నో డౌట్… లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్‌కు కారణాల్లో పూరీ దిక్కుమాలిన దర్శకత్వం ప్రధాన కారణమే… ముట్లుడిగిన కేరక్టర్ తను… ఇంకా తనను పట్టుకు వేలాడటం విజయ్ దేవరకొండ తప్పు… దేశమంతా ఎక్కడ ప్రమోషన్ మీట్ పెట్టినా సరే విజయ్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ కనిపించింది… కాకపోతే విజయ్ యాటిట్యూడ్ వ్యాఖ్యలు కూడా సినిమాను దారుణంగా దెబ్బతీశాయి… అది తను అంగీకరించకపోయినా సరే, తను ఓసారి నేలమీదకు దిగిరావాలి అనే కోరిక ప్రేక్షకుల్లో కనిపించింది…
ఈరోజు ప్రేక్షకుల పట్ల ఒద్దిక, అణకువ చూపించాలి… కానీ బలుపు చూపించొద్దు… విజయ్ దేవరకొండకు ఆ సోయి లోపించింది… ఆ దెబ్బ లైగర్ మీద దారుణంగా పనిచేసింది… చార్మి 20 ఏళ్ల కష్టం నాశనం అయిపోయిందని ఏడ్చినా, పూరీ నా బతుకు బస్టాండ్ అయిపోయిందని శోకాలు పెట్టినా సరే… విజయ్ కోల్పోయిన పాపులారిటీ ముందు అవి చాలా తక్కువ… కారణం విజయ్ స్వయంకృతాపరాధమే… బలుపు ఎల్లవేళలా పనికిరాదు… దశాబ్దాల సినిమా పరిశ్రమ ప్రేక్షకులను దేవుళ్లుగా చూసింది, అలాగే మొక్కింది… కానీ ఎవడురా బాయ్‌కాట్ చేసేది, కొట్లాడదాం అని తలపొగరు చూపించలేదు…
కరోనా లేకుండా ఉంటే థియేటర్స్ నింపుతా… సినిమాతో ఇండియా షేక్ చేస్తా… వాట్ లగా దేంగే, ఆగ్ లగా దేంగే… అయ్యా తెలీదు లేదు.. తాత తెలీదు, నేను స్టార్… 200 కోట్ల నుంచి స్టార్ట్ చేస్తున్నా… చూస్తే చూడండి లేదంటే లేదు… ఆ బాడీ లాంగ్వేజీ, ఆ మాట తీరు అన్నీ ప్రేక్షకుల్లో నెగెటివిటీని నింపాయి… దానికితోడు చెత్తా సినిమా కథనం… ఓవరాక్షన్… దిక్కుమాలిన ట్రీట్‌మెంట్… వెరసి లైగర్ చంకనాకిపోయింది…
Ads
చేతులు, మూతులు కాలిపోయాక… ఇప్పుడు విజయ్ దేవరకొండ తన పట్ల దురభిప్రాయాన్ని తొలగించుకునే పనిలో పడ్డాడు… బాలీవుడ్ లో నచ్చని సినిమాలను బహిష్కరించాలంటూ నడుస్తున్న ‘బాయ్ కాట్ ట్రెండ్’ తెలుగు కదా… మహా పొగరు ఆమీర్‌ఖాన్, కరీనాఖాన్ కూడా దిగివచ్చి ప్రేక్షకులను బతిమిలాడుకునే సిట్యుయేషన్, కానీ విజయ్ మాత్రం తిక్క తిక్కగా స్పందించాడు… దాంతో ముంబైలోని మరాఠా మందిర్ అండ్ గైటీ గెలాక్సీ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ను అహంకారిగా అభివర్ణించారు. అంతేకాదు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలంటూ హితవు చెప్పాడు…
నేల మీదకు దిగివచ్చిన విజయ్ దేవరకొండకు మెల్లిగా తత్వం అర్థమవుతోంది… ముంబై చేరుకుని మనోజ్ దేశాయ్ ను కలుసుకున్నాడు. తన వ్యాఖ్యల్లోని ఉద్దేశ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు… తాను ప్రేక్షకులను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను సందర్భోచితంగా తీసుకోవాలని కోరాడు… విజయ్ దేశాయ్ పాదాలకు నమస్కరించాడు… దీంతో విజయ్ పట్ల అపార్థాన్ని విజయ్ దేశాయ్ తొలగించుకున్నాడు… క్షమాపణ చెప్పాడు…
‘‘అతడు నిజంగా మంచి వ్యక్తి. ఒదిగి ఉండే వ్యక్తి. నేను అతడ్ని ఇష్టపడుతూనే ఉంటా… అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను ఈ సందర్భంగా ఇస్తున్న హామీ ఏమిటంటే అతడి సినిమాలు అన్నింటినీ నేను ప్రదర్శనకు తీసుకుంటాను. అతడికి అంతా మంచే జరగాలి’’ అంటూ విజయ్ దేశాయ్ ఓ వీడియో విడుదల చేశాడు…
I expect our #Bollywood stars should learn something from @TheDeverakonda
Humbleness is the key to success. Keep going Vijay! #VijayDevarakonda #ManojDesai pic.twitter.com/76xZnSyVIO
— Ravi Gupta (@FilmiHindustani) August 28, 2022
సరే, ఒక్కడు క్షమించేసి, ఫోబిడ్డా, ఇకపై బుద్దిగా ఉండు అన్నాడు అనుకొండి… అసలు జనమే తిరస్కరిస్తే ఆయన కూడా పీకేదేమీ ఉండదు… మారాల్సింది తన పొగరు… ఎస్, యువతలో తన వ్యాఖ్యల తీరు పట్ల వోవోవో అని కేకలు వినరావచ్చు, అదంతా నిజమైన పాపులారిటీ కాదు, అది దీర్ఘకాలం తనను నిలబెట్టేది కాదు… కేవలం హీరో యాటిట్యూడ్ సినిమాను సక్సెస్ చేయదు… పెద్ద పెద్ద తోపు హీరోలే కంటెంట్ లేని సినిమాలు తీసినప్పుడు డిజాస్టర్లను చవిచూశారు… అది తెలుసుకునే సోయి విజయ్‌కు లేదు… మనోజ్ దేశాయ్‌లు కాదు, ముందుగా క్షమించాల్సింది తెలుగు ఆడియెన్స్… మరి దానికేం చేస్తవ్ విజయ్..?! ‘‘ముచ్చట’’ ఇంతకుముందే చెప్పింది… ‘‘విజయ్ ఇండస్ట్రీలో చాలామంది తోపులు వచ్చిపోయారు’’ అని… ఇప్పటికీ నాది అదే హితవు..!!
Share this Article