ స్నాక్స్ తయారీదారులు… ఇప్పుడు అలా అమ్ముకునేవాళ్లు తక్కువైపోయి మార్కెట్‌లో దొడ్డు బియ్యం ధరలు పెరిగాయి, ఇది దొడ్డు ధాన్యం ధరల్నీ పెంచేసింది…
మరొకటి… ప్రభుత్వమే సన్నబియ్యం విస్తృతంగా ఇచ్చేసరికి, మార్కెట్‌లో సన్నబియ్యం గిరాకీ తగ్గి, ధరలు పడిపోయాయి… ఇది మధ్యతరగతికి ప్రయోజనం… నెల, నెలన్నర క్రితం సోనా మశూరి పాతవి క్వింటాల్ ధర 4800- 5000 వరకూ దొరికేది… ఇప్పుడు ఈ ధర 4400 రూపాయలు… స్టీమ్ రైస్ 4500 నుంచి 3800 కు… అందులో కొత్తవి 4400 నుంచి 3700 కు తగ్గాయి…
మార్కెట్‌లో పిరం (అధిక ధర) బియ్యం జైశ్రీరాం… పాతవి ఏకంగా 7000 దాకా ఉండేది, 6000 కు పడిపోయింది… అంటే కిలోకు 10 రూపాయలు… కొత్తవి 6200 నుంచి 5800 కు తగ్గింది… మరో డిమాండ్ ఉన్న రకం హెచ్ఎంటీ… అవీ కొత్తవి 4800 నుంచి 4200… పాతవి 5500 నుంచి 4800 కు తగ్గింది… ఇదీ రేషన్ సన్నబియ్యం మార్కెట్ మీద చూపిస్తున్న ప్రభావం…
Share this Article