నిజమా… నిజమేనా..? యాంకర్ రవి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడా..? అదేమిటి..? ఫైనలిస్టుల్లో ఒకడు అనుకున్నాం కదా అంటారా..? ఆశ్చర్యపోతారా..? ఏమో… బిగ్‌బాస్ హౌజ్ నుంచి లీకయ్యే సమాచారం చెబుతున్నది మాత్రం అదే… ఎహె, రవి ఎవిక్ట్ కావడం ఏమిటి..? పోలింగ్ ట్రెండ్స్ చూస్తేనేమో… ప్రియాంక, సిరి, కాజల్ లీస్ట్ వోట్లతో ఉన్నారు, రవి ఎలా బయటికి వెళ్లిపోతాడు అంటారా…? ఊరుకొండి సార్, వందల కోట్ల దందా, బెట్టింగులు జరిగే క్రికెట్ మ్యాచులే ఫిక్స్ కాగా లేనిది ఆప్టరాల్ బిగ్‌బాస్ ఎంత..? ఏమో, నిజమే కావచ్చునేమో…
జరగొద్దని ఏమీ లేదు… మొదట్నుంచీ గమనిస్తే బిగ్‌బాస్ టీం షణ్ముఖ్ మీద అంతులేని ప్రేమాభిమానాలు కురిపిస్తోంది… వాళ్లు రాసిచ్చే స్క్రిప్టు ప్రకారం నాగార్జున కూడా అదే ప్రేమను ప్రదర్శిస్తున్నాడు… ఏమో… బిగ్‌బాస్ టీంలో ఎవరో ముఖ్యుడికి శ్రీముఖి దోస్త్ అనీ, ఆమె కావాలని రవి మీద కాన్సంట్రేట్ చేసిందనే ప్రచారం కూడా ఉంది… నిజానిజాలు దేవుడికెరుక… నాగార్జునకు ఎరుక… ఐనా నాగార్జునదేముంది..? స్క్రిప్టులు చదవడమేగా… ఎవరు గెలిస్తేనేం తనకు..? తనకు పోయేదేముంది..? అదే అన్నపూర్ణ స్టూడియోస్, ఆరో సీజన్‌కు కూడా తనే హోస్ట్, అక్కడే, అదే సెట్టింగ్… ఎవరు గెలిస్తేనేం, ఎవరో ముఖ్య అతిథిని పిలిచి ఓ గెలుపుదండం చేతిలో పెట్టడమే కదా…
Ads
కాదబ్బా, అదెలా కుదురుతుంది..? ప్రియాంక, సిరి, కాజల్, కాదంటే మానస్… ఇందరున్నారు వెళ్లాల్సినవాళ్లు… ఫాఫం, రవి ఎవిక్ట్ కావడం ఏమిటి అంటారా..? బిగ్‌బాస్ టీం ఇష్టమబ్బా… వాళ్లేది అనుకుంటే అదే… ఏమో, కావచ్చు, ముందే ఈ ఎలిమినేషన్లు లీకైపోతున్నయ్ కదా, ఈ లీకు రాయుళ్ల పనిపట్టడానికి, షాక్ ఇవ్వడానికి… డమ్మీ ఎవిక్షన్స్ తరహాలో రవి ఎవిక్షన్ కూడా కావాలని లీక్ చేసి ఉంటాడు అంటారా..? కావచ్చు, అదీ నిజం కావచ్చు… ఐనా వాడు వోటేస్తాడు, వీడు వోటేస్తాడు అనే లెక్కలు అంతిమంగా కుదరవు బాస్, వాళ్లేది అనుకుంటే అదే జరుగుతుంది, జరిపించి తీరుతారు… ఎవడైనా వోట్లు, మిస్డ్ కాల్స్ వివరాలు అడుగుతారా..? వాళ్లు చెబుతారా..? అసలే వంద కోట్ల దందా అది… ఈ వోట్ల మీద కాగ్ ఆడిటింగ్ ఏమైనా జరిగేది ఉందా..? హౌజ్… సారీ మ్యాచ్ ఫిక్సింగ్ జరగొద్దని ఏముంది..? జరిగితే ఎవరి — జుత్తు ఎవరు పీకేదేముంది..? కీప్ క్వయిట్… వెయిట్ అండ్ వాచ్…! ఈమాత్రం థ్రిల్, సస్పెన్స్, ఫిక్సింగులు గట్రా లేకపోతే… బిగ్‌బాస్‌కు అర్థమేముంది..? ప్రేక్షకుల వెర్రితనానికి సార్థకత ఏముంది..? అసలు బిగ్‌బాస్ అంటే బిగ్ఫ్రాడ్ అంటారా..? నో, నో, మేం మాత్రం ఆమాట అనడం లేదు… మీరు అనాలనుకుంటే మీ ఇష్టం..!! అయినా మనకు ఎందుకు లెండి, వాడి షో వాడి ఇష్టం… వీక్షించెడి వాడు గాడిద అని ఓ కొత్త సామెత…
Share this Article