.
నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయాలు, ఆలోచన తీరు చూస్తే తెలంగాణ జనం మీదే సానుభూతి కలుగుతోంది… పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుంది… అవును, కేసీయార్ పెనం, రేవంత్ పొయ్యి…
తరతరాలుగా తెలంగాణకు ఇదే కదా కర్మ..? ORR అనగా ఔటర్ రింగు రోడ్డు దాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను విస్తరించి, అన్ని గ్రామాల్నీ నిర్బంధంగా కలిపేసి… ఏదో ఉద్దరిస్తున్నట్టు నాలుగు కార్పొరేషన్లు చేస్తాం అన్నట్టుగా గతంలో బోలెడు లీకులు…
Ads
వోట్లేశాం కదా వీళ్లకు మన ఖర్మ అనుకున్నారు జనం… ఇప్పుడు ఏకంగా ORR దాటి RRR దాకా హెచ్‌ఎండీఏ పరిధి విస్తరిస్తారట… 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు ఒక్కటైపోతాయట… పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నారట… ఇలాగే… గతంలో తుగ్లక్ అని ఒకాయన ఉండేవాడు… ఈ పరిధి మొత్తం అర్బన్ తెలంగాణ అట…
అసలు GHMC పరిధిలోనే పౌర సౌకర్యాలు పట్టేవాడు లేడు… సమీక్షల్లేవు, నిర్ణయాల్లేవు… హడ్డీమార్ గుడ్డిదెబ్బ… మంత్రుల్లో సమన్వయం లేదు, అధికారుల మీద పట్టు లేదు, ఎవడికీ ఏమీ పట్టదు… ఇప్పుడు ఇక RRR దాకా హైదరాబాదేనట… వావ్, ఏం తెలివి మాస్టారూ… ఇక ప్రతిరోజూ దీపావళే జనానికి…
చూడండి, టాక్సులు పెరుగుతాయి… పట్టించుకునేవాడు ఉండడు… ఫ్యూచర్ సిటీ అని మోకాలి బెల్లం చూపిస్తారు, నాకిస్తారు… పోనీ, మేం బాగా ఉద్దరిస్తున్నాం, ఎన్నికలకు వెళ్తాం, జనం మాకు గుడ్డిగా వోట్లేస్తారు అనే పిచ్చి నమ్మకం ఉందా, అదీ లేదు…
స్థానిక ఎన్నికలకు వెళ్లదు ఈ ప్రభుత్వం… అసలే పల్లెల్లో తిడుతున్నారు, ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఇజ్జత్ పోతుంది,.. బీఆర్ఎస్ పుంజుకుంటుంది… అవును, నిజమే, మేధోజనానికీ ఆ భయం ఉంది, కానీ వీళ్లకన్నా ఆ పాత గులాబీ భూతాలే నయం అనిపిస్తున్నది కదా…
ప్చ్, తెలంగాణ సమాజం… బీజేపీలో కాస్త డొక్క శుద్ది, బుర్ర శుద్ధి ఉన్నవాడు లీడర్‌గా ఉంటే ఎంత బాగుండు..? బీఆర్ఎస్ మళ్లీ వస్తే మళ్లీ అదే కేటీయార్, అదే హరీష్… వాళ్ల తొట్టి గ్యాంగులు తప్ప మరో ఖర్మ ఉండదు తెలంగాణకు… అవకాశం ఇస్తే మేమెంత తోపులమో చూపించారు కాంగ్రెస్ లీడర్లు…
మరెవరు దిక్కు..? ఓ శూన్యం… అందులోకి వచ్చేవాడు లేడు… పొరపాటున మళ్లీ సోకాల్డ్ వీర తెలంగాణ ప్రేమికులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ బలం పుంజుకుంటారోననే భయం అలాగే పెరుగుతోంది మరోవైపు… ఏం ఖర్మ పట్టిందిరా బాబూ తెలంగాణకు..?!
ఈలోపు ఎవరేం చేయాలి..? కాస్త పౌరసౌకర్యాలు, జనసంక్షేమం పట్టించుకొండిరా అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త బుద్దినేర్పాలి అని రాబోయే కాలేశ్వరం త్రివేణీ పుష్కర స్నానాల్లో మునిగి ప్రార్థిద్దాం… ఫాఫం, తెలంగాణ జనం ఎప్పుడూ అన్నాడిగాళ్లే..!! ఎప్పటికప్పుడు ఏమి సేతురా లింగా అని ఏడవడమే..!!
Share this Article