.
‘‘నేను పేదదాన్నే… కానీ గుణంలో కాదు… దాతృత్వంలో కాదు… నా దగ్గర పది మందికీ సాయం చేయడానికి సరిపడా డబ్బు లేకపోవచ్చు… కానీ నా చనుబాలు ఉన్నాయి… ’’
…. ఇదీ టెక్సాస్‌కు చెందిన మహాతల్లి అలిస్ ఒలెట్రీ మాట… నిజానికి చాలా గొప్ప విషయాలను మనం చిన్నవిగా కొట్టిపారేస్తుంటాం, తీసిపారేస్తుంటాం… కానీ ఈ మాట నిజంగానే ఎంత గొప్పది… ఆ హృదయపు లోతుల్ని కొలవడం ఎలా సాధ్యం..? ఏ కొలమానాల్లో..? లీటర్లలోనా..? నాన్సెన్స్…
Ads
చాలామంది కొత్త తల్లులకు తమ శిశువులకు సరిపడా చనుబాలు పడవు… అంటే ఉత్పత్తి కావు… చనుబాలను మించి పౌష్టికాహారం, రోగనిరోధకం మరొకటి లేదు శిశువులకు… మనకు గతంలో కూడా తెలుసు కదా…
ఎవరికైనా శిశువులకు చనుబాలు అవసరముంటే… పాలు సమృద్ధిగా ఉత్పత్తయ్యే తల్లులు వచ్చి కొన్నాళ్లు పాలుబట్టి శిశువు ఎదుగుదలకు తామూ కారణమై… ఒకరకంగా సరోగేట్ మదర్స్ అవుతుంటారు… దీన్ని వ్యవస్థీకృతం చేస్తే అవి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్…
మనం చెప్పుకునే తల్లి పేరు అలౌస్ ఒలెట్రీ… ప్రస్తుతం ఆమె వయస్సు 36 ఏళ్లు… చనుబాలు దానం చేయడంలో తన పాత రికార్డును తనే బ్రేక్ చేసింది… మామూలుగా కాదు, ఇప్పట్లో బహుశా ఎవరూ తన దరిదాపుల్లోకి చేరలేరేమో…
2645 లీటర్ల చనుబాలను (స్తన్యాన్ని) దానం చేసింది ఆమె… గతంలో 1569 లీటర్ల రికార్డు కూడా ఆమెదే… తన రికార్డును తనే బ్రేక్ చేసింది… కానీ ఆశ్చర్యం వేసేదేమిటంటే… ఆమె ఔదార్యం కాదు… అంతగా వేల లీటర్ల స్తన్యం ఉత్పత్తి కావడం…
ఈ అసాధారణంగా పాలు ఊరడం వెనుక ఆమెకు అసాధారణ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు… అందరిలాగే ఓ సాదాసీదా గృహిణి… టైమ్‌కు సరైన తిండి, ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం… అంతే, అంతకుమించి ఆమె ఇతరులకు భిన్నంగా ఏమీ చేయదు ఈ స్తన్యం అధిక ఉత్పత్తికి…
వర్తమానంలోకి లెక్కల ప్రకారం… ఒక లీటర్ తల్లిపాలు 11 మంది శిశువుల ప్రాణాల్ని నిలుపుతాయి… ఈలెక్కన ఆమె పాలు ఏకంగా 3.5 లక్షల మంది నవజాత శిశువులకు (new born infants) ఉపయోగపడ్డాయి… ఇది ప్రపంచంలో ఏ దానంకన్నా తక్కువ..? నీకు మనసారా ధన్యవాదాలు తల్లీ…!
గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ బుక్ వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘‘అవును, నా హృదయం గొప్పది… నాకు పరులకు ఇవ్వదగినంత, సాయం చేయదగినంత డబ్బు లేకపోవచ్చుగాక, కానీ నా దేహం ఇస్తున్న ప్రతి పాలచుక్కనూ ఓ శిశువు ఆరోగ్యానికి ఇవ్వగలను… అది నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తోంది…’’ అన్నదామె…
తనకు మొదట కొడుకు పుట్టాడు… పేరు కైల్… ఇప్పుడతని వయస్సు 14 ఏళ్లు… తను పుట్టినప్పుడు పాలు వేస్ట్ అవుతుండేవి… కొడుక్కి పట్టగా బోలెడు పాలు మిగిలిపోయేవి… అది చూసిన నర్స్ సలహా ఇచ్చింది… బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ (మదర్ మిల్క్ బ్యాంక్) కు ఇవ్వవచ్చుగా, వేరే శిశువులు బతుకుతారు అని చెప్పింది…
అది 2010… పాలు ఎలా పిండాలో, సీసాలో ఎలా పట్టాలో, బ్యాంకుకు ఎలా ఇవ్వాలో నేర్చుకుంది ఆ నర్స్ సాయంతోనే… ఆమెకు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు… కేగ్ వయస్సు 12, కోరీ వయస్సు ఏడు… ‘ప్రపంచంలో నాకన్నా ఆనందపడే తల్లి ఎవరు’ అంటోంది ఇప్పుడు నవ్వుతూ… గ్రేట్ తల్లీ…
తను స్తన్యం దానం చేయడమే కాదు… ఇతరులకూ క్లాసులు తీసుకుంటోంది… చనుబాల ప్రాశస్త్యం గురించి, దానం ఎలా చేయాలో కూడా…!
Share this Article