Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం ఈటీవీ… బిగ్ స్టార్ రవితేజను పట్టుకొచ్చినా టీవీ రేటింగ్స్ తన్నేశాయి…

December 15, 2022 by M S R

బార్క్ రేటింగ్స్ చూస్తుంటే షాక్ అనిపించింది… ఈటీవీ వాళ్లు ఢీ ఫినాలేకు రవితేజకు రప్పించారు… బోలెడు ఖర్చు పెట్టారు… హైపర్ ఆదితో రవితేజను ఇంద్రుడు చంద్రుడు అని ఓ రేంజులో పొగిడించారు… ఒక దశలో హైపర్ ఆది పొగడ్తలకు రవితేజే ఉక్కిరి బిక్కిరయ్యాడు,.. ఆ స్థాయిలో భజన సాగింది… నిజానికి అది భజన కాదు, మరో పదం ఏదైనా వెతకండి…

నిజానికి ఈటీవీ బలమే రియాలిటీ షోలు… అందులో చాలా ఏళ్లుగా నడుస్తున్నది ఢీ అనే డాన్స్ షో… సర్కస్ ఫీట్లతో, తెలుగు పాటల్ని రీమిక్స్ చేసి, పిచ్చి పిచ్చి స్టెప్పులతో, ఇదే డాన్స్ అంటే అని కొత్త నిర్వచనం చెప్పింది ఈటీవీ… ఒకప్పుడు నడిచింది… తరువాత ఓంకార్ రంగంలోకి దిగాడు… మాటీవీలో డాన్స్ షో అన్నాడు… ఆహా ఓటీటీలో ఓ డాన్స్ షో అన్నాడు… జీతెలుగు వాడు బరిలోకి వచ్చాడు…

దీనికితోడు ఈటీవీ ఢీ షోకు ప్రాణంగా ఉన్న జడ్జిలు వెళ్లిపోయారు… కామెడీకి ప్రాణంగా ఉన్నవాళ్లూ వెళ్లిపోయారు… ఆ ప్రదీప్, ఆ హైపర్ ఆదితో జనం విసిగిపోయారు… దాంతో రేటింగ్స్ ఢమాల్… చివరకు ఫినాలే గ్రాండ్‌గా ప్లాన్ చేస్తే ఎవరూ దేకలేదు.,. ఫినాలేకు రేటింగ్స్ ఎంతో తెలుసా..? 4.45… పరమ దయనీయమైన రేటింగ్స్…

Ads

raviteja

చివరకు రవితేజ పాల్గొంటున్నాడని కూడా ప్రేక్షకులు చూడలేదు… లైట్ తీసుకున్నారు… ఎలాగూ ఒకవైపు ప్రదీప్, మరోవైపు హైపర్ ఆది డప్పు ఉంటుందని తెలుసు… సో, ఆడియెన్స్ వదిలేశారు… అదీ ఆ బిచ్చపు రేటింగ్స్‌కు కారణం… ఐనాసరే, ఈటీవీకి దిద్దుకోవాలనే సోయి వస్తే కదా… తనకు బలంగా ఇన్నాళ్లూ నిలబెడుతున్న అన్ని రియాలిటీ షోల మీద ఇంట్రస్టు తగ్గింది… ఢీ కూడా అంతే…

కొంతలోకొంత నయం… శేఖర్ మాస్టర్‌ను మళ్లీ తీసుకొచ్చారు… తెలివైనోడు… అస్థిరమైన ఆహా వంటి డాన్స్ షోలకన్నా… ఒకదాని తరువాత ఒకటి రెగ్యులర్‌గా కొనసాగుతున్న ఢీయే బెటర్ అనుకున్నాడు… ఎంచక్కా వచ్చేశాడు… డబ్బే కదా ఎవరైనా చూసేది… బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఢీకి వెల్కం చెప్పింది ఆ టీం… విచిత్రం ఏమిటంటే, గణేష్ మాస్టర్‌ను వెళ్లగొట్టేశారా..? శేఖర్, శ్రద్ధాదాస్ ఇద్దరేనా ఇక..?

పనిలోపనిగా శేఖర్ మాస్టర్‌తో సెంటిమెంట్, ఎమోషన్ డైలాగ్స్ పలికించారు,.,. మాకున్న కమిట్మెంట్స్‌కు వెళ్తుంటాం, వస్తుంటాం కానీ, అసలు తల్లి మాత్రం ఇదే అని స్టేజీకి మొక్కించారు… అదెలా..? ఎవరికైనా సినిమాల్లో చాన్సులే అల్టిమేట్ కదా… ఆఫ్టరాల్ ఢీ షో ఎంత..? కామెడీ పోర్షన్‌కు అదే హైపర్ ఆది, తోడుగా బిగ్‌బాస్ జెస్సీ… ఇవన్నీ పక్కన పెడితే… పాత సీజన్ ఫినాలే కూడా చీదేసింది… కొత్త సీజన్ లాంచింగ్ ప్రభుదేవాను పిలిచారు కదా… చూడాలిక దాని రేటింగ్స్ ఏమిటో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions