ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు ఇప్పుడు కామన్… వాటిమధ్య మన ఆలోచనలు ఇరుక్కుని ఏది నిజమో తెలియని దురవస్థల్లోకి నెట్టేయబడుతున్నాం… రాజకీయ పార్టీలైతే ఈ ఫేక్‌తనాన్ని ఓ ట్రెండ్‌లా మార్చేసి రకరకాల ఫేక్ పత్రికా వార్తల్ని, క్లిప్పింగులను సోషల్ మీడియాలో ప్రవేశపెడుతూ మనతో ఆడుకుంటున్నాయి… ఎన్నికలు రానివ్వండి, ఇది ఇంకా ఏ రేంజుకు తీసుకుపోతుందో… మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా చూశాం కదా…
ఆమధ్య మనం ఒక స్టోరీ గురించి చెప్పుకున్నాం గుర్తుందా..? పదే పదే ఫేస్‌బుక్‌లో కనిపించేది… అనేక ఖాతాల పేర్లతో… చూడగానే అది బీబీసీ వార్త అనిపించేలా కనిపిస్తుంది… అందులో ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్ ‘‘నేనేం చేశానో తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది’’ అని చెబుతుంటాడు… ఆయన వద్దంటున్నా సరే మేం ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేస్తున్నాం అంటుంది ఆ పోస్టు… సన్‌టీవీ జర్నలిస్టు కనిపిస్తుంది… అంత సిగ్గుమాలిన పని ఏం చేశాడబ్బా అని ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే అదేదో వెబ్ సైట్లోకి తీసుకుపోతుంది…
అందులో కరణ్ థాపర్ ఫలానా పని చేయండి, మస్తు డబ్బు ఇట్టే మన పర్సులో పడిపోతుంది అని చెబుతున్నట్టు ఉంటుంది… అంతేనా..? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫోటో, ఇదంతా నిజమే అన్నట్టుగా ఆయన పేరిట ఓ ప్రకటన, ఆ పక్కనే సేమ్, షారూక్ ఖాన్ ఎండార్స్‌మెంట్ కూడా కనిపిస్తాయి… చాలామంది ఎంతెంత సంపాదించారో ఫోటోలతో సహా సక్సెస్ స్టోరీలు కనిపిస్తాయి… దాని పేరు Immediate Bitwave… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆల్గరిథమ్స్ వల్ల ఈ సంపాదన సాధ్యమవుతున్నట్టు నమ్మపలుకుతుంది ఆ సైట్… డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో కూడా చెబుతుంది… మేం మీ తరఫున క్రిప్టోకరెన్సీని ట్రేడింగ్ చేస్తామంటుంది…
Ads
ఇక్కడ ఆగండి… మనం ఫేక్ అని చెప్పుకున్నాం కదా ఈ కథనం మొదట్లోనే… ఎస్, ఇదీ అదే… ఓ పెద్ద స్కాండల్… బీబీసీ, సన్‌టీవీ, కరణ్ థాపర్, షారూక్, సుందర్ పిచాయ్ పేర్లను వాడుకుంటూ ఫేక్ మార్కెటింగ్ చేసుకుంటున్న స్కాం… విచిత్రమేమిటంటే ఇలాంటి స్కాం పోస్టుల్ని కూడా ఫేస్‌బుక్ స్వయంగా ప్రమోట్ చేస్తుంది… డబ్బు తీసుకుని…!! చివరకు కరణ్ థాపర్ ఇదంతా ఫేక్ అనీ, నాకూ ఆ పోస్టులకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది…
ఇప్పుడు అలాంటి ఓ ఫేక్ పోస్ట్, అంటే ప్రమోటెడ్ పోస్ట్ కనిపిస్తోంది… ఈసారి సాయిపల్లవి… ఆమె ఓ లైవ్ ఇంటర్వ్యూలో అలా మాట్లాడుతుందని అనుకోలేదు, ఆర్బీఐ ఆమెను బుక్ చేయబోతోంది అని ఉంటుంది… పైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లోగో కనిపిస్తూ ఉంటుంది… అదేమిటబ్బా, విరాటపర్వం ప్రమోషన్స్ సమయంలో ఏదో కూసి కేసు పాలైంది కదా, అలాగే మళ్లీ అలాగే సాయిపల్లవి ఏమైనా మాట్లాడిందా అనుకుని ఓపెన్ చేస్తామా… యాంటీ వైరస్ ఉన్న కస్టమర్లకయితే ఇలా కనిపిస్తుంది…
ఏమో, ఏ పీవీఎన్ నుంచి ఓపెన్ చేసి ఉంటే… మన పాస్‌వర్డ్స్, మెసేజులు, క్రెడిట్ కార్డు డిటెయిల్స్ గట్రా గోవిందా అన్నమాటే… అసలు ఇక్కడ ఇష్యూ ఏమిటంటే… తలాతోకా లేకుండా, ఏమాత్రం హేతుబద్దత లేకుండా కమ్యూనిటీ స్టాండర్డ్స్ పేరిట ఫేస్ బుక్ ఖాతాలపై ఆంక్షల గండ్రగొడ్డలి ప్రయోగించే ఫేస్ బుక్ ఇలాంటి పెయిడ్, డేంజరస్ పోస్టులను ఎలా ప్రమోట్ చేస్తుందనేదే…!!
Share this Article