Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఝండ్..! చూడాల్సిన మూవీ… ఎందుకు..? అది చెప్పేదే ఈ రియల్ రివ్యూ…!

March 5, 2022 by M S R

….. By…. Chaithanya Pingali ………… ఎక్కడ మొదలు పెట్టాలో తెలీట్లేదు. భాషలో, expression లో unlearning చాలా కావాలి dalit film maker తీసిన సినిమాల గురించి కాని, దళిత్ ఫిల్మ్ గురించి కాని రాయాలి అంటే. but cant resist…. pan indian movie అనేది ఈ కరోనా వచ్చిన నాటి నుండి నానుతోంది కదా అన్ని చోట్లా. అసలు pan indian movie అంటే ఏంటి? pan అంటే అర్థం presence across the nation. మరి ఒక సినిమాని అనేక భాషల్లో ఒకేసారి తీస్తే , రిలీజ్ చేస్తే.. pan indian movie అవుతుందా?

అవుతుందనే అనుకున్నాను jhund చూసే వరకు. ‘అవ్వదు’. ఇన్నేసి భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో.. pan india ఉండే ప్రధాన అంశాలు ఏవి ? కులం, మతం, gender వివక్ష, ఆర్ధిక అంతరాలు. వీటిని టచ్ చేయకుండా, వీటిని ప్రశ్నించకుండా, అనేక ప్రశ్నలకి సమాధనాలు చెప్పకుండా, వాడుకలో ఉన్న ‘dictionary’, vocabulary లని సరి చేయకుండా, మద్దూరి అన్నట్టు ‘నేల చదును’ చేసే పని కాకుండా ఎన్ని చేసినా, ఎన్ని తీసినా pan indian movies కావు . pan indian movie కి ఉదాహరణ అంటే, నిన్న రిలీజ్ అయిన jhund ఫిల్మ్.

‘మాల పల్లి’ నుండి నేను పని చేసిన లవ్ స్టోరి వరకు.. ‘గట్టు మీదున్న వాళ్ళం’ చాలా ప్రయత్నాలు చేసారు, చేసాము. oppressed sections జీవితాల మీద సినిమాలు తీయాలని. pain, guilt, చెప్పి తీరాలి అని ‘within industy’ చేసే ఫైట్ చాలా ఉంటుంది ఈ ప్రయత్నాల వెనక. పోగొట్టుకునేవి , పొందేవి కూడా quantify చేయలేని sincere fight ఉంటుంది.

Ads

కులానికి మాత్రమే కాదు, వుమన్ ఇష్యూ కాని, trans persons issues కాని.. తీయటమే గ్రేట్, market చేయటమే విక్టరి, రిలీజ్ చేయటమే సక్సెస్ లా ఉన్న చోట.. great, success లాంటి పదాల అర్థాలు మారుస్తున్నారు దళిత్ ఫిల్మ్ మేకర్స్. సినిమా గ్రామరే మార్చేస్తున్నారు. కాలా, పరియేరుం పెరుమాళ్, ఫండ్రి, కర్ణన్ , జై భీం లాంటి సినిమాల narrating style, craft, colours, point ని చెప్పే టెక్నిక్, వాటి కోసం మెటాఫర్స్ , montages , music.. ఎలా చూసినా most modern way లో చెప్పిన గొప్ప స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు.

jhund

jhund అలాంటి సినిమా. ‘130 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో పతకాలు తేగల ఆటగాళ్ళు ఎందుకు లేరు?’ అని బాధ పడతాం. జెన్యూన్ గానే బాధపడతం. కారణాలు వెతకం. తెలుసుకోం. ‘సరి చేసే ప్రయత్నం’ – out of syllabus మనకి. మన social structure కి మన దేశ అభివృద్ధికి సంబంధం ఏంటి? అనే సింపుల్ ప్రశ్న కూడా తట్టదు మనకి. జవాబు వెతకటమా.. no way. మనం చేయని పని maharastra కి చెందిన vijay borade చేశాడు.

slum soccer ని కుల మతాల భేదాలు వేళ్ళూనికుని ఉన్న నాగ్పూర్ లో చేసాడు. సక్సెస్స్ అయ్యాడు. సక్సెస్స్ అంటే అతని డెఫినిషన్ ‘గెలుపు’ కాదు. అతని కతని jhund గా తీసిన director నాగ్రాజ్ మంజులే సక్సెస్ కి ఇచ్చే నిర్వచనం కూడా అది కాదు. కథని ఒక్క లైన్లో చెప్పొచ్చు. చెప్పిన విధానాన్ని చెప్పటానికి మాత్రం one need to ulearn a lot. ideology + technical brilliance .. రెండిటి కాంబినేషన్ ఉన్న diretor నాగ్ రాజ్ మంజులే. ఈ రెండూ ఉన్న ఫిల్మ్ jhund.

ఎన్నో సినిమాలు ఉన్నాయ్ ఆటల మీద. jhund ఎందుకు భిన్నం? ఎలా భిన్నం? – ఎందుకు భిన్నమంటే చెప్పిన విధానం, ఎలా భిన్నం అంటే చెప్పిన విధానం. చెప్పిన విధానమే. ఎందుకు తాగుతారు? ఎందుకు so called దురల్వాట్లు ఉంటాయ్? భాషా, చదువు, బట్టలు, మ్యూజిక్ లాంటి వ్యక్తిగత, సామాజిక అంశాల నుండి దేశం ఎందుకు వెనకపడింది లాంటి .. ఎన్నో ‘ఎందుకు?’ లకి సమాధానం ఈ సినిమాలో ఉంది.

jhund

అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న దీక్షా భూమి ముందు నుండి పరిగెట్టే ‘డాన్’ వల్ల భిన్నం. ఆ పిల్లల పేర్లు, మత నేపధ్యాలు భిన్నం. తలాక్ అంశం వచ్చిన తీరు భిన్నం. సిక్కు కుర్రోడు ఇంకో సిక్కు కుర్రోడు ఫూట్బాల్ లో keeper, striker గా ఎదురు పడే సన్నివేశంలో class difference చూపిన తీరు భిన్నం. అసలు కాలు సరిగా లేని వ్యక్తి బాల్ ని ఎలా కొడతాడో , కొట్టాడో చూపించిన విధానం భిన్నం. ‘సారే జహాన్ సే అచ్చా’ background లో మోగిన సన్నివేశం భిన్నం. భారత్ అంటే ఏంటి అని పసివాడు అడిగిన విధానం భిన్నం. కోర్ట్ లో bharat defnition చెప్పకనే చెప్పిన అమితాబ్ డైలాగ్ భిన్నం. silence, మాట.. అన్నీ భిన్నమే గతంలో వచ్చిన సినిమాల తో పోలిస్తే.

ప్రతి sports film కి ఒకటే రకం climax. మన వాళ్ళు గెలుస్తారు, జన గణ మన మోగుతుంది. ఈ cinema climax మన ఛాతి ఉబ్బించి, సీట్ నుండి లేచి నిలబడేది కాదు. ‘ఛీ.. ఇదా నా దేశం’ అని ఉఫ్ఫో ఉఫ్ఫో అని చీదేది కాదు. గొప్ప ఆశ, బిడ్డ కడుపున పడింది అని తెలిసినప్పటి నుండి బిడ్డ భూమి మీద ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే గొప్ప ఆశ కలిగిస్తుంది. సీన్లు కాని, డైలాగులు కాని.. చూడాల్సిన సినిమా తప్ప ఇది చెప్పేది కాదు, చెప్పాల్సింది అసలు కాదు. pl watch…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions