.
ఛావాతో దేశమంతా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న విక్కీ కౌశల్‌కు అసలు పరీక్ష ముందుంది… ఇన్నేళ్ల కెరీర్ ఒకెత్తు… ఇకపై ఒకెత్తు… తనపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం కాదు, తను చేయబోయే పాత్ర మరొకటి ఛాలెంజింగ్…
నిజానికి యురి, సర్దార్ ఉధమ్, శామ్ బహదూర్ పాత్రలకన్నా ముందు విక్కీ కౌశల్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు… తను నటుడే కాదు, టీవీ హోస్ట్, మ్యూజిక్ వీడియోస్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా… పుష్కరం క్రితం వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, తరువాత రాజీ తనకు నటుడిగా పేరు తెచ్చాయి…
Ads
అంతే… కామకథలు వంటి పిచ్చి పిచ్చి పాత్రలు కూడా చేశాడు… కత్రినా కైఫ్‌తో పెళ్లి,.. ఎప్పుడైతే యురి చాన్స్ వచ్చిందో తన కెరీర్ మలుపు తిరిగింది… ఐనా సరే, తరువాత Bad Newz లాంటి చెత్త… ఆ తరువాత #Dunki మూవీలో ఆ సైడ్ కేరక్టర్… ఏమిటీ ఈ మనిషికి పిచ్చిపట్టిందా అనుకున్నారు అందరూ…
సరే, లక్ బాగుంది… తరువాత మంచి పాత్రలు పడ్డాయి… ఏ నటుడికైనా అదృష్టం… దానికి తోడు కష్టపడతాడు, పాత్రలోకి దూరిపోతాడు… శామ్ బహదూర్ పాత్రే ఉదాహరణ… ఇక ఛావాతో ఇప్పుడిక తిరుగులేదు… శంభాజీ మహారాజ్ పాత్ర విశ్వరూపం… 600 కోట్ల వసూళ్లు ఇప్పటికే… బ్లాక్ బస్టర్…
ఈ నేపథ్యం దేనికో తెలుసా..? తను చేయబోయే తదుపరి పాత్ర కోసం… ఆ పాత్ర పరుశురాముడి పాత్ర… అవును, క్షత్రియుల్ని వరుసగా ఊచకోత కోసిన ఓ బ్రాహ్మణ సాయుధుడి పాత్ర… ఇంకేముంది..? అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నయ్…
ఛావ్లా తీసిన మాడ్‌డాక్ ఫిలిమ్సే ఈ సినిమా తీయబోతోంది… వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్… ఆల్రెడీ తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు… ఇలా…
ఇప్పుడు అసలు సమస్య ఆ పాత్ర కేరక్టరైజేషన్… విక్కీ కౌశల్‌దేముంది..? నో డౌట్, ఇరగదీస్తాడు… కానీ తండ్రి చెప్పగానే వెంటనే అనాలోచితంగా తల్లిని చంపిన ఓ కొడుకు, వరుసగా క్షత్రియ రాజుల్ని గండ్రగొడ్డలితో నరికిన ఓ ఆవేశపరుడు… ఆ వ్యక్తిత్వాన్ని ఎలా జస్టిఫై చేస్తారు, జనానికి కనెక్టవుతుందా అని…
యాక్షన్ ఒక్కటే సరిపోదు… ఆగ్రహం, ఆవేశం, ఉగ్రం, రౌద్రం మాత్రమే సరిపోదు జనాన్ని కనెక్ట్ కావడానికి… జస్టిఫై చేయబడాలి… ఎస్, స్టోరీ రీటెల్లింగ్ అంటేనే కాస్త క్రియేటివిటీ, కాస్త డిఫరెన్స్ కేరక్టరైజేషన్… పైగా మూవీ అనేసరికి క్రియేటివ్ లిబర్టీ బోలెడంత… అదుగో అక్కడే ఉంది సమస్య…
పరుశురాముడు అనగానే జనంలో ఓ ఫిక్స్‌డ్ ఒపీనియన్ ఉంటుంది… దాన్ని డిస్టర్బ్ చేయకుండా కథ కొత్తగా చెప్పాలి… కన్విన్స్ చేయాలి, అదీ అసలైన ఛాలెంజ్… చూడాలిక..!! (టాలీవుడ్ తలకాయలూ చూడండర్రా… తొక్కలో గుట్కా, వెగటు స్టెప్పుల సినిమాలు ఎన్ని తీస్తారు ఇంకా…?)
Share this Article