Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వడ్డీ లేని అప్పు అనగానే తలొగ్గకండి… నడ్డి విరిగిపోగలదు..!!

February 23, 2021 by M S R

కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో ఓ పది నిముషాలు:

గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది?
అవును చెప్పండి.
సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్!

OK రాజేష్….?!

అంతే కాదు సార్ ఈ కార్డు ఉపయోగించి మీరు అవసరానికి క్యాష్ తీసుకోవచ్చు సార్. అలా తీసుకున్న క్యాష్ కు వడ్డీ ఉండదు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ!

ఒకే…?!

సార్ మీ కార్డ్ లిమిట్ 2 లక్షలు సార్ అందులో 28 % మీరు క్యాష్ తీసుకోవచ్చు సార్. మీరు ఒకే అంటే మీ కన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ఈ కార్డు మా ఫైనాన్స్ ఆఫీసర్ మీకు అందిస్తారు సార్.

రాజేష్ నేను ఎంత క్యాష్ తీసుకోవచ్చు?

28% సార్, ఒక్క నిముషం సార్. Calculate చేసి చెబుతాను సార్.

28 శాతం అంటే, 56 వేలు రాజేష్ దానికి క్యాలుకులేటర్ ఎందుకులే.

ఒక్క నిముషం సార్….ఆ… అవును సార్ 56 వేలు. సార్ ఒకే చేసేయ్యమంటారా?

ఒకే చేసే ముందు కొన్ని డీటెయిల్స్ కావాలి రాజేష్. ఇప్పుడు ఈ 56 వేలకి చార్జెస్ ఎంత?

Upto 50 days no ఇంటరెస్ట్ సార్… ఇట్ ఇస్ టోటలీ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్.

50 రోజుల తర్వాత ఇంట్రెస్ట్ ఎంత?

Only 4% సార్!

ఓన్లీ 4%, per month or per year?

Per month sir!

Mr రాజేష్, నెలకు 4% అంటే సంవత్సరానికి ఎంతో తెలుసుగా…

ఒక్క నిముషం సార్, calculate చేసి చెబుతాను సార్!

అవసరం లేదు ఇది చిన్న లెక్క. 48 శాతం! అంటే 56 వేలకి ఎంతవుతుందో తెలుసా?!

ఒక్క నిముషం సార్ చూసి చెబుతాను సార్.

చూడవలసిన అవసరం లేదు… సంవత్సరానికి 28 వేలకి కొంచెం తక్కువ!

ఒక్క నిమిషం సార్…26 వేలా 880 సార్.

రాజేష్ ఇది ఒక సంవత్సరానికి. రెండు సంవత్సరాలకి దాదాపు 55 వేలు. అయినా 56 వేల క్యాష్ తీసుకొని 27 వేలు వడ్డీ కడితే వాడు బాగుపడతాడా?!

కానీ సార్ 50 రోజులు దాటితేనే వడ్డీ సార్, 50 రోజుల వరకూ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్!

కానీ రాజేష్, ఈ 50 రోజులవరకు దీనికి ప్రాసెసింగ్ ఫీ ఎంత?

జీరో ప్రాసెస్సింగ్ ఫీ సార్. Also ఇంట్రెస్ట్ ఫ్రీ సార్.

రాజేష్… దీనికి ఎదో ఒక ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ ఎంతో చెప్పు.

సార్ పూర్తిగా ఫ్రీ సార్.

లేదు రాజేష్, తప్పకుండా ఎదో ఒకటి ఉంటుంది…సర్వీస్ ఛార్జ్, transaction చార్జీ, one time ఫీ లాంటి ఎదో పేరుతో ఉంటుంది. అదేంటో కాస్త ఓపెన్ గా చెప్పండి!

సార్ అవేమీ లేవు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ సర్.

అయితే నాకు ఈ కార్డు వద్దు రాజేష్. థాంక్యూ.

సార్ ఎందుకు సార్…మంచి ఆఫర్ సార్… తీసుకోండి సార్.

లేదు రాజేష్ ఎదో దాచిపెట్టే వాళ్ళతో నేను డీల్ చెయ్యను. మీరు ఎదో దాస్తున్నారు కాబట్టి నేను మీ కంపెనీతో డీల్ చెయ్యను.

మీరన్న చార్జీలు ఏవీ లేవు సార్. ఒకే ఒక onetime handling ఛార్జ్ ఉంది సార్, అది కూడా కేవలం 2.5% సార్.

Hmmmm. ఈ కార్డ్ కు annual ఫీ ఎంత?

ఓన్లీ 499 per year సార్.

ప్లస్ సర్వీస్ టాక్స్?

యెస్ సార్. 499 ప్లస్ సర్వీస్ టాక్స్.

అంటే నేను 56 వేలు డబ్బు తీసుకొంటే 50 రోజుల్లో దాదాపు 2 వేలు ముందుగా కట్టాలి.

ఒక్క నిముషం సార్ చూసి చెబుతాను….

అవసరం లేదు రాజేష్. 2.5%+499+సర్వీస్ టాక్స్ అంత వస్తుంది.

అవును సార్.

రాజేష్ ఓ విషయం చెప్పనా…మీ మాటల్ని బట్టి మీరు కనీసం ఎంబీఏ చేసుంటారు లేదా పీజీ చేసుంటారు.

అవును సార్.

loans

ఎంబీఏ చదివి మీరు చేస్తున్నదేంటో తెలుసా…పచ్చి మోసం, దగా! నేను సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఆ రెండు వేల విషయం చెప్పారు. అదే ఏ రైతుకో లేక ఏదో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో ఈ కార్డు అంటగట్టేటప్పుడు మీరు ఇలాగే విషయాన్ని దాచిపెట్టి వాళ్లకు కార్డు అమ్మేస్తుంటారు. వాళ్ళు కూడా కార్డు ఉంది కదా అని వచ్చే దసరాకో, లేదు పంటకు ఎరువుల కోసమో డబ్బు తీసుకొని దానికి వడ్డీ కట్టడానికి తన 6 నెలల పంట ఆదాయం, చిరు ఉద్యోగి అయితే తన ఒకనెల జీతం మీకు కట్టి, తన ఇల్లు గడవడానికి ఇంకో చోట అప్పు చేసి అలా అలా అప్పుల్లో కూరుకుపోతాడు. ఇదంతా ఎందుకు కేవలం మీరు మీ టార్గెట్లు పూర్తిచేయడానికి. అంటే 100 కార్డులు టార్గెట్ అయితే నెలకు దాదాపు 90 కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.

అదేం లేదు సార్. కార్డు డెలివర్ చేసేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఈ చార్జీల గురించి కస్టమర్లకు చెబుతారు సార్.

రాజేష్, కస్టమర్ అంటే ఎవరో తెలుసా.. customer is the one who keeps the custom. Custom is the traditional and acceptable behaviour in society. So customer is keeping acceptable behaviour but is our behaviour as sales person socially acceptable? నాకు తెలిసి బజాజ్ ఫైనాన్స్ గత సంవత్సరం 43వేల కోట్ల లాభం ఆర్జించింది. ఈ 48% వడ్డీ, ఇంకొన్ని కొత్త ప్రొడక్ట్స్ తో ఈ సంవత్సరం 86 వేల కోట్లు సంపాదిస్తుంది 2020లో 2లక్షల కోట్లు ఆర్జిస్తుంది. ఇది ఒక్క బజాజ్ మాత్రమే కాదు, icici అయినా, hdfc అయినా, kotak అయినా అందరూ అంతే. ఎవణ్ణో కోటీశ్వరుని చేయడానికి మనం…మనలాంటి చదువుకున్నోళ్లు ఎంతమందిని మోసం చేస్తాం…మన చదువులకు అర్థముందా?! 10వ తరగతి వరకూ రోజూ ప్రేయర్లో నిలబడి.. భారతదేశం నా మాతృభూమి, భారతీయయులందరూ నా సహోదరులు… అని ప్రతిజ్ఞ చేసాం. ఇదేనా మనం మన తోటి భారతీయ్యునికి చేస్తున్నది? ఇదే ఓ మాల్యా, నీరవ్ మోడీ చేస్తే వాళ్ళను దేశద్రోహులంటాము. మనం చేస్తే టార్గెట్ achievement అని స్టయిల్ గా ఇంగ్లీష్ లో కాలరేగరేస్తాం. నేను గత 25 సం గా సేల్స్ లో ఉన్నాను. మొదట చాలా అబద్దాలు చెప్పేవాణ్ణి కానీ త్వరలోనే నాకర్థమయ్యింది ఏంటంటే…సేల్స్ లో రాణించడానికి అబద్దాలు చెప్పవలసిన అవసరం లేదు. ఓ తప్పుడు ప్రొడక్ట్ అమ్మవల్సిన పని లేదు. పూర్తి నిజాయితీతో ఎవ్వరినీ నొప్పించకుండా కూడా టార్గెట్లు achieve చెయ్యొచ్చు.

సార్ మీరు ఏమి అనుకోనంటే ఓ ప్రశ్న అడగనా?

అడుగు రాజేష్…

ఈ 4 ఇన్ 1 కార్డు అమ్మడం నా ఉద్యోగం. 48% వడ్డీ ఛార్జ్ చేసే కార్డు నిజం చెబితే ఎవరు కొంటారు సార్?

రాజేష్ సింపుల్….మొదట ఇలా ప్రజలను దోచుకొనే బజాజ్, kotak లాంటి కంపెనీలలో పనిచేయడం అవసరమా అని ఆలోచించుకోండి. అనివార్యమైతే ఇదే కార్డును ఇంకోలా అమ్మోచ్చు. దీన్ని 4 ఇన్ 1 సూపర్ ఎమర్జెన్సీ కార్డు అని చెప్పండి. మనలో ఎవరికైనా…ఎక్కడైనా ఎమర్జెన్సీ రావచ్చు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు, వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు పర్సు దొంగతనం అవ్వొచ్చు, మన పిల్లలకు ఏదైనా అవసరం రావచ్చు. అత్యవసరంలో ప్రైవేటు వడ్డీవ్యాపారులు 5 రూపాయల వడ్డీ అంటే 60 శాతం వడ్డీ అడుగుతారు కానీ బజాజ్ maximum 48% తీసుకొంటుంది. ఆ లోన్ కు మీరు ఏమీ తాకట్టు పెట్టనవసరం లేదు. కేవలం 10 నిముషాల్లో డబ్బు మీ చేతిలో ఉంటుంది. అదే 50 రోజుల్లో కట్టేస్తే కేవలం 18 శాతం వడ్డీ. ఈ ఎమెర్జెన్సీకోసం మీరు కట్టవలసిందల్లా కార్డు ఫీ సంవత్సరానికి కేవలం 499 రూపాయలు+GST అంతే.

(అటువైపు నుండి పూర్తి నిశ్శబ్దం. ఆలోచిస్తున్నాడని అర్థమయ్యింది). ఆలోచించండి Mr Rajesh కేవలం ఉద్యోగంలో ఎదగడానికి మన విలువలన్నీ గాలికి వదలి కొన్ని వేల కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టవలసిన అవసరం లేదు. బ్రతకడానికి ఉద్యోగం కావాలి, ఉద్యోగమే బ్రతుకు కాకూడదు. Anyways sorry am not able to take this card but I sincerely wish you great success in your profession. (ఈ పోస్టు కొద్దిరోజులుగా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నదే… ఆలోచనాత్మకంగా ఉంది… ఎవడూ పుణ్యానికి రుణాలివ్వడు, ఎవరికేం తీట..? అసలు మర్మం వేరే ఉంటుంది, అది మన నడ్డి విరగ్గొడుతుంది… ఒరిజినల్ రచయిత ఎవరో గానీ చక్కగా రాశారు… అభినందనలు… ప్రజోపయోగార్థం ఈ షేరింగ్…)

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
  • అక్షర..! సర్కారీ విద్యలాగే… లైన్ తప్పి, వెగటు కామెడీలో గింగరాలు..!!
  • మామాఅల్లుళ్లకు అవమానమే..! ఐతేనేం, తమ్ముళ్లకు నమ్మకం పోతోంది మరి..!!
  • బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్‌లో చౌక సరుకే ఇది…!!
  • డర్టీ కాంట్రవర్సీ..! అమెరికన్లకు చైనా గుదపరీక్షలు..! ఓ పంచాయితీ..!!
  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now