.
నో డౌట్… ఆదానీపై మోడీ ప్రేమ నిజం… బీజేపీకి ఆదానీ ఆర్థిక మద్దతు నిజం… సేమ్… వాషింగ్టన్ పోస్టు వంటి అమెరికా పత్రికలకు ఆదానీపై విద్వేషం నిజం, హిండెన్ బర్గ్ వంటి షార్ట్ సెల్లింగ్ బ్రోకర్ కంపెనీలకూ విద్వేషం అనేది నిజం…
అమెరికా మీడియా వార్తలను బట్టి ఆదానీపై అమెరికాలో కేసులు కూడా నిజమే… మోడీ రక్షణ కూడా నిజమే… ఐతే ఎల్ఐసీ డబ్బును వేల కోట్లను ఆదానీకి అప్పగించాడా మోడీ..,? తప్పు… అలా ఉదారం పంచిపెట్టింది ఏమీ లేదు…
Ads
ముందుగా ఎల్ఐసీ ఇంకా ఏయే కంపెనీల్లో ఎంత పెట్టుబడులు పెట్టిందో చూద్దాం…
ఎల్ఐసీ భారతదేశంలోని టాప్-500 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది… 2025 నాటికి ఎల్ఐసీ మొత్తం పెట్టుబడుల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరింది… అదానీ గ్రూప్‌తో సహా, ఎల్ఐసీకి ఇతర పెద్ద కంపెనీలలో ఉన్న ముఖ్య వాటాల వివరాలు (సుమారు విలువలు…)
| కంపెనీ | వాటా శాతం | పెట్టుబడి విలువ |
| టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ | 5.02% | రూ. 5.7 లక్షల కోట్లు |
| రిలయన్స్ ఇండస్ట్రీస్ | 6.94% | రూ. 1.34 లక్షల కోట్లు |
| ఐటీసీ (ITC) | 15.86% | రూ. 82,800 కోట్లు |
| ఎస్బీఐ (SBI) | 9.50% | రూ. 79,361 కోట్లు |
| హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ | 4.89% | రూ. 64,725 కోట్లు |
| ఆదానీ గ్రూప్ కంపెనీలు | 4% | రూ. 60,000 కోట్లు |
ఎల్ఐసీ భారతదేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు… బోర్డు ఆమోదించిన పెట్టుబడి విధానాల ప్రకారం పెట్టుబడులను స్వతంత్రంగా నిర్ణయిస్తుంది… దీని ముఖ్య ఉద్దేశం పెట్టుబడులపై సాధ్యమైనంత ఉత్తమమైన రాబడిని (రిటర్న్) పొందడం…
హిండెన్ బర్గ్ నివేదిక తరవాత ఆదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పడిపోయేసరికి మోడీ కావాలని ఎల్ఐసీ నుంచి ఆదానీ గ్రూపుల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టించాడనేది అమెరికా మీడియా వార్తల సారాంశం…
అసలు హిండెన్ బర్గ్ వార్తలే ఉద్దేశపూరితం అని తేలింది… తరువాత ఆదానీ షేర్ల విలువ పెరగడం వల్ల ఎల్ఐసీ పెట్టుబడుల విలువ పెరిగింది…
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 22,378 కోట్లు పెరిగి, 59% రిటర్న్‌ను ఇచ్చాయి…
ఆదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎల్ఐసీ ఒక్కటే కాదు… అనేక దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టాయి లేదా రుణాలు ఇచ్చాయి…
ప్రభుత్వ రంగ బ్యాంకులు..: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా ప్రభుత్వ బ్యాంకుల నుండి అదానీ గ్రూప్ రూ. 81,234 కోట్ల రుణాలలో అధిక భాగాన్ని తీసుకుంది… (2023 జనవరి నాటి అంచనా ప్రకారం, ఇది మొత్తం రుణాలలో 38%)… ఎస్‌బీఐ నుంచి రుణాలు భారీగా ఇప్పించడంలో కూడా మోడీ ఒత్తిళ్లు ఉన్నట్టు ఓ ఆరోపణ చాలాకాలంగా ఉన్నదే…
ప్రైవేట్ బ్యాంకులు: ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా రుణాలను అందించాయి…
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs): GQG ఇన్వెస్ట్‌మెంట్: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ముఖ్యమైన అమెరికన్ పెట్టుబడి సంస్థ… ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA)… అబు దాబికి చెందిన IHC… ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్: అదానీ టోటల్ గ్యాస్ (ATGL)లో సుమారు 37.4% , అదానీ గ్రీన్ ఎనర్జీ (AEGL)లో సుమారు 19.75% వాటాలను కలిగి ఉంది…(అయితే, లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు కొత్త పెట్టుబడులు పెట్టబోమని టోటల్ ఎనర్జీస్ ప్రకటించింది)….
అమెరికన్ బీమా సంస్థలు: అపోలో (Apollo), అథేన్ (Athene) వంటి అమెరికన్ బీమా సంస్థలు కూడా అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి….
ఈ పెట్టుబడులు షేర్ల వాటాలు, రుణాలు (నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు – NCDలు, సిండికేట్ రుణాలు మొదలైనవి) రూపంలో ఉన్నాయి… ఇదీ ఆదానీ గ్రూపు అసలు ముఖచిత్రం..!! మరి సమగ్ర దర్యాప్తు అని ప్రతిపక్షాల డిమాండ్లు నెరవేరుతాయా..? అన్నీ లీగల్ స్టెప్స్, ఎక్కడా ఏ తప్పూ దొరకదు… హిండెన్ బర్గ్ విద్వేష కథనాల్లాగే ఇదీ కొన్నాళ్లకు కొట్టుకుపోతుంది..!!
Share this Article